Showing posts with label Jagan. Show all posts
Showing posts with label Jagan. Show all posts

Yesuni premanu nemarakanu neppuda dhalachave యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే

Song no: 173

యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే యో మనసా వాసిగ నాతని వరనామంబును వదలక పొగడవె యో మనసా||

పాపులకొరకై ప్రాణముఁ బెట్టిన ప్రభు నిలఁ దలఁచవె యో మనసా శాపము నంతయుఁ జక్కఁగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా ||యేసుని||

కష్టములలో మన కండగ నుండిన కర్తను దలఁచవె యో మనసా నష్టములన్నియు నణఁచిన యాగురు శ్రేష్ఠుని ప్పొగడవె యో మనసా ||యేసుని||

మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యునిఁ దలఁచవె యో మనసా కరుణను మన క న్నీటి దుడిచిన కర్తను పొగడవె యో మనసా ||యేసుని||

ప్రార్థనలు విని ఫలముల నొసఁగిన ప్రభు నిఁక దలఁచవె యో మనసా వర్థనఁ గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవె యో మనసా ||యేసుని||

వంచనలేక వరముల నొసఁగిన వరదునిఁ దలఁచవె యో మనసా కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవె యో మనసా ||యేసుని||

Nannu dhiddhumu chinna prayamu నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా

Jagan
A.R Stevenson
Bilmoria
Song no: 325
నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా
నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా        ||నన్ను||

దూరమునకు బోయి నీ దరి జేర నైతిని నాయనా
నేను కారు మూర్ఖపు పిల్లనై కా రడవి దిరిగితి నాయనా            ||నన్ను||

మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుండ నాయనా
నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా            ||నన్ను||

చాల మారులు తప్పిపోతిని మేలు గానక నాయనా
నా చాల మొరల నాలకించుము జాలిగల నా నాయనా            ||నన్ను||

జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా
నీవు జ్ఞానము గల తండ్రి మంచు జ్ఞప్తి వచ్చెను నాయనా            ||నన్ను||

కొద్ది నరుడను దిద్ది నను నీ యొద్ద జేర్చుము నాయనా
నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము మొద్దు నైతిని నాయనా            ||నన్ను||

ఎక్కడను నీవంటి మార్గము నెరుగ నైతిని నాయనా
నీ రెక్క చాటున నన్ను జేర్చి చక్కపరచుము నాయనా            ||నన్ను||

శత్రువగు సాతాను నన్ను మిత్రు జేయను నాయనా
యెన్నో సూత్రములు గల్పించెను నా నేత్రముల కో నాయనా            ||నన్ను||

వాసిగా నే బాప లోకపు వాసుడ నో నాయనా
నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా            ||నన్ను||


Nannu Diddumu Chinna Prayamu – Sannuthundagu Naayanaa
Neevu Kanna Thandri Vanuchu Nenu – Ninnu Cherithi Naayanaa        ||Nannu||

Dooramunaku Boyi Nee Dari – Jera Naithini Naayanaa
Nenu Kaaru Moorkhapu Pillanai Kaa – Radavi Dirigithi Naayanaa        ||Nannu||

Manchi Maargamu Ledu Naalo – Marana Paathrunda Naayanaa
Nenu Vanchithunda Naithini Pra-panchamanduna Naayanaa        ||Nannu||

Chaala Maarulu Thappipothini – Melu Gaanaka Naayanaa
Naa Chaala Morala Naalakinchumu – Jaaligala Naa Naayanaa        ||Nannu||

Gnaana Manthayu Baadu Chesi – Kaana Naithini Naayanaa
Neevu Gnaanamu Gala Thandri Vanchu – Gnapthi Vachchenu Naayanaa        ||Nannu||

Koddi Narudanu Diddi Nanu Nee – Yodda Jerchumu Naayanaa
Nee Yodda Jerchi Buddhi Cheppumu – Moddu Naithini Naayanaa        ||Nannu||

Ekkadanu Neevanti Maargamu – Neruga Naithini  Naayanaa
Nee Rekka Chaatuna Nannu Jerchi – Chakkaparachumu Naayanaa        ||Nannu||

Shathruvagu Saathaanu Nannu – Mithru Jeyanu Nayanaa
Yenno Soothramulu Galpinchenu Naa – Nethramula Ko Naayanaa        ||Nannu||

Vaasigaa Ne Baapa Lokapu – Vaasuda No Naayanaa
Nee Daasulalo Nokanigaa Nanu Jesi Kaavumu Naayanaa        ||Nannu||