- మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ||
- భూనరులన్ రక్షింపఁ బూనుకొనినప్పుడు దీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ||
- విజయము మరణపు వేదనపై నొందఁగా విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ||
- నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందు దేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ||
- నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవు కావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ||
- దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన సేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ||
- నీ వారి నెల్లప్పుడును నిత్య మహిమయందు నీ పరిశుద్ధులతోను నీ వెంచుకొను మయ్య ఓ క్రీస్తూ||
- నీదు జనమున్ రక్షించి నీ దాయము దీవించుము నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును ఓ క్రీస్తూ|
- దిన దినమును నిన్ను మహిమ పర్చుచున్నాము ఘనముగా నీ నామమున్ గొప్పచేయుచున్నాము ఓ క్రీస్తూ||
- నేఁడు పాపము చేయకుండ నెనరుతో మముఁ గావుమయ్యా పాడెడి నీ దాసులకుఁ బరమ దయ నిమ్మయ్య ఓ క్రీస్తూ||
- ప్రభువా కరుణించుము ప్రభువా కరుణించుము ప్రార్థించు నీ దాసులపై వ్రాలనిమ్ము దీవెనలన్ ఓ క్రీస్తూ||
- నిన్ను నమ్మి యున్నాము నీ కృప మాపైఁ జూపుము మేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ||
Showing posts with label Namuyelu Pakyavadhamu. Show all posts
Showing posts with label Namuyelu Pakyavadhamu. Show all posts
Maa yesu kreesthu neeve mahimagala rajuvu nivu neene మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే
Song no: #30
Nee samadhanamu dhasuni kippudu నీ సమాధానము దాసుని కిప్పుడు
lyDecember 05, 2017Andhra Kraisthava Keerthanalu, Christmas lyrics, Namuyelu Pakyavadhamu
No comments
Song no: 125
రా – శంకరాభరణము
(చాయ: నాకాలగతు లెవ్వి)
తా – త్రిపుట
నీ సమాధానము – దాసుని కిప్పుడు – నాధా దేవా = యిచ్చి – నీ మాటచొప్పున – పోనిచ్చుచున్నావు – నాధా దేవా ||నీ సమాధానము||
- అన్యులకు నిన్ను- బయలు పరచెడి – వెలుగుఁగాను = నీకు – నణఁగు ప్రజలైన – యిశ్రాయేల్ వారికి – మహిమ గాను ||నీ సమాధానము||
- నరులకై నీవు ఏ – ర్పరచిన రక్షణన్ – నాధా దేవా – యిదిగో – నాకనులు చూచి యా – నందించుచున్నవి – నాధా దేవా ||నీ సమాధానము||
- తండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును – గలుగుగాక = మహిమ – తరుగక సదాకాలము – యుగయుగములకును – గలుగు నామేన్ ||నీ సమాధానము||











