Showing posts with label Andhra Kraisthava Keerthanalu. Show all posts
Showing posts with label Andhra Kraisthava Keerthanalu. Show all posts

Yentha prema yentha prema yentha premaya ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుఁడెంత గొప్ప

10
రాగం - (చాయ: ) తాళం -

Sarva sakthuni sthothra ganamu salpare jaga mellanu సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను

8
రాగం - (చాయ: ) తాళం -

Sannuthinthumo prabho sadha mala magu bhakthitho సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో

7
రాగం - (చాయ: ) తాళం -

Bhikarumdau ma yehova pita medhutam gudare భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటం గూడరే

6
రాగం - (చాయ: ) తాళం -

Yesu nayakuda yella velalanu ni dhasula nelumayya యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా

3
రాగం - (చాయ: ) తాళం -

Anni kalambula nunna yehovani nenna dharambayo ఆన్ని కాలంబుల నున్న యోహోవాని న్నెన్నథరంబయో

1


రాగం - (చాయ: ) తాళం -
123

Anni kalambula nunna yehova అన్ని కాలంబుల నున్న యెహోవా ని

Song no: #1
    అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నఁదరంబయో కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు ||నన్ని||
  1. నిన్నుఁ బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగఁ జేసిన బలుఁడ వీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలు ప్రభుఁడ వీవె అన్ని జీవుల నెఱిఁగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం డవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు నేఁ జాలుదునా ||యన్ని||
  2. పుట్టింప నీవంచుఁ బోషింప నీవంచుఁ గిట్టింప నీవంచు గీర్తింతును నట్టి పనికి మాలి నట్టి మానవుల చే పట్టి రక్షింపం బాధ్యుండ వంచు దట్టమైన కృపను దరిఁజేర్చ నాకిచ్చి పట్టయి నిలచియుండు ప్రభుఁడ వంచుఁ గట్టడచేఁ గడ ముట్టుదనుక నా పట్టుకొలఁది నిన్నుఁ బ్రస్తు తింతు ||నన్ని||
  3. కారుణ్యనిధి వీవు కఠినాత్ముఁడను నేను భూరి శుద్ధుఁడ వీవు పాపి నేను సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న దారిద్రుఁడే లేఁడు తరచి చూడ సార సద్గుణముల సంపన్నుఁడవు నీవు ఘోర దుర్గుణ సంచారి, నేను ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు నేర మెన్నక ప్రోవ నెర నమ్మితి ||నన్ని||

Andhamaina kreesthu katha mee ralimparayya అందమైన క్రీస్తు కథ విూ రాలింపరయ్య

Song no: 151
HD

రా – నవరోజు 

పుట్టుగ్రుడ్డికిఁ జూపునిచ్చుట

తా – త్రిపుట 



అందమైన క్రీస్తు కథ విూ – రాలింపరయ్య ||అందమైన||

  1. పొందుగ శిష్యులతో యేసు – పోవుచుండు మార్గమందు – ముందుగ వీక్షించి రొక్క పుట్టంధకుని = అందుఁ గొందఱు శిష్యు – లాత్మలో భావించి – రెందు కీతఁడు చీక – య్యెను దీని విధమేమో – డెందములనుఁ గల్గు – సందియములు వీడ – విందమనుచు లోక – వంద్యుని సంతతా = నందుని మనుజ – నందనుని నడిగిరప్పు ॥డందమైన॥

  2. చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు – లేక వీని జననీ జనకు – లేమి చేసిరో = యిూ కారణముఁ దెల్పు – మోకర్త యిపుడీవు – మాకంచు తను వేఁడ – లోకేశ్వరుండు ని – రాకారుఁ డితనియం – దీకార్యములుఁ జూపం – బ్రాకటముగఁ జేసెఁ – గాక వేరొకవిధము = లేకున్నదని తెల్పి – చీకుఁ బ్రోవం దలంచె ॥నందమై॥

  3. బురద వాని కన్నులందుఁ – గరములతోఁ జమిరియొక్క – చెఱవులో బ్రక్షాళించుటకు – సెలవిచ్చెఁ బ్రభువు = బిరబిర నయ్యంధుఁ – డరిగి యేసుని పల్కుఁ – దిరముగ మదినమ్మి – సరసిలో మునిఁగి సుం – దరమైన నేత్రముల్ – ధరియించి యానంద – భరితుడై చనుదెంచు – తఱివాని పొరుగింటి = నరులబ్బురముగఁ జూ – చిరి మార్మోమగువాని ॥నందమైన॥

