Jo lali Jo mariya thanayuda జో లాలి జో మరియ తనయుడా

జో లాలి జో మరియ తనయుడా
జో లాలి జో మహిమరూపుడా
అల్ఫాఓమెగ ఆమేన్ అనువాడ
ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా
యుగయుగముల పూజ్యూడా...
మా బాల యేసువా (2)
వేవేలా దూతలతో స్తుతినొందు పూజ్యూడవు
పరలోక మహిమలతో శొబిల్లు రారాజువు
మహిమను విడచి దాసుని రూపందాల్చి
రిక్తుడవై జన్మించినావా (2)
జగముకధిపతివి సర్వేస్వరుడ నీవు
పరిశుద్ద దేవుడవు శ్రీమంతుడవు నీవు
పాపుల కొరకై పరమును విడచి
పశు పాకలో నీవు పవళించినావా (2)

No comments:

Post a Comment