Showing posts with label Deva Sahayamu. Show all posts
Showing posts with label Deva Sahayamu. Show all posts

Yesu vanti priya bandhudu nakika niha paramulalo యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న

Song no: 174

యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న భాసురముగ నిజ భక్తుల కది యను భవ గోచర మెపు డగు నన్న ||యేసు||

ఊరు పేరు పరువులు మురువులు మరి యూడఁగొట్టబడినను గాని కూరిమితో క్రీస్తుడు మాకుండినఁ కొదువరాదు గొప్పయు పోదు ||యేసు||

ఆడికలు తిరస్కారంబులు మా కవమానము లున్నన్ గాని తోడు క్రీస్తుఁడు మాకుండినను త్రోవఁ దప్పము ఓడిపోము ||యేసు||

తగ్గుపాటులును సిగ్గుపాటులును దలమీఁదను వ్రాలినగాని దగ్గర మా పాలిటఁ ప్రభువుండగ సిగ్గును బొందుము తగ్గునఁ గుందము ||యేసు||

ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలఁ జుట్టిన యపుడు కన్న తండ్రివలె నోదార్చుచుఁ దన ఘన వాగ్బలమున దునుమును వానిని ||యేసు||

మనసు క్రుంగి పలు చింతలచేత మట్టఁబడిన వేళను మాకుఁ తన వాగ్దత్తములను జేతుల లే వనెత్తి యెంతో సంతస మొసఁగును ||యేసు||

తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలఁ డెప్పుడు మమ్ము ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహో యనుచు దరికి వచ్చు ||యేసు||

అతఁ డుండని పరమండలము ఇక వెదకినగాని యగపడదు క్షతినాతఁ డు మా మతిని వసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము ||యేసు||