Andhamaina kreesthu katha mee ralimparayya అందమైన క్రీస్తు కథ విూ రాలింపరయ్య
|
రా – నవరోజు |
పుట్టుగ్రుడ్డికిఁ జూపునిచ్చుట |
తా – త్రిపుట |
అందమైన క్రీస్తు కథ విూ – రాలింపరయ్య ||అందమైన||
- పొందుగ శిష్యులతో యేసు – పోవుచుండు మార్గమందు – ముందుగ వీక్షించి రొక్క పుట్టంధకుని = అందుఁ గొందఱు శిష్యు – లాత్మలో భావించి – రెందు కీతఁడు చీక – య్యెను దీని విధమేమో – డెందములనుఁ గల్గు – సందియములు వీడ – విందమనుచు లోక – వంద్యుని సంతతా = నందుని మనుజ – నందనుని నడిగిరప్పు ॥డందమైన॥
- చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు – లేక వీని జననీ జనకు – లేమి చేసిరో = యిూ కారణముఁ దెల్పు – మోకర్త యిపుడీవు – మాకంచు తను వేఁడ – లోకేశ్వరుండు ని – రాకారుఁ డితనియం – దీకార్యములుఁ జూపం – బ్రాకటముగఁ జేసెఁ – గాక వేరొకవిధము = లేకున్నదని తెల్పి – చీకుఁ బ్రోవం దలంచె ॥నందమై॥
- బురద వాని కన్నులందుఁ – గరములతోఁ జమిరియొక్క – చెఱవులో బ్రక్షాళించుటకు – సెలవిచ్చెఁ బ్రభువు = బిరబిర నయ్యంధుఁ – డరిగి యేసుని పల్కుఁ – దిరముగ మదినమ్మి – సరసిలో మునిఁగి సుం – దరమైన నేత్రముల్ – ధరియించి యానంద – భరితుడై చనుదెంచు – తఱివాని పొరుగింటి = నరులబ్బురముగఁ జూ – చిరి మార్మోమగువాని ॥నందమైన॥
- చూపులేని గ్రుడ్డివానిఁ – జూడఁ గలుగఁజేయువాఁడే – పాపాంధకార మగ్నుల నా – ప్రభువే రక్షించు = పైపైని మనకన్ను – చూపు చూపది గాదు – లోపలి కనుగుడ్డి – యైపోయి యున్నది – యాప త్పరంపర – లోఁ బొరలుచున్నాము – కాపాడుమని యేసు – శ్రీ పాదములుఁ బట్టి = చూపు లోపలి చూపుఁ – జూచి యానందింత ॥మందమైన॥
Vandhaname yesunaku varasugunodharunaku వందనమే యేసునకు వరుసుగుణోదారునకు
-
వందనమే యేసునకు వరుసుగుణోదారునకు సౌందర్య ప్రభువునకు సర్వేశ్వర నీకు ||వందనమే||
- యెహోవా తనయునకు ఇమ్మానుయేలునకు బహు కరుణాభరణునకుఁ ప్రభువుల ప్రభువునకు||వందనమే||
- ఆశ్రిత జనపాలునకు నకలుష వర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు యెహోవా నీకు||వందనమే||
- మరియాతనూజునకు మహిమ గంభీరునకుఁ పరిశుద్ధాచరణునకుఁ బరమేశ్వర నీకు||వందనమే||
- రాజులపై రాజునకు రవికోటి తేజునకుఁ పూజార్హపదాబ్జునకు భువనావన నీకు||వందనమే||
- ప్రేమ దయా సింధునకు క్షేమామృత పూర్ణునకు ఆమే నని సాష్టాంగము లర్పింతుము నీకు||వందనమే||
Mangalamu badare kreesthunaku jaya మంగళము బాడరె క్రీస్తునకు జయ
-
మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారా మంగళముఁ బాడరెర్ మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభు సంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును ||మంగళము||
- రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమున సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ ||మంగళము||
- కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును దానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁదె మన పాలి వాఁడని శుభ||మంగళము||
