జీవితమెంతో అల్పము నీ ప్రాణమెంతో స్వల్పము
యేసులేనిజీవితం అగమ్యగోచరం
విసిరివెల్లినగాలి తిరిగిరాదు మళ్ళీ
శాశ్వతముకాదేది యి లోకంలో
ప్రభుయేసునందే నీకు నిజ రక్షణ (2)
నేతగానినాడికంటే వడిగా మరి
సాగుచున్నక్షణములు నిట్టూర్పుతో (2)
జీవితమేఓ శాపంగా జీవనమే పోరాటంగా (2)
బ్రతుకుచున్ననీకు యేసే శాంతి (2)
చింతలన్నిబాపి నిన్ను చేరదీసి
కన్నీరుతుడిచే నా యేసుతో (2)
జీవితమేఓ దీవెనగా జీవనమే ఆనందముగా (2)
బ్రతకాలినీవు ఎల్లప్పుడు (2)
కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం
ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం
శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం
రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా||
చెదరిన మనసులకూ శాంతి
కృంగిన హృదికీ ఓదార్పు
మృత్యు దేహముకూ జీవం
బలహీనులకు ఆరోగ్యం (2)
పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు
గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు
మోసపూరిత ఈ లోకంలో
ఏ వైద్యునికి సాధ్యము (2) ||కవులకైనా||
క్షణికమైన అనురాగాలు
ఆవిరివంటి ఆప్యాయతలు
అవసరాల అభిమానాలు
నిలచిపోయే అనుబంధాలు (2)
నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ
ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం
స్వార్ధపూరిత ఈ లోకంలో
ఏ మిత్రునికి సాధ్యము (2) ||కవులకైనా||
తూర్పు నుండి పడమర కు ఎంత దురమో
అంతా దూరం పోయేనే పాప భారము "2"
యేసు నన్ను తాకగానే తొలగిపోయేను
నా పాపము నా పాప భారము "2" "తూర్పు"
రాతి వంటిది నాదు పాత హృదయము
మెత్తనైనా మాంసపు హృదయమయేను "2"
ఎంత మధురమో నా యేసు రుధిరము
నా పాప కలుషములను కడిగివేసేను"2" "తూర్పు"
పాప ఊబి నుండి నన్ను పైకి లేపేను
పరమజీవ మార్గమును నాకు చూపెను "2"
ఎంత రమ్యమో నా యేసు రాజ్యము
యుగయుగములు అదే నాకు పరమ భాగ్యము "2""తూర్పు"
నీ వాక్యము కొరకు చెరసాలలో
గాయాలు పాలైన భక్తులు ॥2॥
రక్తము చిందుచున్న
నిన్ను స్తుతించమానలేదే ॥2॥
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ॥అగ్నినేత్రుడా 3