Showing posts with label Nee Sallani Soope. Show all posts
Showing posts with label Nee Sallani Soope. Show all posts

Yevadandi babu veedu yentha cheppina vinadu ఎవడండీ బాబూ వీడు ఎంత చెప్పినా వినడు

Song no: 120

    ఎవడండీ బాబూ వీడు - ఎంత చెప్పినా వినడు
    గుప్పుగుప్పున వదిలేస్తాడు - తప్పంటే అసలొప్పుకోడు

  1. తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు
    పీల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమాంటాడు } 2
    దాన్ని చేసినోడే రాసిన హెచ్చరిక మరిచేడు } 2
    గుండె తూట్లు పడ్డగాని దాన్ని మాత్రం విడువడు } 2 {ఎవడండీ}

  2. సరదా అంటూ మొదాలు పెడతాడు మల్లా దానికే బానిసౌతాడు
    డబ్బులన్ని తగలబెడతాడు కోరి జబ్బులెన్నో తెచ్చుకుంటాండు } 2
    ఆరోగ్యమే క్షిణిస్తున్నా కళ్ళు మాత్రం తెరవడు } 2
    శక్తి అంతా కోల్పోతున్నా ఎంతమాత్రం వెరవడు } 2 {ఎవడండీ}

  3. దేహమే దేవదేవుని నివాసమని మర్చిపోతాడు
    పరిశుద్దంగ ఉంచుమనే క్రీస్తు ఆజ్ఞనే లెక్కచేయడు } 2
    పాడు వ్యసనములతోనే నరకమునకు పోతాడు } 2
    యేసుక్రీస్తుని నమ్మినచో పరిశుద్ధుడు తానౌతాడు } 2 {ఎవడండీ}

Yentha sundharamo a paralokamu antha suvarname ఎంత సుందరమో అ పరలోకము అంతా సువర్ణమే

Song no: 119

    ఎంత సుందరమో అ పరలోకము అంతా సువర్ణమే } 2
    ఏమి చిత్రముచేరాలనుకుంటే ఆ పట్టణము } 2
    యేసయ్యకివ్వాలి నీ హృదయము } 2 {ఎంత సుందరమో}

  1. కాంతినిచ్చుటకు సూర్యుడు అవసరమేలేదు
    వెన్నలిచ్చుటకు చంద్రుడు అవసరమే లేదు } 2
    దేవుని మహిమయె అచట ప్రకాశించుచుండెను } 2
    జనములుఆ వెలుగునందు సంచరించుచుందురు } 2 {ఎంత సుందరమో}

  2. ఆకలి దాహము ఉండనే ఉండవు చీకటి రోగము ఉండనే ఉండవు } 2 ప్రభువైన దేవుడే వారితో నివసించును } 2
    కన్నీటి బిందువులను తానే తుడిచివేయును } 2 {ఎంత సుందరమో}

  3. శాపగ్రస్తమైనడదేది అందులో ఉండదు అసహ్యమైనది ఏది అందులో ఉండదు } 2 జీవగ్రంధమందు రాయబడినవారే ఉందురు } 2 ఆయననుసేవించుచు రాజ్యమే చేతురు } 2 {ఎంత సుందరమో}

Yekkara oranna rakshana padava chakkaga mokshaniki cherccheti nava ఎక్కరా ఓరన్నారక్షణ పడవ చక్కగా మోక్షానికి చేర్చేటి నావ

Song no: 122

    ఎక్కరా ఓరన్నారక్షణ పడవ - చక్కగా మోక్షానికి చేర్చేటి నావ } 2

  1. తండ్రియైున దేవుడు నిర్మించినాడురా
    యేసుక్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడురా } 2
    పరిశుద్ద రక్తంతో సిద్దామైన పడవరా } 2
    దరిచేర్చగలిగిన ఏకైక నావరా } 2 {ఎక్కరా}

  2. ఎందరెక్కినా దానిలో చోటుంటుందిరా
    అందారిని ప్రేమతో రమ్మంటుందిరా } 2
    నిత్యజీవాన్నిచ్చే నిజమైన పడవరా } 2
    సత్యమైన మార్గాన సాగేటి నావరా } 2 {ఎక్కరా}

  3. శాపాలు పాపాలు దానిలోకి చేరవురా
    చావు భయమే అందు మరి ఉండబోదురా } 2
    శిక్ష నుండి తప్పించే మహిమగల పడవరా } 2
    అక్షయ భాగ్యమిచ్చే అనురాగ నావరా } 2 {ఎక్కరా}

Devudinaddam mosalu cheyyaboku bible peru దేవుడినడ్డంబెట్టి మోసాలు చెయ్యబోకు బైబిలు పేరు

Song no: 121


దేవుడినడ్డంబెట్టి మోసాలు చెయ్యబోకు
బైబిలు పేరు చెప్పి వేషాలు వెయ్యబోకు
ఓ..పెద్దాన్నా... నామాట వినరన్నా
ఓ..చిన్నన్నా...ఈమాట నిజమన్నా

