Showing posts with label Marriage lyrics. Show all posts
Showing posts with label Marriage lyrics. Show all posts

Anuraga valli ma inti jabilli అనురాగ వల్లీ మా ఇంటి జాబిల్లి

Song no: 88

    అనురాగ వల్లీ మా ఇంటి జాబిల్లి (2)
    మధురమైన నీపెళ్ళి మా కంటివెలుగు ఓ తల్లి (2) అనురాగ

  1. ఆదర్శగృహినివై నీ ఇంటినే ఆనంద గృహముగ తీర్చాలి (2)
    ఆత్మీయ వరములు మెండుగా నీ ముంగిట వర్శించాలి (2)
    నీ అక్కర లన్నితీరాలి | అనురాగ|

  2. కలిమి లేములలొ కృంగక కరములు జోడించి వేడాలి
    కరుణామయుని కనికరం కలకాలం నీకుండాలి (2)
    కన్నవారింటి గౌరవం కలకాలం కాపాడాలి (2)
    నీ ఇంటి పేరు నిలపాలి |అనురాగ|

Thipi asala mandharalu virabusina e vela తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ

Song no: 175

    తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ
    చిలిపి ఊసులు సింధూరాలు కలబోసిన శుభవేళ
    అనురాగంతో ఒకటవ్వాలని
    అనుకున్నవన్నీ నిజమవ్వాలని
    ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం
    దీవిస్తూ శుభముగ మీ పరిణయం {తీపి ఆశల}

  1. ఇన్నినాళ్లుగా వేచిన సమయం ఎదురుga నిలచింది
    చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది } 2
    కలకాలం మీరు కలసి ఉండాలని
    చిరజీవం మీపై నిలిచి ఉండాలని
    ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం
    దీవిస్తూ శుభముగ మీ పరిణయం {తీపి ఆశల}

  2. త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల నెరవేరింది
    ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగ మారింది } 2
    అరమరికలు లేక ఒకటి కావాలని
    పరలోక తండ్రికి మహిమ తేవాలని
    ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం
    దీవిస్తూ శుభముగ మీ పరిణయం {తీపి ఆశల}

Yekkadekkado putti yekadekkado perigi ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి


చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో 
.. దేవుని సంకల్పం (ఇది) సృష్టిలో విచిత్రం /2/

ఒంటరి బ్రతుకులు విడిచెదరు
ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు /2/
పెళ్లినాటినుండి తల్లిదండ్రుల వదలి 
భార్యాభర్తలు హత్తుకొనుటేమిటో /దేవుని/

గతకాల కీడంతా మరిచెదరు
మేలులతో సంతసించెదరు /2/
పెళ్లినాటినుండి ఒకరి కష్టం ఒకరు 
ఇష్టముతో పంచుకొనుటేమిటో /దేవుని/

ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధిపొందెదరు /2/
పెళ్ళి నాటినుండి మా కుటుంబం అంటూ 
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో /దేవుని/


Vinaya vidheyatha bakthi sthri ki alakaram వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం


యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం 
. . సంఘానికి ప్రతిరూపంసంతోషానికి మూలం /2/

పురుషుని పక్కనుండి తీయబడిన నారి
సరియగు సహాయమై వుండాలని కోరి /2/
స్త్రీనిగ నిర్మించి పురుషునితో కలిపెను /2/
మేలు కలుగునట్లు జంటగా నిలిపెను/2/వినయ

సృష్టిని కలిగించి మనుష్యుని నిర్మించి
సంతోషించుమని సర్వమనుగ్రహించి /2/
వివాహబంధముతో కుటుంబమును కట్టెను/2/ 
ఇంటికి దీపముగా ఇల్లాలిని నిలబెట్టెను /2/వినయ


Dhaiva nirnayam e parinayam దైవ నిర్ణయం ఈ పరిణయం


యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం – నిలిచియుండును ఇలలో కలకాలం 
1. అన్నిటిలో వివాహం ఘనమైనదని – పానుపు కల్మషము లేనిదని
యెహోవాయే కలిగించిన కార్యమని – మహోన్నతుని వాక్యమే తెలిపెను 
2.పురుషునిలో సగభాగం తన భార్యయని – ప్రేమించుట అతనికున్న బాధ్యతని 
విధేయత చూపించుట స్త్రీ ధర్మమని – సజీవుడైన దేవుడే తెలిపెను 

