-->
దేవా నా ఆర్థధ్వని వినవా
నేనేల దూరమైతిని - కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా
గాలివాన హోరులో - గమ్యమెటో కానరాక
గురియైన నిను చేర - పరితపించుచున్నాను
ఆదరణయైనను- ఆరోగ్యమైనను - ఆనందమైనను నీవేగదా || దేవా ||
అంతరంగ సమరములో - ఆశలెన్నో విఫలముకాగ
శరణుకోర నినుచేర - తల్లుడిల్లుచున్నాను
ఆధారమైనను - ఆశ్రయమైనను - ఆరాధనైనను నీవేగదా || దేవా ||
Song no: 146
సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు } 2
దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప
మహిమాత్మతో నను నింపితివా } 2
అతీసుందరుడా నా స్తుతి సదయుడ
కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా } 2
ఎనలేనే నీ ఘనకార్యములు తలచి
స్తుతించుచు నిను నే మహిమపరతును } 2 || సర్వాధికారివి ||
బలశౌర్యములుగల నా యేసయ్యా
శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా
మారవే నీ సాహసకార్యములు యెన్నడు
ధైర్యముగా నిను వెంబడింతును } 2 || సర్వాధికారివి ||
సర్వజగద్రక్షకూడా - లోకరాజ్యపాలక
భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా } 2
బలమైన నీ రాజ్యస్థాపనకై నిలిచి
నిరీక్షణతో నే సాగిపోదును } 2 || సర్వాధికారివి ||
Song no: 147
నా స్తుతుల పైన నివసించువాడా
నా అంతరంగికుడా యేసయ్యా (2)
నీవు నా పక్షమై యున్నావు గనుకే
జయమే జయమే ఎల్లవేళలా జయమే (2)
నన్ను నిర్మించిన రీతి తలచగా
ఎంతో ఆశ్చర్యమే
అది నా ఊహకే వింతైనది (2)
ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి
ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) || నా స్తుతుల ||
ద్రాక్షావల్లి అయిన నీలోనే
బహుగా వేరు పారగా
నీతో మధురమైన ఫలములీయనా (2)
ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే
విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) || నా స్తుతుల ||
నీతో యాత్ర చేయు మార్గములు
ఎంతో రమ్యమైనవి
అవి నాకెంతో ప్రియమైనవి (2)
నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి
పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2) || నా స్తుతుల ||
Song no: 148
ప్రభువా నీ కలువరి త్యాగము
చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే || ప్రభువా ||
నీ రక్షణయే ప్రాకారములని
ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2
లోకములోనుండి ననువేరు చేసినది
నీదయా సంకల్పమే - 2 || ప్రభువా ||
జీవపు వెలుగుగ నను మార్చుటకే
పరిశుద్ధాత్మను నాకొసగితివే - 2
శాశ్వత రాజ్యముకై నను నియమించినది
నీ అనాది సంకల్పమే - 2 || ప్రభువా ||
సంపూర్ణునిగా నను మార్చుటకే
శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2
పరిపూర్ణ శాంతితో నను కాచుటయే
నీ నిత్యసంకల్పమే - 2 || ప్రభువా ||
Song no: 150
ఆశ్రయదుర్గమా నా యేసయ్యా
నవజీవన మార్గమున నన్ను నడిపించుమా!
ఊహించలేనే - నీ కౄపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే
లోకమర్యాదలు మమకారాలు గతించిపోవునే
ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||
నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటినే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||
పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అణుకువతోనే నీ కృపపొదెద
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||
నిత్యనివాసివై నీ ముఖముచూచుచు పరవసించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నలో కలిగించుచున్నది
స్తుతిఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా! || ఆశ్రయ ||
aaSrayadurgamaa naa yesayya
navajeevana maargamuna nannu naDipiMchumaa!
oohiMchalaenae - nee kRupalaeni kshaNamunu
kOpiMchuchunae vaatsalyamu naapai choopinaavae
lOkamaryaadalu mamakaaraalu gatiMchipOvunae
aatmeeyulatO akshayaanubaMdhaM anugrahiMchitivae
aMdukae ee stuti ghana mahimala stOtraaMjali " aaSraya "
naatO neevu chaesina nibaMdhanalanniyu neravaerchuchuMTinae
neetO chaesina teermaanamulu sthiraparachitivae
aMdukae ee stuti ghana mahimala stOtraaMjali " aaSraya "
paravaasinaitini vaagdhaanamulaku vaarasatvamunnanu
nee SikshaNalO aNukuvatOnae nee kRpapodeda
aMdukae ee stuti ghana mahimala stOtraaMjali " aaSraya "
nityanivaasivai nee mukhamuchoochuchu paravasiMchedanae
ee nireekshaNayae uttaejamu nalO kaligiMchuchunnadi
stutighana mahimalu neekae chellunu naa yaesayyaa
hallaelooyaa - hallaelooyaa - hallaelooyaa! " aaSraya "