Showing posts with label Neevunte Chaalunaya. Show all posts
Showing posts with label Neevunte Chaalunaya. Show all posts

Ninu chuse kannulu naku iemmaya ninu piliche pedhavulu iemmu yesayya నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా


Song no:

నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా
నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2)
నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా
నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా

కన్నీటి ప్రార్ధన నాకు నేర్పయ్యా
ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2)
నీ కొరకే జీవించే సాక్షిగ మార్చయ్యా
నాలోనే నిను చూపే మాదిరి నివ్వయ్యా

అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా
మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2)
కోపతాపములను దూరపరచయ్యా
అందరినీ క్షమియించే మనస్సు ఇవ్వయ్యా

లోతైన ఆత్మీయత నాకు ఇమ్మయ్యా
లోబడుట నాకు నేర్పు యేసయ్యా
లోపములన్ గ్రహించే కృపను ఇమ్మయ్యా
లోకాన్ని జయించే జీవిత మివ్వయ్యా

Nee mandhiramu maku asrayam nee sannidhiye adharam నీ మందిరమే మాకు ఆశ్రయం నీ సన్నిధియే మాకు ఆధారం

Song no:

    నీ మందిరమే మాకు ఆశ్రయం నీ సన్నిధియే మాకు ఆధారం } 2
    నీ మాటలతో మమ్మును ఓదార్చుము నీ వాక్కుతో మమ్ము స్వస్థపర్చుము
    నీవే కదా ఆధారం నీవే కదా ఆశ్రయం        || నీ మందిరమే ||

  1. యాకోబును దీవించిన్నట్టుగా మమ్ముకూడా దీవించమయా
    ఏసేపునకుతోడైఉన్నట్టుగా మాకు కూడాతోడుండుమయా
    మోషేను నడిపించినట్లుగా మమ్మును నడిపించుమయ్యా
    దావీదును హెచ్చించున్నట్లుగా మమ్మును హెచ్చించుమయ్యా
                                                        || నీ మందిరమే ||

  2. శిస్యులతో మాట్లాడినట్టుగా మాతో కూడా మాట్లాడుమయ్యా
    పేతురును క్షమియించినట్లుగా మమ్ముకూడా క్షమించుమయ్యా
    తోమాను సరిచేసినట్లుగా మమ్మును సరిచేయుమయా
    పౌలును వాడుకొనినట్లుగా మమ్మును వాడుకోమ్మయా
                                                       || నీ మందిరమే ||