Showing posts with label Joseph konda. Show all posts
Showing posts with label Joseph konda. Show all posts

Nee prematho nannu nimpumu deva నీ ప్రేమతో నన్ను నింపుము దేవా

1 కొరిథి 13:13

నీ ప్రేమతో నన్ను
నింపుము దేవా
నీ ప్రేమను పంచుట
నేర్పుము దేవా "2"
జ్ఞానమున్న కాని
విశ్వాసమున్న కాని
ప్రవచింప గల్గినకాని
ప్రేమలేని వాడనైతే
వ్యర్థుడనయ్య   "2"
                       " నీ ప్రేమతో "
(1)
నీ ప్రేమ సహానం కలది
నీ ప్రేమ దయగలది  "2"
నీ ప్రేమకు డంబము లేదు
నీ ప్రేమకు గర్వము లేదు
నీ ప్రేమకు అసూయ లేదు
నీ ప్రేమకు స్వార్ధము లేదు
నీ ప్రేమకు అమర్యాద లేదు
నీ ప్రేమకు కోపము రాదు
నీ ప్రేమ గుణములతో నను నింపుము
నీ ప్రేమను ప్రదర్శచించే వరమియుము "2"
                       " నీ ప్రేమతో "
(2)
నీ ప్రేమ దోషం లెక్కింపదు
నీ ప్రేమ కీడులో ఆనందించదు "2"
నీ ప్రేమ సత్యమునే సంతసించును
నీ ప్రేమ సమస్తమును భరియించును
నీ ప్రేమ సమస్తమును విశ్వసించును
నీ ప్రేమ సమస్తమును ఆశించును
నీ ప్రేమ సమస్తమును సహించును
నీ ప్రేమ శాశ్వతముగ నిలి చిపోవును
నీ ప్రేమ గుణములతో నను నింపుము
నీ ప్రేమను ప్రదర్శచించె కృపనీయుము   "2"
                       " నీ ప్రేమతో "