Showing posts with label John Chakravarthy. Show all posts
Showing posts with label John Chakravarthy. Show all posts

Neekanna yevaru vunnarayya lokamlo నీకన్నా ఎవరు ఉన్నారయ్యా లోకంలో నాకన్నీ నీవే నా యేసయ్య

Song no:

    నీకన్నా- ఎవరు ఉన్నారయ్యా లోకంలో
    నాకన్నీ నీవే నా - యేసయ్య (2)

    నా తల్లి నీవేనయ్యా - నా తండ్రి నీవేనయ్యా (2)
    మంచి స్నేహితుడైన నీవే - యేసయ్యా
    నిజ బంధువుడైన నీవే - యేసయ్యా (2) || నీకన్నా ||

  1. పాపమందు నేను - పడిపోయి ఉన్న వేళ
    లేవనెత్తినవు - కృప చూపినావు దేవా (2)
    నా పాపము తొలగుటకొరకై రక్తం కార్చితివి
    నన్ను శుద్ధిని చేయుట కొరకై సిలువ సహించితివి (2) || నా తల్లి నీవేనయ్యా ||

  2. ఆకలైన వేళ  - ఆహారమిచ్చినావు
    దాహమైన వేళ - జీవజలములిచ్చినావు (2)
    నా శాపము తొలగించుటకై సమాధి చేరితివి
    నన్ను మహిమకు మార్చుటకొరకై మరణం గెలిచితివి (2) || నా తల్లి నీవేనయ్యా ||

  3. వ్యాది యందు నేను - పడి కృంగియున్నవేళ
    పరము నుండి నాకై - దిగి వచ్చినావు దేవా (2)
    నీ గాయములందు ఉన్న స్వస్థత నిచ్చితివి
    నీ రెక్కల క్రింద నన్ను నిత్యము దాచితివి (2) || నా తల్లి నీవేనయ్యా ||