Showing posts with label Vijay Krupanandh kumar. Show all posts
Showing posts with label Vijay Krupanandh kumar. Show all posts

Prematho nee patanu padukovalani charanamai ప్రేమతో నీ పాటను పాడుకోవాలని చరణమై నీపాటలో

Song no:

ప్రేమతో  నీ పాటను పాడుకోవాలని
 చరణమై నీపాటలో నిలిచిపోవాలని
 కుమారునిగా నా తండ్రి నీలో సాగిపోవాలని
 ఆశ నా ఆశ  " ప్రేమతో  నీ పాటను"

1.నీవే ప్రేమై నిలిచినదేవా  నన్నాదరించావు నిండుగా
నాక్షేమమే నీవు కోరగా  ఆనందమే జీవితం ఆనందమే నా జీవితం"2"
ఎంతో పరిశుద్ధము దేవా నీ నామము
ఆశ్రయించి,నిన్నాశ్రయించి గానమే చేసెదా  " ప్రేమతో  నీపాటను "

2. నీవే ఘనత నీవే మహిమ నీవేకదా నాకు సన్నిధి
నీ ప్రేమ నాలోన ఉన్నది నీ కోసమే నా హృది
దేవా నీకోసమే నా హృది "2"
నీవే నా సర్వము నీవే నా విజయము
ప్రేమలోనే నీ ప్రేమలోనే ఉంది సంతోషము " ప్రేమతో  నీ పాటను

Naa gunde gudilo kolichedhanu na priyuda ninu thalachedhanu నా గుండె గుడిలో కొలిచెదను నా ప్రియుడా నిను తలచెదను

నా గుండె గుడిలో కొలిచెదను - నా ప్రియుడా నిను తలచెదను (2)
ఏమిచ్చి నీ ఋణము - తీర్చుకొందును (2)
నాపై చూపిన ప్రేమకు ఏమిచ్చి నీ ఋణము తీర్చుకొందును  " నా గుండె "

నిష్ ప్రయోజకుడనే - నీతిమాలిన వాడనే
నీచుడనే - నిందలు మోపిన వాడనే    " 2 "
నను ఏలి మలిచావు ఆశీర్వదించావు  " 2 "
మనసారా పిలిచావు జాలి చూపావు ఫలియింపజేశావు
                " నా గుండె "

నేను వంచకుడనే - వెక్కిరించిన వాడనే
దుష్టుడనే - ద్రోహము చేసిన వాడనే  " 2 "
నా కోసం నీ రక్తం కార్చావు కల్వరిలో "2" 
దయతోడ దరిజేరి ఆదరించావు నను అంగీకరించావు " నా గుండె "