-->
Song no: 38
నా ప్రియుడు యేసు నా ప్రియుడు
నా ప్రియునికి నే స్వంతమెగా } 2
నా ప్రియుడు నా వాడు } 2 ||నా ప్రియుడు||
- మరణపు ముల్లును నా లో విరిచి
మారాను మధురం గా చేసి } 2
మనస్సును మందిరము గా మార్చే } 2 ౹౹నా ప్రియుడు ౹౹
- కృపనే ధ్వజముగా నాపై నెత్తి
కృంగిన మదిని నింగి కెత్తి } 2
కృపతో పరవశ మొందించే } 2
౹౹నా ప్రియుడు ౹౹
- సంఘముగా నను చేర్చుకొని
సంపూర్ణ నియమములన్నియును } 2
సంగీతముగా వినిపించే } 2
౹౹నా ప్రియుడు ౹౹
- జీవితమే జలరేఖలుగా
చెదిరిన సమయములన్నింటిలో } 2
పిలుపును స్థిరపరచే కృపలో } 2
౹౹నా ప్రియుడు౹౹
- సంబరమే యేసు కౌగిలిలో
సర్వాంగ సుందరుడై వచ్చువేళ } 2
సమీపమాయే ఆ శుభవేళ } 2
౹౹ నా ప్రియుడు ౹౹
Song no: 37
కృపయే నేటి వరకు కాచెను
నా కృప నిన్ను విడువ దనినా ౹౹కృప౹౹
- మనోనేత్రములు వెలిగించినందున -
యేసు పిలిచిన పిలుపును
క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో-
పరిశుద్ధులలో చూపితివే ౹౹కృపా ౹౹
- జలములలో బడి వెళ్ళునపుడు -
అలలవలె అవి పొంగి రాగా
అలల వలే నీ కృపతోడై -
చేర్చెను నన్ను ఈ దరికి
౹౹కృపా ౹౹
- భీకర రూపము దాల్చిన లోకము -మ్రింగుటకు నన్ను సమీపించగా
ఆశ్చర్యకరములు ఆదుకొని
అందని కృపలో దాచెనుగా
౹౹కృపా౹౹
- సేవార్థమైన వీణెలతో నేను - వీణెలు వాయించు వైణికులున్నా
సీయోను కొరకే జీవించుచూ- సీయోను రాజుతో హర్షించేదను
౹౹కృపా౹౹
- నీదు వాక్యము - నా పాదములకు- నిత్యమైన వెలుగై యుండున్
నా కాలుజారె ననుకొనగా - నిలిపెను నన్ను నీ కృపయే
౹౹కృపా౹౹
Song no: 35
కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు - 2
నీ కృపలో నన్ను నిలుపుము - 2
నీ కృపతోనే నను నింపుము -2 ౹౹కృపా౹౹
- నీ కృప ఎంతో మహోన్నతము
ఆకాశము కంటే ఎత్తైయినది - 2
నీ సత్యం అత్యున్నతము
మేఘములంత ఎత్తున్నది - 2
౹౹కృపా౹౹
- నీ కృప జీవముకంటే ఉత్తమము
నీ కృప లేనిదే బ్రతుకలెను - 2
నీ కృపా బాహుళ్యంమే నను
నీలో నివసింప చేసినది - 2౹౹కృపా౹౹
- నీ కృపలను నిత్యము తలచి
నీ సత్యములో జీవింతును -2
నీ కృపాతిశయములనే
నిత్యము నేను కీర్తింతును -2 ౹౹కృపా౹౹
- ఈ లోకము ఆశాశ్వతము
నీదు కృపయే నిరంతరము -2
లోకమంతా దూషించినా
నీ కృప నాకంటే చాలు -2. ...౹౹కృపా౹౹