50
Showing posts with label
M.J Ramamjulu ✍
.
Show all posts
Showing posts with label
M.J Ramamjulu ✍
.
Show all posts
Chuda goredha deva mandhiravaranamulanu చూడ గోరెద దేవ మందిరావరణములను
19
రాగం -
(చాయ: )
తాళం -
చూడ గోరెద దేవ మందిరావరణములను చూడ గోరెద చూడ నాకు నాశ గలదు సుందరావరణములవి చూడ నాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదహా
||చూడ||
నీదు నివాసములు జూడ నెంతో రమ్యమై తనర నాదు హృదయమునకు నానంద మిచ్చు నిపుడు నెపుడు
||చూడ||
జీవము గల ప్రభుని జూడ జీవి నాలో కేక వేసె కోవెలలకు దొఱికె గూటి తావు నీ మందిరమున
||చూడ||
పిచ్చుకలకు దొఱికె స్థలము ముచ్చట బలిపీఠ మెదుట పెట్టు కుతూహలముతోను పిల్లల నవి మందిరమున
||చూడ||
నీదు మందిరంబులోన నిత్యవాసులైనవారు నిక్కముగను ధన్యులగుచు నిన్ను నన్నుతింతు రహా
||చూడ||
ప్రభుని వలన బలము నొందు ప్రజలు ధన్యులగుదు రిల ప్రాణ ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను
||చూడ||
నీదు యావరణములలో నేను నొక్క దినము గడుప నెంతో విలువ గల నాకు వేయినాళ్ల బ్రతుకు కన్న
||చూడ||
కానరండు మనము నిపుడె మనము లలర ప్రభుని జూడ మందిరమున కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక
||చూడ||
update
|| Update ||
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)