Song no:
సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు
నరులకై విలపించు నజరేయుడు
ఆ దేవుడు చిందించిన రుధిర దారలే
ఈ జగతిని విమోచించు జీవధారలు
- నిరపరాధి మౌనభుని దీనుడాయెను
మాతృమూర్తి వేదననే ఓదార్చెను
అపవాది అహంకార మణచి వేసెను
పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను || సిలువపై ||
- కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను
పాప జగతి పునాదులే కదలిపోయెను
లోక మంత చీకటి ఆవరించెను
శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను || సిలువపై ||
Siluvapai vreladu sree yesudu
narulaki vilapinche najareyudu
aa devudu chindhinchina rudhira dharale
ee jagathiki vimochinchu jeevadharalu
- niraparadhi mounabhuni dheenudayenu
mathrumurthi vedhanane oohdharchenu
apavadhi ahamka manichi vesenu
pagavari korakai prabhu prardhinchenu || Siluvapai ||
- kaluvari giri kannillatho karigipoyenu
papajagathi punadhule kadhilipoyenu
lokamantha chikati aavarinchenu
sreyesudu thalavalchi kannumoosenu || Siluvapai ||
Song no:
ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా
పరమ పావనాత్మ నీదు వరములీయుమా
ఆత్మ నింపుమా..
- కలుష దోష భారములే బ్రతుకు క్రుంగ దీసినవి
వ్యాధి బాధలేకములై కేదమాయెను – ఘన దైవమా… ఆఆ…..
నీ దాపు చేర్చి ప్రాపు చూపుమా
అనుదినము నీదు ఆశ్రయాన సేద తీర్చుమా || ఆత్మ నింపుమా ||
- అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి
ఒడలు పాప పొడల చేత యేహ్యమాయెను – కరుణాత్మ శ్రీ… ఆఆ…..
ఈ కరుణ మెంచి శరణమీయుమా
తృణమైన బ్రతుకు తూలిపోక జాలిచూపుమా || ఆత్మ నింపుమా ||