Udhayinche dhivya rakshakudu ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున

ly
0
Song no: 228

    ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున
    మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియ్యను

  1. ఘోరాంధకారమున దీపంబులేక - పలుమారు పడుచుండగా
    దుఃఖ నిరాశ యాత్రికులంతా - దారితప్పియుండగా
    మార్గదర్శియై నడిపించువారిన్ - ప్రభుపాద సన్నిధికి
    దివ్యరక్షకుడు ప్రకాశ వెలుగు - ఉదయించె ఈ ధరలో || ఉదయించె ||

  2. చింతవిచారముతో నిండియున్న - లోకరోదనవిని
    పాపంబునుండి నశించిపోగా - ఆత్మవిమోచకుడు
    మానవాళికై మరణంబునొంది - నిత్య జీవము నివ్వన్
    దివ్యరక్షకుడు ప్రకాశతార - ఉదయించె రక్షింపను || ఉదయించె ||

  3. పరలోక తండ్రి కరుణించి మనల - పంపెను క్రీస్తుప్రభున్
    లోకాంధులకు దృష్టి నివ్వ - అరుదెంచె క్రీస్తు ప్రభువు
    చీకటినుండి దైవ వెలుగునకు - తెచ్చె క్రీస్తు ప్రభువు
    సాతాను శృంఖలములను తెంప - ఉదయించె రక్షకుడు || ఉదయించె ||


Post a Comment

0Comments

Post a Comment (0)