  4. చూపులేని గ్రుడ్డివానిఁ – జూడఁ గలుగఁజేయువాఁడే – పాపాంధకార మగ్నుల నా – ప్రభువే రక్షించు = పైపైని మనకన్ను – చూపు చూపది గాదు – లోపలి కనుగుడ్డి – యైపోయి యున్నది – యాప త్పరంపర – లోఁ బొరలుచున్నాము – కాపాడుమని యేసు – శ్రీ పాదములుఁ బట్టి = చూపు లోపలి చూపుఁ – జూచి యానందింత ॥మందమైన॥



క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు Kreesthulo Jeevinchu Naaku Ellappudu

Song no: #780
HD

    క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును
    జయముంది జయముంది – జయముంది నాకు (2)

  1. ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2)
    ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2)     ||జయముంది||

  2. నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2)
    మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2)     ||జయముంది||

  3. సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను (2)
    సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2)     ||జయముంది||

    Kreesthulo Jeevinchu Naaku – Ellappudu Jayamundunu
    Jayamundi Jayamundi – Jayamundi Naaku (2)

  1. Etuvanti Shramalochchinaa – Nenu Digulu Padanu Ilalo (2)
    Evaremi Cheppinanu – Nenu Soliponeppudu (2)      ||Jayamundi||

  2. Naa Raaju Mundunnaadu – Goppa Jayamutho Velluchunnaadu (2)
    Mattalanu Chetha Patti – Nenu Hosanna Paadedanu (2)      ||Jayamundi||

  3. Saathaanu Adhikaaramun – Naa Raaju Theesivesenu (2)
    Siluvalo Digagotti – Yesu Kaallatho Throkki Vesenu (2)      ||Jayamundi||

Yevaru nannu cheti vidicinan ఎవరు నన్ను చేయి విడచినన్‌

Song no: #778
HD
    ఎవరు నన్ను చేయి విడచినన్‌
    యేసు చేయి విడువడు (2)
    చేయి విడువడు (3)
    నిన్ను చేయి విడువడు ||ఎవరు ||

  1. తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
    లాలించును పాలించును (2) ||ఎవరు||

  2. వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
    వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు||

  3. రక్తము తోడ కడిగి వేసాడే (2)
    రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||

  4. ఆత్మ చేత అభిషేకించి (2)
    వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||
    Evaru Nannu Cheyi Vidachinan
    Yesu Cheyi Viduvadu (2)
    Cheyi Viduvadu (3)
    Ninnu Cheyi Viduvadu ||Evaru||

  1. Thalli Aayane Thandri Aayane (2)
    Laalinchunu Paalinchunu (2) ||Evaru||

  2. Vedana Shramalu Unnappudallaa (2)
    Vedukondune Kaapaadune (2) ||Evaru||

  3. Rakthamu Thoda Kadigi Vesaade (2)
    Rakshana Santhosham Naaku Ichchaade (2) ||Evaru||

  4. Aathma Chetha Abhishekinchi (2)
    Vaakyamuche Nadupuchunnaade (2) ||Evaru||

Krotthyedu modhalu bettenu క్రొత్తయేడు మొదలు బెట్టెను

122 క్రీస్తుని మహిమ
రాగం - మధ్యమావతి తాళం - ఆట


Yemi nenu samarpimthu yesu yetlu ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు

Song no: #86
    ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు నీకు ||నేమి||

  1. నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము ||నేమి||
  2. అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు ||ఏమి||
  3. నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి నాలించు ||మేమి||
  4. నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచు కొందును నేను సిగ్గు నొంది నిజముగఁ గుందుచు నేను వేఁడుకొందు నీ క్షమాపణ కొరకు ||నేమి||
  5. నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు ||డేమి||

Cheri kolvudi kreesthuni padhamula jeri చేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ జేరి

Song no: #85
    చేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ జేరి కొల్వుఁడి చేరి కొల్వుఁడి స్థిరమతితో మీ నోరు నిండ మది కోరికఁ దీరఁ ||జేరి||