- సంగీతము పాడుచు సువార్త ప్ర సంగములఁ గూడుచు నింగికిని భూమికిని నిత్యముగ నేలఁ దగు శృంగారపు రాజునకు క్షేమ మగు ఆమేనిని||మంగళము||
Iedhi yehova kaliginchina dhinamu ఇది యెహోవా కలిగించిన దినము
-
ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను జొప్పడు గడియలు కొదువలేని దయ గుల్కెడు వానివి ||యిది||
- మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక ||నిది||
- అతఁడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను ||ఇది||
- ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున ||నిది||
- సేవక వరులు విలసింపఁగఁ జేసి యా పావనాద్భుతములఁ బ్రచురముఁ జేయుదు ||యిది||
- దావీదుని వర తనయుఁడై యభిషేకావృతుఁడౌ రాజా గ్రణికి హోసన్నా ||యిది||
Aanandha magu mukthi ye na mandhiramu ఆనంద మగు ముక్తి యే నా మందిరము
- ఆనంద మగు ముక్తి యే నా మందిరము జ్ఞాని మానుగఁ జూచు దాని సుందరము ||ఆనందమగు||
- పరదేశివలె దేహా వరణమం దుందున్ ధరణి కాననముగా దర్శించు చుందున్ నెరి దుఃఖసుఖములు సరిగా భావింతున్ పరిశుద్ధాత్ముని వేఁ డి పరితృప్తి నుండు ||నానంద మగు||
- బహు శోధనలు నాపైఁ బడి వచ్చునపుడు నహితాంధతమము న న్నడ్డుకొన్నపుడు నిహబాధ లన్నిన న్నెదిరించినపుడు నహహ యేసునివల్ల నమృతుఁడ నెపుడు ||నానంద మగు||
- ముందు నా మనసు దేవుని కప్పగింతు నందరి నస్మత్తు ల్యముగాఁ ప్రేమింతున్ సందేహ రాహిత్య సరణిలో నిల్తుఁ పొందఁ బోయెడి ముక్తి భువి యందె గాంతు ||నానంద మగు||
Ayyo iedhi dhukkamu prabhu thirppuvela అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ
- అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ నయ్యో యిది యెంత దుఃఖము చయ్యన యెహోవా సింహా సనము చుట్టు వహ్ని మండు నయ్యెడ విశ్వాసులకు దు రాత్మల కగు నిత్య ఖేద ||మయ్యో||
- తల్లి పిల్లలు గూడుదు రచటఁ దండ్రి తాత లచటఁ గలియుదు రెల్ల కాల మటుల నుండ కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో||
- అన్నదమ్ములచటఁ గూడుదురు రక్క సెలియలందుఁ గలియుదు రెన్నఁ డు మరి చూడ రాని యెడఁగల స్థలములకుఁ బోదు ||రయ్యో||
- భార్యాభర్తలు గూడుదురు రచట బంధు మిత్రులు కలియుదురు రందుఁ కార్య భేదమువలన సర్వ కాలము మరి కూడఁజాల ||రయ్యో||
- క్రీస్తు మత ప్రబోధకులు స మస్త శిష్యులు కూడుదు రచట వాస్తవ స్థితు లెరుఁగఁబడిన వలనను విడఁబడుదు రంద ||రయ్యో||
- శిష్టులు దుష్టులు కూడుదు రచట స్నేహవంతు లందుఁ గలియుదు రిష్టము గాని భిన్నులగుచు నిఁక మరి యెన్నటికిఁ గూడ ||రయ్యో||
- అల పిశాచి పాపు లందరు నడుపు కర్తకు భిన్ను లగుచు పలుగొరుకుల నిత్య నరక బాధల పాల్బడక పోరు ||అయ్యో||
- సాధు సజ్జనంబు లెల్ల సకల దూతలతోడఁ గూడి మోదముతో ప్రభుని వెంట ముక్తి కేగి నిత్యులగుదు రాహా యిది యెంత విజయము ప్రభు తీర్పు వేళ నాహా యిది యెంత విజయము ||అయ్యో||
Sudhathulara mi ricchata nevvari vedhakuchunnaru సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు
సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు మృదువుగాను జీ వించు వాని పెద్ద నిదుర బోయినటు లెదలందు భావించి ||సుదతులార||
ఇచట లేఁడు లేచి యున్నాఁడు ప్రభు క్రీస్తు యేసు స్వతంత్రుఁడై ప్రచురంబుగఁ దన పాట్లు లేచుటయును వచియించె గలిలయ్య వర దేశమున మీతో ||సుదతులార||
మనుజ కుమారుఁ డె క్కుడు పాపిష్ఠులచేత మరణ మొందుట సిల్వ పైఁ దనకుఁ దానె మూఁడవ దినమందు లేచుట యును దెల్పెఁ గద మీరు వినుచుండఁగఁ దొల్లి ||సుదతులార||
ఎదలలోన జ్ఞాప కము చేసికొనుఁడింక యేసు తెల్పిన మాటలు ముదముతో జీవముఁ గని లేచె నను వార్త సుదతు లాలకించి రది నిక్కముగఁ దోఁచఁ ||సుదతులార||
Chudare kreesthuni judare na sukhulara chudare చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే
చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే క్రీస్తుని జూడరే చూడరే నాముక్తి పదవికి ఱేఁడు యేదశఁ గూడినాఁడో ||చూడరే||
మించి పొంతి పిలాతు సత్య మొ కించుకైనఁ దలంప కక్కట వంచనను గొట్టించి యూదుల మంచితనమే కోరి యప్ప గించెనా మేలు గ ణించెనా ఇతనిఁ గాంచి కాంచి భక్తులెట్లు స హించిరో పరికించి మీరిది ||చూడరే||
మంటికిని నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండఁగ నంటఁ గొట్టఁగ సిలువ మ్రాని కప్పగించుటకొరకు నిన్నుఁ గాంచెనా యిది మది నెంచెనా హా నా కంట నే నిటువంటి యాపదఁ గంటిఁ బ్రాణము లుండునే యిఁకఁ ||జూడరే||
ఊటగా రక్తంబు కారుచు నుండ బల్లెపుఁ బ్రక్కపోటు మాటిమాటికిఁ జూడ దుఃఖము మరలునే తలమీఁద ముళ్లకి రీటమా యితనికి వాటమా యూదులు మోటులై బాహాటమున నీ పాటులను గాటముగఁ జేసిరి ||చూడరే||
Papulayeda kree sthuni priya mettidho parikimpare పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె
పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె క ల్వరిగిరిపై నాపదలను దన కీగతిఁ బెట్టెడు కాపురుషుల దెసఁ గనుగొను కృపతో ||బాపుల||
యెరుషలేము క న్యలు కొందరు తన యెదుట వచ్చి యేడ్చుచు సిలువన్ వరుస నప్పురికి వచ్చు నాశన గతు లెరుఁగఁ బలికి వా రల నోదార్చెను ||బాపుల||
శత్రువు లటు తనుఁ జంపుచు నుండఁగ మైత్రిఁ జూపె సమ్మతి తోడన్ స్తోత్రముఁ జేసెను దండ్రీ వీరల దురిత మెల్ల క్షమి యింపవె యనుచును ||బాపుల||
తన ప్రక్కను సిలు వను వేసిన యొక తస్కరుఁ డించుక వేఁడు కొనన్ కనికరము మన మునఁ బెనగొన ని చ్చెను మోక్షము తన తో యుండుటగున్ ||బాపుల||
మితిలేని దురిత జీవుల లోపల మించి యున్న పతితుల కైనన్ హితముగ మోక్షం బిచ్చుటకై శో ణిత మిచ్చెను నా మతి కది సాక్షిగఁ ||బాపుల||
Apu darchakadhu luppongiri prabhuni viparithanuga అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని విపరీతముగఁ జంపసాగిరి
అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని విపరీతముగఁ జంపసాగిరి కృపమాలినట్టి పా పపు జిత్తమున నిష్ఠు రపు సిల్వమానిపైఁ బ్రభుని వేయుట కొప్పి ||రపు డర్చ||
యెరూషలేమను నూరి బైటను దుఃఖ కరమైన కల్వరిమెట్టను పరమ సాధుని సిల్వ పైఁ బెట్టి తత్పాద కరమధ్యముల మేకు లరుదుగ దిగఁ గొట్టి ||రపు డర్చ||