Lyrics in English
Daiva Nirnayam ee parinayam – ramaneeyam atimadhuram
Yesulo yekamaina iruvuri anubandham – Nilachiyundunu ilalo Kalakaalam
1. Annitilo vivaaham ghanamainadani – paanupu ye kalmashamu lenidani
Yehovaye kaliginchina kaaryamani – mahonnatuni vaakyame telipenu
2.Purushunilo sagabhaagam tana bhaaryayani – preminchuta atanikunna baadhyatani 
vidheyata choopinchuta stree dharmamani – sajeevudaina devude telipenu


Muddha banthi pusene koyilamma kusene ముద్ద బంతి పూసెనే కోయిలమ్మ కూసెనే


ఆనందం వెల్లివిరిసెనే – ( బంధం నిత్యం నిలిచెనే)(2) /2/

పెళ్లనే బంధంఅనురాగపు అనుబంధం
తీయనైన మకరందం –  ఇగిరిపోని సుమగంధం /2/
తోడుగా ఈడు జోడుగాజంటగా కనుల పంటగా /2/
పండాలి బ్రతుకు నిండాలిదాంపత్యమే వెలుగుతుండాలి /2/ముద్ద/

దేవుడే ఏర్పరచిన దివ్యమైనదీబంధం
క్రీస్తుయేసు సంఘమునకు పోల్చబడిన సంబంధం /2/ 
దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా /2/ 
కలతలే లేక సాగాలి కలలన్ని నిజము కావాలి /2/ముద్ద/

Lyrics in English
Muda banti poosene – Koyilamma Koosene
Aanandam vellivirisene – (Ee bandham nityam nilichene)(2)/2/

Prellane ee bandham – Anuraagapu anubandham
Teeyanaina makarandam – igiriponi sumagandham /2/
Todugaa eedu joduga – jantaga kanula pantaga /2/
Pandaali bratuku nindaali – daampatyame velugutundaali /2/mudda/

Devude yerparachina divyamaina deebandham
Kreestu Yesu sanghamunaku polchabadina sambandham /2/
Devude jata cheyagaa – saadhyama veru cheyagaa /2/
Kalatale leka saagaali – kalalanni nijamu kaavaali /2/mudda/


Kalyaname vaibhogame kamaneeya కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం


శ్రుతిలయల సుమధుర గీతం /2/
దైవ రచిత సుందర కావ్యం /కళ్యాణమే/
1
పరమ దైవమె ప్ర్రారంభించిన పరిశుద్ధమైన కార్యం /2/
నరుని మంచికై తన చేతులతో 
ప్రభు రాసిచ్చిన పత్రం /కళ్యాణమే/
2
కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం
మోడుగానున్న జీవితాలు /2/  
చిగురింపజేసే వసంతం  /కళ్యాణమే/
3
దేవదూతలే తొంగిచూసేటి దృశ్యం
భావమధురిమలు పొంగజేసేటి /2/ 
కమనీయమైన చిత్రం /కళ్యాణమే/



Vacchindhi vacchindhi madhuramaina samayam వచ్చింది వచ్చింది మధురమైన సమయం


తెచ్చింది నూతన కాంతుల ఉదయం 
రావయ్యా వరుడా (రావమ్మా వదువాసుస్వాగతం 
నీకోసమే  స్వాగత గీతం 
1
మల్లెలు పరిమళం చల్లినవేళ
అల్లరి తెమ్మెర తాకినవేళ /2/
వెల్లువై ఆనందం పొంగిన వేళ 
మెల్లగ నీ పాటి దరిచేరగా /2/రా/
2
కోయిల గానాలు వినిపించువేళ
కోరిన ఘడియలు ఎదురైనవేళ /2/
చామంతులే పలకరించినవేళ 
చేయందుకొని సతిని స్వీకరించగా /2/రా/
3
పరలోక వాకిళ్లు తెరచుకొన్నవేళ
పరమాశీర్వాదాలే కురియుచున్నవేళ /2/
మనసైన నీ వరుడు ఎదురు చూచువేళ 
వినయముగా నీ ప్రియుని సంధించగా /2/రా/



Koniyadabadunu yehovayandhu bhayabakthulu కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు


తనవారికైన పగవారికైన పంచును సమత మమత 

1.ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు
ప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పు 
కలిగిన భార్య ఇంటికి దీపము 
సంఘమనే వధువునకు నిజమైన రూపము 

2.తండ్రివలె ఓదార్చి తల్లివలె సేదదీర్చి
మిత్రునివలె భర్తకు ఎప్పుడు తోడుగ నిల్చును 
దైవ జ్ఞానముతో కుటుంబమును నడుపును 
రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును 

