Showing posts with label Rames. Show all posts
Showing posts with label Rames. Show all posts

Parishuddhudavai mahima prabhavamulaku neeve prathrudavu పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు

పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు 
బలవంతుడవై - దీనుల పక్షమై కృప చూపువాడవు 
దయాలుడవై ధారాలముగా నను దీవించిన శ్రీమంతుడా 
ఆరాధన నీకే నా యేసయ్య -2

నీ స్వాస్థ్యమైన నీవారితో కలిసి నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును కిరీటముగా - ధరింపజేసితివి.
శాశ్వత కాలము వరకు నీ సంగతిపై దృష్టి నిలిపి 
నీ దాసుల ప్రార్ధనలు సఫలపరచితివ

నీనిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
నీ కరుణకటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి
నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి

ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి
మేఘవాహనుడవై వచ్చువరకు నే కనిపెట్టుచుందును నీ కోసము
నీ దాసులా కాంక్షను సంపూర్ణ పరచెదవు