Showing posts with label Shalem raju. Show all posts
Showing posts with label Shalem raju. Show all posts

Deva na mora vinava naa prarthana alakinchava దేవా నా మొర వినవా నా ప్రార్థన ఆలకించవా

Song no:
HD
    దేవా నా మొర వినవా - నా ప్రార్థన ఆలకించవా . . . } 2
    నాపాపము నన్ను తరుమగా - నా ప్రాణము తల్లడిల్లగా .
    నీ చెంతకు చేరినానయ్యా - నీ శరణే కోరినానయ్యా || దేవా ||

  1. గాలికి ఊగేరెల్లె నా మనసు
    నెమ్మది లేక కదులుచున్నది } 2
    చేసిన దోషములు నన్ను తరుమగను
    వేదనతో హృదయం అదురుచున్నది } 2
    క్షమియించువాడ నాయేసురాజ
    ఈ ఘోరపాపిని క్షమియించుమా } 2 || దేవా ||

  2. గతించిపోయే లోకపు నటనలు
    స్థిరమని నమ్మి మోసపోతిని } 2
    గమ్యం తెలియని జీవిత యాత్రలో
    గతియేమవ్వునో ఎరుగనైతిని } 2
    నడిపించువాడ నా యేసురాజ
    నీ చేతితో నన్ను దరిజేర్చుమా } 2 || దేవా ||