Showing posts with label M Jyothi Raju. Show all posts
Showing posts with label M Jyothi Raju. Show all posts

Yese na pari haari priya yese naa parihari యేసే నా పరి హారి - ప్రియ యేసే నా పరిహారి

యేసే నా పరి హారి - ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి

1. ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో
ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి

2. నన్ను శాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా
పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నాపరిహారి

3. మణిమాణ్యాలు లేకున్నా - మనో వేధనలు వేదించినా
నరులెల్లరు నను విడచినా - ప్రియ ప్రభువే నాపరిహారి

4. బహు వ్యాదులు నను సోకినా - నాకు శాంతి కరువైనా
శోధకుడు శోదించినా - ప్రియ ప్రభువే నాపరిహారి

5. దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు 
నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను

Krupamaya ninne aradhisthunna కృపామయ నిన్నే ఆరాధిస్తున్న కృపలో నిత్యము ఆనందిస్తున్న


Song no:
కృపామయ నిన్నే ఆరాధిస్తున్న
కృపలో నిత్యము ఆనందిస్తున్న
కృపామయ నా యేసయ్య
దయామయ దీనదయా

ఆకాశములు భూమికి పైన
ఎంత ఎతైనవో
నా యేడల నీ తలంపులు
అంత ఎతైనవి

నా రక్షణకు నిరీక్షణకు
ఆదారమై యున్నది
నే జీవించుటకు ఫలియించుటకు
మూలమైయున్నది

బలహీనతలో బలముతో నింపి
నడిపించే కృప
శ్రమలో విడిపించి గొప్పచేసి
తృప్తి పరచె కృప

Padhamulu chalani prema iedhi పదములు చాలని ప్రేమ ఇది

Track
Song no:

పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది (2)
కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ         ||పదములు||

నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
వేదనంత తొలగించును ప్రేమ      ||ప్రేమ||

మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ       ||ప్రేమ||



Padamulu Chaalani Prema Idi
Swaramulu Chaalani Varnanidi (2)
Karamulu Chaapi Ninu Kougalinchi Penchina
Kannavaarikante Idi Minnayaina Prema
Vaarini Sahithamu Kanna Prema
Prema Idi Yesu Prema
Prema Idi Thandri Prema
Prema Idi Praanamichchina Prema
Kaluvari Prema            ||Padamulu||

Nava Maasam Mosi Prayojakulanu Chesinaa
Kannabiddale Ninu Velivesinaa (2)
Thana Karamulu Chaapi Mudimi Vachchu Varaku
Ninneththukoni Aadarinchu Prema
Aa Vedanantha Tholaginchunu Prema         ||Prema||

Melulenno Pondi Unnatha Sthithikedigina
Snehithule Hrudayamunu Gaayaparachaga (2)
Melulatho Nimpi Adbhuthamulu Chesi
Kshamiyinchuta Nerpinchedi Premaa
Shaanthitho Ninu Nadipinchedi Prema         ||Prema||



Neevu chesina mellaku neevu chupina krupalaku నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు

పల్లవి: నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు
అనుపల్లవి:వందనం యేసయ్య - వందనం యేసయ్య (2)

1. ఏ పాటివాడను నేను - నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి - నన్నెంతగానో దీవించావు (2)   !! వందనం యేసయ్య!!

2. బలహీనులమైన మమ్ము - నన్నెంతగానో బలపరచారు

క్రీస్తేసు మహిమైశ్వరములో - ప్రతి అవసరమును తీర్చావు  (2)    !! వందనం యేసయ్య!!