1. కన్నులిచ్చినవాడు కానకుండునా
అన్యాయమైన పనులు చూడకుండునా
మనుష్యుల కళ్ళు కప్పినా దేవుని నీతి ఒప్పునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందుముఇప్పికైనా

2. దేవుని సొమ్ము నీవు దొంగిలించినా
దైవసేవ అంటూ నీఆస్తి పెంచినా
అన్యాయపుసిరి నిలుచునా - దేవునిశిక్షతప్పునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందాుముఇప్పటికైనా

3. స్వార్ధానికై వాక్యం కలిపి చెరిపినా
లాభానికై అనుకూలముగా మార్చినా
పరలోక తండ్రి ఓర్చునా - ఉగ్రత చూపక మానునా
కప్పుకొనక నీతప్పులొప్పుకొని మెప్పును పొందుముఇప్పటికైనా

Nuvve kavali yesuku nuvve kavali ninu dhivinchagorina నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి నిను దీవించగోరిన

Song no: 117

    నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి
    నిను దీవించగోరిన తండ్రికి నువ్వే కావలి

    నిను హెచ్చించగోరిన రాజుకు నీ హృదయము నివ్వాలి
    నీవున్న రీతిగానే - వట్టి పాత్రగానే } 2 {నువ్వే కావాలి}

  1. నీకున్న ధనధాన్యము అక్కరలేదు
    నీదు అధికారము అక్కరరాదు
    నీదు పైరూపము లెక్కలోనికిరాదు
    నీదు వాక్చాతుర్యము పనికిరాదు } 2

    అ.ప: నిన్ను నీవు తగ్గించుకొని - రిక్తునిగా చేసుకొని
    విరిగి నలిగిన హృదయంతో దైవసన్నిధి చేరాలి {నువ్వే కావాలి}

  2. నీకున్న జ్ఞానమంతా వెర్రితనము
    నీకున్న ఘనతవల్ల లేదే ఫలితము
    నీ గోప్పపనులతో ఒరిగేది శూన్యము
    నీ మంచితనము ముండ్లతో సమానము } 2 {నిన్ను నీవు }

Ningiloni chanduruda mandha kache indhuruda నింగిలోని చందురుడా మంద కాచే ఇందురుడా

Song no: 118

    నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా - 2
    నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా - 2
    ఓ... వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా - 2

  1. ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా
    దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంకిట అంటిపోతున్నా
    ప్రేమతో పెంచిన - మమతలు పంచినా - నీ శ్రమ చూడలేక గుండెపగిలిన

    తల్లిని శిష్యునికప్పగించి - నీ బాధ్యతను నెరవేర్చినావా ? - 2
    ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమామూర్తి నీవయ్యా - 2

  2. అందాల మోముపై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టి పీకగా
    యూదులరాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా
    అంతా సహించి - మౌనం వహించి - బాధించువారిపై ప్రేమ చూపించి

    ఏమిచేస్తున్నారో ఎరుగరు - క్షమించుమని ప్రార్ధించినావా - 2
    ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత సహనం చూపినావయ్యా - 2

  3. లేతమొక్కలాంటి నీ దేహముపై - కొరడాలెన్నో నాట్యముచేయగా
    మేలే చేసినా కరుణను పంచినా - కాళ్లూ, చేతులలో శీలలుకొట్టగా
    అంతటి శ్రమలో - చెంతననిలిచి - చింతతో ఉన్న అతివల జూచి

    నాకోసం ఏడ్వవలదని - పలికి వారిని ఓదార్చినావా - 2
    ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత కరుణామయుడ నీవయ్యా - 2

Nee sallani supe o yesaya na brathukunu marchindhi messiya నీ సల్లని సూపే ఓ యేసయ్యా నా బతుకును మార్చించి మెస్సీయా

Song no: 116

    నీ సల్లని సూపే ఓ యేసయ్యా
    నా బతుకును మార్చించి మెస్సీయా } 2
    నీ మెల్లని మాటే ఓ యేసయ్యా } 2
    నను సేదదీర్చింది మెస్సీయా {నీ సల్లని}

  1. పశుశాలలో నీ జన్మ యేసయ్యా
    తగ్గింపు నేర్పింది మెస్సీయా } 2
    పరిశుద్ధ నీ నడత యేసయ్యా } 2
    మాదిరి నాకుంచింది మెస్సీయా {నీ సల్లని}

  2. నీవు కార్చిన రక్తం యేసయ్యా
    నా పాపం కడిగింది మెస్సీయా } 2
    నీవు పొందిన మరణం యేసయ్యా } 2
    నాకు జీవం పోసింది మెస్సీయా {నీ సల్లని}

  3. నీ దేహపు గాయం యేసయ్యా
    స్వస్థత కలిగించింది మెస్సీయా } 2
    నీ కలువరియాగం యేసయ్యా } 2
    కొత్తజన్మనిచ్చింది మెస్సీయా {నీ సల్లని}