3.బ్రతుకు దినములన్నియును భర్తకు మేలే చేయును
దీనులకు దరిద్రులకు తన చేయిచాపును 
ఆహారమును తానే సిద్ధపరచును 
ఇంటివారినందరిని కనిపెట్టుచుండును 

Lyrics in English
Koniyaadabadunu Yehova yandu – bhaya bhaktulu gala vanitha
Tanavaarikaina pagavaarikaina panchunu samata mamata

1.Prati paristitini premato bharinchagaligina orpu
Pratikoolatanu anukulamugaa maarcheti nerpu
Kaligina bhaarya intiki deepamu
Sanghamane aa vadhuvunaku nijamaina roopamu

2.Tandrivale odaarchi tallivale seda deerchi
Mitrunivale bharthaku yeppudu toduga nilchunu
Daiva jnaanamutho kutumbamunu nadupunu
Raabovu vaati goorchi nishntaga nundunu

3.Bratuku dinamulanniyunu Bhataku mele cheyunu
Deenulaku daridrulaku tana cheyi chaapunu
Aahaaramunu taane siddhaparachunu
Inti vaarinandarini Kanipettuchundunu


Manavula melukoraku jnaniyaina devudu మానవుల మేలుకొరకు జ్ఞానియైన దేవుఁడు


Song no: 563
రాగం- జంఝటి   
వివాహము  
తాళం- ఆది  

మానవుల మేలుకొరకుజ్ఞానియైన దేవుఁడు = మానుగఁ కళ్యాణ పద్ధతిమహిని నిర్ణయించెగా /మాన/
1కానాయను నూరిలో మనకర్త చూచె బెండ్లిని = పానముగను ద్రాక్షారసముదాన మొసఁగెఁ బ్రీతిని /మాన/
2యేసూ వీరిద్దరినియేకముగా జేయుమీ = దాసులుగాను జేసి వీరి దోషము లెడబాపుమీ /మాన/
3కర్త వీరలకు భార్యభర్తల ప్రేమంబును = బూర్తిగ నీవిచ్చి వీరి బొందుగాను నడుపుమీ /మాన/
4భక్తియు విశ్వాస ప్రేమలుభావమందు వ్రాయుమీ = ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగులఁ జేయుమీ /మాన/
Lyrics in English
Maanavula melukoraku jnaaniyeina devudu = maanuga kalyaana paddati mahini nirnayinchega /maana/
1.Kaanaayanu oorilo mana – kartha chuche bendlini = paanamuganu draaksharasamu – Daanamosage breetini /maana/
2.Yesu veeriddarini – Yekamuga jeyumee = Daasuluganu Jesi veeri doshamuleda baapumee /maana/
3.Kartha veeralaku bharya-bhartala premambunu = Boortiga neevichhi veeri bondugaanu nadupumee

4.Bhaktiyu veswaasa premalu – bhaavamandu vraayumee = Mukthi sarani vedaka veeri bhakthi migula jeyumee /maana/

Mamathanu ragale malaluga samathanu bandhale మమతానురాగాలె మాలలుగా సమతాను బంధాలే

Song no: 81
    మమతానురాగాలెమాలలుగా
    సమతాను బంధాలే ఎల్లలుగా -2
    కట్టబడిన కాపురం -అనురాగ గోపురం -2
    ఈ పరిణయం – యెహోవా నిర్ణయం -2

  1. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును
    ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించె
    అటువలెనే పురుషుడు కూడ -తన స్వంత దేహమువోలె
    భార్యను ప్రేమించవలెనని – యేసయ్య ఏర్పరచినది

  2. కుమారుడు క్రీస్తు శిరస్సైన తండ్రికి
    అన్ని వేళలందు విధేయత చూపె
    అటువలెనె స్త్రీ కూడ – శిరస్సైన పురుషునికి
    అన్నిటిలో విధేయురాలిగ – ఉండునట్లు ఏర్పరచినది



    Manataanuraagaale malaluga
    Samataanubandhaale Yellalugaa
    Kattabadina kaapuram – Anuraaga gopuram
    Ee parinayam – Yehova Nirnayam

  1. Varudaina Kreesthu Vadhuvaina sanghamunu
    Yentagaano preminchi – praanamune arpinche
    Atuvalene purushudu kudaa – Tana swanta dehamuvole
    Bhaaryanu preminchavalenani – Yesayya yerparachinadi

