Showing posts with label krupa gala raju - కృపగల రాజు. Show all posts
Showing posts with label krupa gala raju - కృపగల రాజు. Show all posts

Dhaveedhu pattanamamdhu neethi suryudu దావీదు పట్టణమందు నీతి సూర్యుడు జన్మించెను

Song no:
HD
    దావీదు పట్టణమందు
    నీతి సూర్యుడు జన్మించెను } 2
    నేడే ఈ శుభవార్త
    ప్రజలందరికీ సంతోషము } 2
    Happy Happy Christmas
    Merry Merry Christmas } 2
    ఆనందమే సంతోషమే } 2 || దావీదు పట్టణ ||

  1. ప్రభువుదూత వచ్చి
    క్రీస్తు వార్తను తెలిపెను } 2
    గొర్రెల కాపరులెల్లి
    దేవుని మహిమ పరచిరి } 2
    Happy Happy Christmas
    Merry Merry Christmas } 2
    ఆనందమే సంతోషమే } 2 || దావీదు పట్టణ ||

  2. ఆకాశంలో నక్షత్రమును చూచిరి } 2
    తూర్పు జ్ఞానులు వెళ్లి
    యేసుకు కానుకలర్పించిరి } 2
    Happy Happy Christmas
    Merry Merry Christmas } 2
    ఆనందమే సంతోషమే } 2 || దావీదు పట్టణ ||

  3. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా } 2
    లోకపాపములు మోసుకొనే
    దేవుని గొర్రెపిల్లగా } 2
    Happy Happy Christmas
    Merry Merry Christmas } 2
    ఆనందమే సంతోషమే } 2 || దావీదు పట్టణ ||

Samvastharamulu gathiyinchina needhu krupa nannu సంవత్సరములు గతియించినా నీదు కృప నన్ను

Song no:
HD
    సంవత్సరములు గతియించినా
    నీదు కృప నన్ను విడువలేదయ్యా } 2
    యేసయ్య నీకృపతోనే నన్ను కాపాడినావు } 2
    నీ దయలోనే నన్ను దాచినావయ్యా } 2
    ఆరాధనా స్తోత్రముల్
    హల్లెలూయా వందనం } 2
    హల్లెలూయా వందనం || సంవత్సరములు ||

  1. ఆపద కాలములో నన్ను అదుకున్నావు
    కష్ట కాలములో నన్ను విడిపించావు } 2
    నీకు నేను మొఱ్ఱ పెట్టుకొనగా
    కనుపాపల కాపాడినావు } 2
    కృప చూపినవాడవు దయచూపినవాడవు
    రక్షించినవాడవు యేసయ్యా
    ఏమివ్వగలనూ నేనేమివ్వగలనూ || సంవత్సరములు ||

  2. మనో వేదనలో క్రుంగిపోవుచుండగా
    ఆదరించు వారు లేక
    కుమిలిపోవుచుండగా } 2
    నీ సన్నిధి నాతోడు ఉంచీ
    కృప వెంబడి కృప లెన్నో చూపి } 2
    వేదన తీర్చావుగా బాధలు తీశావుగా అదుకున్నావుగా యేసయ్య
    ఏమివ్వగలనూ నేనేమివ్వగలనూ || సంవత్సరములు ||

  3. నూతన క్రియలు జరిగించినావు
    నూతన అభివృద్ధిని దయచేసినావు
    దయాకిరీిటము నాపై నిలిపీ
    సమయోచిత సాయములను చేసీ    " 2 "
    దీవించినావుగా బలపరచినావుగా
    హెచ్చించినావుగా యేసయ్యా
    ఏమివ్వగలనూ నేనేమివ్వగలనూ || సంవత్సరములు ||


 

Kreesthu bethlehemulo puttenu christmas sambaraluga క్రీస్తు బేెత్లెహేములో పుట్టెను క్రిస్మస్ సంబరాలుగా తెచ్చెను

Song no:
HD
    క్రీస్తు బేెత్లెహేములో పుట్టెను
    క్రిస్మస్ సంబరాలుగా తెచ్చెను } 2

    నజరేతు వాడా యేసయ్య
    మమ్ములను రక్షింప వచ్చావయ్య } 2
    కృపాసత్య సంపూర్ణుడుగా వచ్చావయ్యా } 2
    భూలోకమంతా ఆనందము
    సంతోష గానాలతో
    క్రిస్మస్ సంబరాలా సంతోషము
    ఆనంద గానాలతో
    ఆనంద గానాలతో.. ఓ...ఓ... || క్రీస్తు బేెత్లెహేములో ||

  1. కన్యక మరియమ్మ గర్భములోను
    పరిశుద్ధుడైన యేసు జన్మించెను } 2
    మానవాళి పాపములను తీసివేయును
    పరలోకము నుండి దిగి వచ్చెను } 2
    సంబరాలే  సంబరాలే
    క్రిస్మస్ పండుగ సంబరాలే
    సంబరాలే  సంబరాలే
    క్రిస్మస్ సందడి సంబరాలే
    లోకాన వెలుగాయెనే..హే...హే..."
    లోకాన వెలుగాయెనే || క్రీస్తు బేెత్లెహేములో ||

  2. సర్వోన్నతమైన స్థలములలోన
    దేవునికి మహిమయే ఎల్లప్పుడు } 2
    ఆయన కిష్టులైన వారందరికీ
    భూమి మీద సమాధానము కలుగును } 2
    సంబరాలే  సంబరాలే
    క్రిస్మస్ పండుగ సంబరాలే
    సంబరాలే  సంబరాలే
    క్రిస్మస్ సందడి సంబరాలే
    లోకాన వెలుగాయెనే ..హే....హే.....
    లోకాన వెలుగాయెనే || క్రీస్తు బేెత్లెహేములో ||

  3. పరలోక రాజ్యము సమీపించెను
    మారుమనస్సు పొందమని
     యేసు చెప్పెను } 2
    చీకటి జనులందరికి వెలుగు కలుగును
    మరణముపై యేసు మనకు
    జయమిచ్చెను } 2
    సంబరాలే  సంబరాలే
    క్రిస్మస్ పండుగ సంబరాలే
    సంబరాలే  సంబరాలే
    క్రిస్మస్ సందడి సంబరాలే
    లోకాన వెలుగాయెనే..హే....హే...
    లోకాన వెలుగాయెనే || క్రీస్తు బేెత్లెహేములో ||

Bethlehemu puramulo yesu puttadu బేత్లెహేము పురములో యేసు పుట్టాడు

Song no:
HD
    బేత్లెహేము పురములో యేసు పుట్టాడు
    మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు } 2

  1. జిగట ఊబిలో ఉన్నవారిని లేవనెత్తాడు } 2
    అనాదులుగా ఉన్నవారిని చేరదీశాడు } 2
    యేసే రక్షకుడు యేసే దైవము
    యేసే ఆదరణ నిత్యము నిలుచును } 2 || బేత్లెహేము||

  2. నశియించుచున్నవారిని ప్రేమించాడు } 2
    అశాంతిలో ఉన్నవారికి నెమ్మదినిచ్చాడు } 2
    యేసే రక్షకుడు యేసే దైవము
    యేసే ఆదరణ నిత్యము నిలుచును } 2 || బేత్లెహేము||

  3. చెరలో ఉన్న వారిని విడిపించాడు } 2
    చీకటి బ్రతుకులో ఉన్న వారికి వెలుగునిచ్చాడు } 2
    యేసే రక్షకుడు యేసే దైవము
    యేసే ఆదరణ నిత్యము నిలుచును } 2 || బేత్లెహేము||