  1. ధీరకలితుఁ డుప కారకుఁ డితఁ డని యారూఢిగ మదిఁ గోరి ప్రియమునఁ ||జేరి||
  2. జనకుని యుగ్రం బును దా నోరిచి జనులకు మేలు నో సంగి ఘనునిఁ ||జేరి||
  3. సార చరిత్రో దారుఁడు పాతక ధీరుఁడు శుద్ధా చారుండితఁడని ||జేరి||
  4. దేవుని కొమరుఁడు ధీవిస్తారుఁడు సేవ కావనుఁడు క్షేమకరుండని ||జేరి||
  5. యేసుని వారల నీశుఁడు మన్నన జేసి తప్పు క్షమ చేయునుగానఁ ||జేరి||
  6. మరణము నొందిన నరులను గృపఁ గ్ర మ్మరఁ బ్రతికించిన మహిమోజ్వలునిఁ ||జేరి||
  7. పలు దయ్యంబులఁ బారఁదరిమి రో గుల రక్షించిన మలినాపహునిఁ ||జేరి||
  8. జను లచ్చెరు వొం దను మూఁగకు నో రును గన్నులు చీఁ కునకిడినాఁ డని ||చేరి||

Iedhigo neethi bhaskarundu udhayamaye ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె

Song no: #84
    ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి మది తమోగుణంబులణపె సదమల జ్ఞానంబు నొసఁగె ||ఇదిగో||

  1. ఎవని జ్ఞానమహిమ విభవ మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ రూపమాయె నవనీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి ||ఇదిగో||
  2. నరజనముల నీతియెవడో ధరణిపతుల దీప్తియెవడో దురితఋణము దీర్చునెవఁడో పరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ మొసగునిపుడె ||ఇదిగో||
  3. కలుష మెల్ల బాపదలఁచి కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి గూర్చన్ సిలువమీద బలియై మరణ బలముణఁచి తిరిగిలేచె ||ఇదిగో||
  4. మదితమం బదెచటికరిగె యెదను కఠినతము కరిగె హృదయరసము లతిశయించి సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె ||ఇదిగో||
  5. జనగణముల జీవమతఁడె ధనఘనముల దాతయతఁడె యనుభవమున నెఱుఁగుమతని యనుపమ ప్రేమా మృతంబు ననవరతా నందకరము ||ఇదిగో||

Yesu bhajana seyave dosapu manasa యేసు భజన సేయవే దోసపుమనసా

Song no: #82
    యేసుభజనసేయవే దోసపుమనసా! వాసిగ నేనే, వరరక్షకుఁడు వేసారి వసుధ నెవ్వారినిఁ గానము ||యేసు||

  1. ధారుణపాప భరణా! హరణా! కారుణ్యకరయని కోరిభజింపవె ||యేసు||
  2. శాంతిసునీతి సదములభక్తిన్ వింతగనిడు మన శ్శాంతిసుధాకరుఁ ||డేసు||
  3. అనఘా! నీవే అవనితలంబున ననుఁగనుఁగొంటివి నా ధనమంటివి ||యేసు||
  4. మనసా! నీదు మలినంబును తా మనుగడ, సిల్వపై మాపెమహాత్ముఁ డు ||యేసు||

Yesuni bhajiyimpave manasa nee dosamulu యేసుని భజియింపవే మనసా నీ దోసములు

Song no: #80
    యేసుని భజియింపవే మనసా నీ దోసములు చనఁ జేసి కృపతోఁ బ్రోచునే మనసా వాసి కెక్కిన క్రీస్తు మోక్షని వాసిగా కిఁక వేరేలేరని దోసిలొగ్గి నుతించితే నిను త్రోసివేయఁడు దోసకారని ||యేసు||

  1. ఏటికే నీ కీదురాశలు నీ కెప్పుదును చెవి నాటవుగ ప్రభు యేసు వాక్యములు వాటముగ నా తుది దినమున నీటుమీఱఁగ నిత్యజీవ కి రీటమును నీకిత్తు నని తన నోటఁ బల్కిన మాటఁ దప్పఁడు||యేసు||

  2. ఖండనగ నిను చెండియాడఁడు యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు నతఁడితఁడు అండఁబాయక నిన్ను ప్రతి దిన గండములను హరించునని నీ వుండ గోరిన నిండు నెమ్మది దండిఁగ నీకుండఁ జెప్పును||యేసు||

  3. లోక సైతాను దుర్భోధలు నీ వాలింపక యా లోకరక్షకుని సుబోధలు ఏక మనసుతో రాత్రిఁబగలు ప రాకులేకను గాచు నా ప్రభు రాకడను నీవెఱింగినను పర లోకశుభ సుఖసౌఖ్య మొసఁగును||యేసు||

  4. వంచనలు మది నుంచకే మనసా నీ దుర్గుణము తలఁ ద్రుంచి ప్రభుని సేవింపనే మనసా అంచితముగా క్రీస్తుఁ డీప్ర పంచ జనుల భవాబ్ధినావగ నెంచి నీ భవభార మతనిపై నుంచి సతము ప్రార్థించు మనసా||యేసు||

