రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును ఆరాధించేద్దాం
రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును పూజించేద్దాం
నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు
కన్య మరియకు సుతునిగా అవతరించే రక్షకుడు
దావీదుపురములో పుడమికి మధ్యలో జగమేలే రక్షకుడు జన్మించినాడు
ఆనాడు జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోలమును అర్పించి ఆరాధించారు } 2
పరమును విడచి రిత్తిని గా మారి దాసుని స్వరూపం ధరియించెను
పాపిని ప్రేమించి పాపమును ద్వేషించి పాపికి విడుదల నొసగేను
రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును ఆరాధించేద్దాం
రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును పూజించేద్దాం
నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు
కన్య మరియకు సుతునిగా అవతరించే రక్షకుడు
పాపికి రక్షణ రోగులకు స్వస్థత పాపక్షమాపణ యేసులోనే
కీర్తి ప్రతిష్ఠలు సర్వ సంపదలు గుప్తామయున్నవి క్రీస్తులోనే } 2
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి మహోన్నతుడు
అల్ఫయు ఒమేగా ఆది సంభూతుడు ఆరాధ్య దైవం ఆ యేసే
రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును ఆరాధించేద్దాం
రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును పూజించేద్దాం
నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు
కన్య మరియకు సుతునిగా అవతరించే రక్షకుడు
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార } 2
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది } 2
పశుల పాకచేరినది క్రిస్మస్ తార } 2
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార
జన్మించే యేసు రాజు పరవశించె పరలోకం } 2
మధురమైన పాటలతో మారు మ్రోగెను....
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార
ప్రభు యేసు నామం ప్రజా సంఖ్యలో నున్నది } 2
అవనిలో క్రీస్తు శకము అవతరించినది...
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతిలేని జీవితాన కాంతి పుంజమే
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతిలేని జీవితాన కాంతి పుంజమే
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార
పాప లోక జీవితం పటాపంచెలైనది } 2
నీతియై లోకములో వికసించినదీ...
క్రీస్తు జన్మమే ప్రేమామయమై
చీకటి హృదయాలలో వెలుగు తేజమే
క్రీస్తు జన్మమే ప్రేమామయమై
చీకటి హృదయాలలో వెలుగు తేజమే
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార
దివ్య తార! దివ్య తార!
దివినుండి దిగి వచ్చిన తార
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది
పశుల పాకచేరినది క్రిస్మస్ తార
పశుల పాకచేరినది క్రిస్మస్ తార
తారను చూచి తరలి వచ్చాము
తూర్పు దేశ జ్ఞానులము
తన భుజముల మీద రాజ్య భారమున్న
తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2)
బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము
మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం
ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంతా సందడి చేద్దాం
బెత్లెహేము గ్రామములోన
క్రీస్తు యేసు జన్మించినాడే
ఆ పశువుల పాకలోన
ప్రభు యేసు జన్మించినాడే } 2
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
ఆయన కీష్టులైన మనషులకు భూమి మీద సమాదానం } 2
దేవుని స్వరూపము కలిగినవాడై
దాసుని స్వరూపము ధరించుకొని
తన్నుతాను రిక్తునిగా చేసుకొని
ఆకారమందు మనుషుడాయేనే } 2
సిల్వ మరణం పొందినంతగా
- తన్నుతాను తగ్గిచ్చుకొనెను } 2
మరణమొంది మూడవ దినమునాడు
-మృత్యుజయుడై తిరిగి లేచినాడే} 2 || బెత్లెహేము ||
ఆయన ఎదుట ప్రతి మోకాళ్లు వంగున్
ప్రతి నాలుక యేసు ప్రభుని ఒప్పుకొనును
అధికంగా ఆయనను హెచ్చించేదం
యేసు నామమునే గొప్ప చేసెదాము } 2
పరలోకమునకు వెళ్ళి దూతల మీదను
-అధికారుల మీదను శక్తుల మీదను } 2
అధికారం పొందినవాడై
-దేవుని కుడి పార్శమున ఉన్నాడు } 2 || బెత్లెహేము ||
వచ్చాడు వచ్చాడు రారాజు
పరలోకంలో నుండి వచ్చాడు
తెచ్చాడు తెచ్చాడు రక్షణ
పాపుల కొరకై తెచ్చాడు } 2
ఆనందమే ఆనందమే
క్రిస్మస్ ఆనందమే
సంతోషమే సంతోషమే
మన బ్రతుకుల్లో సంతోషమే } 2 || వచ్చాడు ||
చలి చలిగా ఉన్న ఆ రాత్రి వేళలో
దేవదూత వచ్చి శుభవార్త చెప్పెను } 2
మీ కొరకు రక్షకుడు
లోకానికి ఉదయించేనూ } 2
దూతలేమొ సందడి
గొల్లలేమొ సందడి
యేసయ్య పుట్టాడని } 2 || వచ్చాడు ||
పశువుల పాకలో పరిశుధ్దుడు
మనమెట్టి వారమైన త్రోసివేయడు } 2
మన దోషం తొలగించే
యేసు క్రీస్తు జన్మించెను } 2
దాసులేమొ సందడి
దేశమేమొ సందడి
యేసయ్య పుట్టాడని } 2 || వచ్చాడు ||
ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార
తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ } 2
సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||
గొల్లలందరు పూజింప వచ్చిన మంచి కాపరి
దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు } 2
నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు
తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు } 2
సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||
నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు
ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు } 2
నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు - ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు } 2
సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||
మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు
పేద వాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు } 2
నేనే మార్గము, సత్యము, జీవమన్నాడు
ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు } 2
సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది } 2
ఉరువాడ పల్లెపల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే } 2
మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను } 2
రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం } 2 || వచ్చింది ||
దావీదు పట్టణములో భేత్లేహేము గ్రామములో
కన్యమరియ గర్బమునందు బాలుడిగా జన్మించెను } 2
అంధకారమే తొలగిపోయెను చికుచింతలే తీరిపొయెను } 2
మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను } 2
రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం } 2 || వచ్చింది ||
ఆకాశంలో ఒక ధూత పలికింది శుభవార్త
మనకొరకు రక్షకుడేసు ధీనునిగ పుట్టాడని } 2
పాపశాపమే తొలగించుటకు గొప్పరక్షణ మనకిచ్చుటకు
మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను } 2
రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం } 2 || వచ్చింది ||
చెరలో ఉన్న వారిని విడిపించాడు } 2
చీకటి బ్రతుకులో ఉన్న వారికి వెలుగునిచ్చాడు } 2
యేసే రక్షకుడు యేసే దైవము
యేసే ఆదరణ నిత్యము నిలుచును } 2 || బేత్లెహేము||