చిమ్మె నిమ్మగు మేని రక్తము దాని నమ్ము వారల కెంతో యుక్తము నెమ్మోము వాడి కెం దమ్మి పూవలె మస్త కమ్ము వేటులను ర క్తము జారి కనుపట్టె ||నపు డర్చ||
గడి దొంగ లిరువురుని బట్టిరి ప్రభుని కుడి యెడమలను సిల్వఁ గొట్టిరి చెడుగు యూదులు బెట్టు కడు బాధలను మరియ కొడు కోర్చుకొని వారి యెడ దయ విడఁడయ్యె ||నపు డర్చ||
Aa yandhakarapu reyilo kreesthu padu nayasamulu ఆ యంధకారంపు రేయిలో క్రీస్తు పడు నాయాసములు
ఆ యంధకారంపు రేయిలో క్రీస్తు పడు నాయాసములు దలఁచరే సాయంతనము శిష్య నమితితో భోజనముఁ జయఁగూర్చున్న ప్రభువు భక్తుల కనియె ||నా యంధ||
ఒకఁడు మీలో నన్ను యూద గణముల చేత లకు నప్పగింపఁ దలఁ చెన్ మొక మిచ్చకము గల్గు మూర్ఖుఁడగు యూదాను మొనసె వీడనుచుఁ దెలిపి యికఁ మిమ్ముఁగూడియుం డకయుందునని రొట్టె విరిచి స్తోత్రంబుజేసి ప్రకటంబుగా దీని భక్షించుఁడని పిదప నొక పాత్ర నాన నిచ్చెన్ ద్రాక్షారసం ||బా యంధ||
తన మేని గురుతు రొ ట్టెను జేసి పాపవిమో చనమైన రక్తమునకు నొనరంగ ద్రాక్షారస మును గురుతుగాఁ దెలిపి నెనరుగల కర్త యపుడు చనె గెత్సెమను వన స్థలిలోన శిష్యుల నునిచి తానొక్కరుండు మనసు వ్యాకులము చే తను నిండియుండఁగా ఘనుడు ప్రార్ధించెఁదండ్రిన్ గాఢముగాను ||ఆ యంధ||
శ్రమచేతఁ దన శరీ రము నుండి దిగజారెఁ జెమట రక్తపు బొట్లుగా నమితమౌ లోకపా పముఁ జూచి నిట్టూర్పులప్పటప్పటికిఁ బుచ్చి క్రమముగా దూత తన కడ కరుగుదెంచి శాం తముఁ బల్కి చనిన పిదపం తమ మనంబులఁ బోలు తమసమున యూద సై న్యము లేగుదెంచె నపుడు గెత్సెమను పనికి ||నా యంధ||
పరశాంతి శీల స ర్వజ్ఞతలు గల ప్రభుం డెరిఁగి తనకున్న పాట్లు పరిపంధి గణముతోఁ బలికె మీరిచ్చోట నరయుచున్నా రెవనిని నరులు నజరేతు యే సను వాని ననఁగఁ దా నెఱిఁగించె నేనేయని గురుదీప శిఖల సో కు పతంగముల భంగి ధరణిపైఁ బడిరి వారల్ దర్పము లణఁగి ||యా యంధ||
తన శిష్యులను విడువుఁ డని రిపులచేఁ దానె పట్టువడియెన్ కినిపి పేతురు యాజ కుని దాసు కర్ణంబు దునుమంగ క్రీస్తుఁడపుడు కనికరంబున స్వస్థ తను జేయు నావిభుని కరములను విరిచి కట్టి వెనుక ముందరఁ జుట్టు కొని యెరూషలేము పుర మునకుఁ దీనుకఁ బోయిరి రాణువవార ||లా యంధ||
Thellavarina vela deli vomdhi mana kreesthu dhivya తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె
- తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ ||దెల్లవారిన వేళ||
- నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు మోడ్చి మ్రొక్కుచును ||దెల్లవారిన వేళ||
- భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్ ||దెల్లవారిన వేళ||
- దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్ దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు శుభమడుగుకొనుచున్ ||దెల్లవారిన వేళ||
- పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ దొలఁగించు మని వేఁడుకొనుచున్ ||దెల్లవారిన వేళ||












