Showing posts with label SONGS OF ZION Vol 6. Show all posts
Showing posts with label SONGS OF ZION Vol 6. Show all posts

Adhigo kalvarilo yesu rakshakude అదిగో కల్వరిలో యేసు రక్షకుడే

Song no: 236
HD
    అదిగో కల్వరిలో యేసు రక్షకుడే } 1
    దీనుడై వ్రేలాడుచున్నాడే } 2

  1. మహిమ ఘనతను మరచి వదిలెనే
    కఠిన సిలువనే కోరుకొన్నాడే } 2
    మాయ జగత్తులో నాశన మొందక } 2
    కౌగలించెను కల్వరిలో ప్రేమన్ } 2 || అదిగో ||

  2. సురూపమైన సొగసైన లేదు
    నన్ను రక్షించ వికారుండాయెన్ } 2
    పలునిందలన్ భరించెను } 2
    పదివేలలో నతి కాంక్షణీయుడే || అదిగో ||

  3. ముండ్ల మకుటం శోభిత వస్త్రమే
    పాద హస్తములలో చీలలు కలవు } 2
    రక్త డాగులతో వ్రేలాడెను } 2
    మరణ దాసుల విమోచించెన్ || అదిగో ||

  4. యేసుని త్యాగం నా యాశ్రయమే
    గొప్పసంతోషం ప్రియుని రాజ్యం } 2
    పాద జాడలలో నడచుటయే } 2
    నా జీవితమందలి యానందం || అదిగో ||

  5. సిలువ దృశ్యమును చూచి నే
    ఉజ్జీవముతో సేవ చేయుదునే } 2
    నిరీక్షణతో జీవించెదనే } 2
    నన్ను చేర్చుకొను యేసు రాజ్యములో || అదిగో ||






Song no: 80
    అదిగో! కల్వరిలో యేసు రక్షకుడు
    దీనుడై వేలాడు చున్నాడు } 2

  1. మహిమపరుడు - మహిమ లేనట్లు
    ఘోర సిలువ - నెన్నుకొనెను } 2
    మాయ లోకములో - నుండి నన్ను
    శద్ధకల్వారి ప్రేమతో - దరిచేర్చను } 2 || అదిగో ||

  2. అందము లేదు - సౌందర్యము లేదు
    వికారమైతిరి - నన్ను రక్షించను } 2
    పలు నిందలు - భరించినను
    పదివేలలో - అతి ప్రియుడవు } 2 || అదిగో ||

  3. ముండ్ల కిరీటమున్ - అంగీని తొడిగి
    కాలు చేతులకు - మేకులు కొట్టిరి } 2
    రక్తధారల్ తో - వేలాడుచుండె
    నిత్యమహిమను - మనకిచ్చుటకు } 2 || అదిగో ||

  4. ఆశ్చర్యమే - యేసుని త్యాగం
    అద్భుతమే - ప్రభుని ప్రేమ } 2
    ఆ ధ్యానముతో - దినం జీవించి
    ఆయన మార్గమే - వెంబడించెదను } 2 || అదిగో ||

  5. సిలువ దర్శనమొంది సాగెదను
    సేవచేసెద - జీవము పెట్టి } 2
    నన్ను - చేర్చెదనని చెప్పెను
    నే న్నిరీక్షణతో - కనిపెట్టెదను } 2 || అదిగో ||