యేసు జనియించె – ప్రభు యేసు జనియించె
శాంతికి దూతగా – ప్రేమకు మూర్తిగా
ఆశల జ్యోతిగా – మరియకు సుతునిగా /2/
యేసు జనియించె – ప్రభు యేసు జనియించె /2/
Happy Christmas – Merry Christmas /4/శాంతికి /
1.కలుషితాలే తెలియనోడు – కన్యకే జనియించే ..
పసిడి మనసే కలిగినోడు – పేదగా జనియించె
భువనాలనేలువాడు – భవనాలలోన కాదు
పశుశాలలోన నేలపై జనియించె – మన ప్రభువే జనియించె /శాంతికి/
2.శుభము కూర్చే – శిశువు తానై
దిశను మార్చే – సూచనై
పాపమంటి కారుచీకటిలో – ఒక పుణ్యకాంతియై ప్రసరించే.. – ప్రభు తానై – ప్రభవించే నిల! /శాంతికి/
3.నింగిలోని దివ్యవాణి నేలపై ధ్వనియించె
దైవమంటి మమత తానై మనిషిగా ఉదయించే
మనలోని బాధ తీర్చే – జనజీవితాలు మలచే – ఎనలేనిజాలై లాలిగుణమై నిలిచె – ప్రభుకిరణం – తొలికిరణం /శాంతికి/