Showing posts with label Kavitha Shaik. Show all posts
Showing posts with label Kavitha Shaik. Show all posts

Yehova deva ye reethi nee runam thirchukonaya యెహోవా దేవా ఏ రీతి నీ ఋణం తీర్చుకోనయా


యెహోవా దేవా  ....  నాపై నీకెంత ప్రేమయా    (2)
నను నీ దరికి చేర్చ - యేసయ్యను బలిగా అర్పించావయా   (2)

1. నిన్ను కాదని లోకమే మేలని గాలిలో ధూళిలా తిరుగుచుంటిని
 సంతోషమును సమాధానమును ఎక్కడెక్కడో నే వెదుకుచుంటిని
నీ దయతో నను కనుగొంటివి
నీదు ప్రేమతో నను మార్చితివి
నీ కృపలో నను కాచితివి

2. నిన్ను కాదని నేనే గొప్ప అనుకొని సర్వము శూన్యముతో నింపుకుంటిని
నా శక్తితో,  నా యుక్తితో ఇలలో  ఏదియు సాధించలేకపోతిని
నీదు సత్యమే నాకు విముక్తి
నీదు ఆత్మయే నాకు శక్తి   
నీదు  మార్గమే నిత్య జీవము

Naa pranama na yesayya ye reethi ni premanu నా ప్రాణమా నా యేసయ్యా ఏ రీతి నీ ప్రేమను


సాఖినా ప్రాణమా ... నా యేసయ్యా...  రీతి నీ ప్రేమను కొలుతునయా

యేసు నీ ప్రేమ మరిపించెను... అమ్మ ఒడిలోని వెచ్చందనము 
యేసు నీ ప్రేమ చినబుచ్చెను... తేనె చుక్కలోని తియ్యందనము
కురిసెను నాలో  నీ ప్రేమ జల్లులు
చిగురించెను నా ప్రాణము నిను పూజించుటకై.

1. గడిచిన కాలమంతా నా తోడువై నన్ను నడిపించావు
నా కష్ట సమయములో నా నీడవై నాకు ధైర్యమిచ్చావు
సదా ఆనందం నాకు ఆనవాలుగా-  నీ క్రుపను నీ దయను నాకు దయచేయుమా

2. నీ సన్నిధిలో నే కార్చిన కన్నీరు నీకు పాదపుష్పమై
నీ సుగుణాలే నాకు వరములై  నేనవ్వ్వాలి  పరిపూర్ణము
నీ దీవెనలే నా సంతోష వస్త్రముగా  - నీ క్రుపను నీ దయను నాకు దయచేయుమా