Showing posts with label Ch Joshua daniel. Show all posts
Showing posts with label Ch Joshua daniel. Show all posts

Samvastharamantha nee krupalone dhachavu yesayya సంవత్సరమంతా నీ కృపలోనే దాచావు యేసయ్య

సంవత్సరమంతా నీ కృపలోనే
దాచావు యేసయ్య      " 2 "
నీతిని ధరింపజేసి
పరిశుద్ధత నాకిచ్చి       " 2 "
నీ సొత్తుగ నను మార్చుకుంటివా " 2 "
అందుకే అందుకే
నేను నీ సొంతం నీవు నా సొంతం " 2 "

గడచిన దినములలో
నీ దయా కిరీటమునిచ్చి
కృప వెంబడి కృపతో
నా నడకను స్థిరపరచినావు " 2 "
దినదినము అనుక్షణము
నన్ను కాపాడుచుంటివా    " 2 "
నా ధ్యాస నా శ్వాస నీవయ్య
నీ కాపుదల నీ సహాయము
నాకుండగా                       " 2 "
అందుకే అందుకే
నేను నీ సొంతం నీవు నా సొంతం " 2 "
                   " సంవత్సరమంతా "

ఆకాశ పక్షులను చూడుడి
అవి విత్తవు కోయవు
పంటను కూర్చుకొనవు
దేనికి చింతించవు              " 2 "
వాటికంటే శ్రేష్ఠమైన
నీ స్వాస్థ్యము నేనే కదా     " 2 "
నా ధ్యాస నా శ్వాస నీవయ్య
నీ కాపుదల నీ సహాయము
నాకుండగా                       " 2 "
అందుకే అందుకే
నేను నీ సొంతం నీవు నా సొంతం " 2 "
                   " సంవత్సరమంతా "