  2. Kumaarudu Kreesthu sirassaina tandriki
    Annivelalandu vidheyata chupe
    Atuvalene stree kuda – sirassaina purushuniki
    Annitilo vidheyuraaliga – vundunatlu Yerparachinadi

Aikyaparachumayya e vadhuvarulanu ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను


సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను 
మధుర ప్రేమలో మనసులు కలువ 
హృదయ సీమలే ఒకటిగ నిలువనీ దీవెనలే పంపుమా 

1.ఆనందము తోడ దుఃఖమునే గెల్వ – చిరునవ్వుతోడ కష్టముల నోర్వ 
సంసార నావను సరిగా నడిపించ – నీవే సహాయమీయుమా 

2.ప్రార్ధనా జీవితము సమాధానము – భక్తి విశ్వాసము నీతి న్యాయము 
నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం – అనుగ్రహించి నడిపించుమా 

3.ఇహలోక భోగముపై మనసుంచక – పరలోక భాగ్యముపై లక్ష్యముంచగ
నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై – సాగే కృప దయచేయుమా 
Lyrics in English
Ikyaparachumayya ee vadhuvarulanu
soukhyamichhi kaayumu nava dampatulanu
madhurapremalo manasulu kaluva
hrudayaseemale okatiga niluva – nee deevenale pampumaa 

1.Aanandamu toda dukhamune gelva – chirunavvu toda kashtamula norva
samsaara naavanu sariga nadipincha – neeve sahaayameeyumaa 

2.Praardhanaa jeevitamu samaadhaanamu – bakthi viswaasamu neeti nyaayamu
neevu choopina kanikaram nivu nerpina saatwikam – anugrahinchi nadipinchumaa
3.Ihaloka bhogamulapai manasunchaka – paraloka bhaagyamulapai lakshayamunchaga
Neekentho ishtulai dharalo nee saakshulai – saage krupa dayacheyumaa 


Kalyana veduka ramaniya geethika కళ్యాణ వేడుక రమణీయ గీతిక


శుభప్రద ఆశాదీపికసుమధుర స్వరమాలిక 
క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక 
నూతన జీవిత ప్రారంభ వేదిక 
1
వివాహ వ్యవస్థను చేసిన దేవుడు
మొదటి వివాహము జరిగించినాడు 
సంఘ వదువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు 
ఈనాటి పెళ్ళికి కారణభూతుడు 
కడపటి పెళ్ళికి ఆయనే వరుడు 
2
ఒకరికి ఒకరు సహకారులుగా
సంతోషముతో ఇల జీవించగా 
సంతానముతో దీవించబడగా 
సహవాసములో సంతృప్తి చెందగా 
పరిశుద్ధుడే కలిపె ఇరువురిని ఒకటిగా 
3
కిలకిల రవళుల వీణెలు మ్రోగెను
ఆనంద లహరుల సందడి సాగెను 
పరలోక దూతల సంతోష గానాలు 
బంధుమిత్రుల అభినందన మాలలు 
జంట కనులలో వెలిగే కాంతులు

Nuthana jeevithalu okatayye ee vela sandhaditho నూతన జీవితాలు ఒకటయ్యే ఈవేళ సందడితో సంతోషాలతో

నూతన జీవితాలు ఒకటయ్యే ఈవేళ
సందడితో సంతోషాలతో
మైమరచే ఈశుభవేళ       " 2 "
యేసయ్య దిగివచ్చేగా
దీవెనలు కురిపించగా
దీవించి ఆశీర్వదించి కలిపేను ఒక జంటగా
ఒకరికి ఒకరు అండగా ఉంటూ
ఆత్మీయ మేలులతో జీవితం కొనసాగుతూ "2"
దేవునికి దగ్గరగా లోకులకు దూరంగా " 2 "
దేవుని సన్నిధిలో కలకాలం ఉండాలిక " 2 "
                                "నూతన"
ఆశీర్వాదముతో అడుగులు వేస్తూ
దేవుని దీవెనలు నిత్యము పొందుతూ " 2 "
కష్టాలలో దేవుని మరువక                  " 2 "
బాధలలో తన చేయి విడువక            " 2 "
                                     "నూతన"
దేవుడు ఎన్నడూ మిమ్మును విడువడు
బుద్ధిని జ్ఞానమును సంపద మీకిచ్చును" 2 "
దేవుని యందు భయభక్తులు కలిగి       " 2 "
ఉండాలి మీరిక బ్రతకాలి జాగ్రత్తగా       " 2 "
                                      "నూతన"