  5. నిన్ను పాప బంధముల నుండి రక్షించుటకు స ర్వోన్నతుని కుమారుఁ డై వెలసి ఎన్నఁగ నీవొందు దుఃఖము లన్నిటిని తా ననుభవించెను విన్న తక్షణ మేసుక్రీస్తుని విశ్వసించి సుఖించు మనసా||యేసు||

Yesu bhajanaye manalanu aa sugathiki యేసు భజనయే మనలను ఆ సుగతికి

Song no: #78
    యేసు భజనయే మనలను ఆ సుగతికిఁ దీయు జనులారా దాసజనులు జేయు పలు దోసములు మోయు ||యేసు||

  1. మేల కులశీల వ్రత జా లాధిక మేల చాల మన మీలాగునఁ గాలావధి ఁగూల||యేసు||

  2. అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత మోక్ష యను దీక్షన్||యేసు||

  3. మాటికి మిన్నేటికిఁ బో నేటికిఁ గాల్ నొవ్వ సూటిగ నరకోటి దురిత వాటములను మీటు||యేసు||

  4. శ్రోత్రమ యపవిత్ర నర చ రిత్రలు వినఁబోక మైత్రిని బరమాత్ముని కథ మాత్రము విను మనుచున్||యేసు||

  5. మన జీవనమునకు మారుగఁ తన ప్రాణము నిచ్చెన్ తన రక్తముచేఁ బావన మొనరించెను మనలన్||యేసు||

Kreesthuyesunaku mamgalam ma keerthi rajunaku క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు

Song no: #76
    క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు మంగళం క్రీస్తుయేసే దైవమంచును కూడి పాడుదు మంగళం||

  1. ప్రవచనంబులు బల్కినట్టి ప్రాణనాధుడవీవె నీదు స్తవము జేయుచు మెలగు మనుజుల సత్ప్రభువుకిదె మంగళం ||క్రీస్తు||

  2. జగమునేలెడు జీవనాధుడ జపములందెడు గృపకటాక్ష అగణీ తంబగు ప్రేమజూపిన అమరతేజుడ మంగళం ||క్రీస్తు||

  3. ఖలుల బ్రోచెడు కనికరాత్మ కేంద్ర స్థానము నీ పదాబ్జము కలుషమును కడమార్చినట్టి సిలువ నాధుడ మంగళం ||క్రీస్తు||

  4. మనము గోరెడు మా హృదీశుడ మార్గదర్శుడ వీవెగావ అనయము నినుగొల్చు జనముల ఆది దేవుడ మంగళం ||క్రీస్తు||

  5. జనకసుత శుద్ధాత్మ దేవుడ గనని వినని ప్రేమ పూర్ణుడ తనివితీరగ పాడుదము యీ ధాత్రి నీకగు మంగళం ||క్రీస్తు||

Vandhaname yesunaku varasugunodharunaku వందనమే యేసునకు వరుసుగుణోదారునకు

Song no: #74
    వందనమే యేసునకు వరుసుగుణోదారునకు సౌందర్య ప్రభువునకు సర్వేశ్వర నీకు ||వందనమే||

  1. యెహోవా తనయునకు ఇమ్మానుయేలునకు బహు కరుణాభరణునకుఁ ప్రభువుల ప్రభువునకు||వందనమే||

  2. ఆశ్రిత జనపాలునకు నకలుష వర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు యెహోవా నీకు||వందనమే||

  3. మరియాతనూజునకు మహిమ గంభీరునకుఁ పరిశుద్ధాచరణునకుఁ బరమేశ్వర నీకు||వందనమే||

  4. రాజులపై రాజునకు రవికోటి తేజునకుఁ పూజార్హపదాబ్జునకు భువనావన నీకు||వందనమే||

  5. ప్రేమ దయా సింధునకు క్షేమామృత పూర్ణునకు ఆమే నని సాష్టాంగము లర్పింతుము నీకు||వందనమే||

Mangalamu badare kreesthunaku jaya మంగళము బాడరె క్రీస్తునకు జయ

Song no: #72
    మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారా మంగళముఁ బాడరెర్ మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభు సంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును ||మంగళము||

  1. రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమున సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ ||మంగళము||

  2. కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును దానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁదె మన పాలి వాఁడని శుభ||మంగళము||

  3. సంగీతము పాడుచు సువార్త ప్ర సంగములఁ గూడుచు నింగికిని భూమికిని నిత్యముగ నేలఁ దగు శృంగారపు రాజునకు క్షేమ మగు ఆమేనిని||మంగళము||