Song no:
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను
ఇపుడే అది మొలుచుచున్నది
నేను అరణ్యములో త్రోవను
కలుగజేయుచున్నాను
ఎడారిలో నదులను
పారచేయుచున్నాను
అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును
కస్తూరి పుష్పము పుయునట్లు
అడవి పూయును
ఉల్లసించును బహుగా పూయుచు
స్తుతి గీతములు పాడును
ఎండ మావులే మడుగులగును
ఎడారిలో నీటి బుగ్గలు పుట్టును
జీవజలపు ఊటలను
ప్రవహింప జేయును
దుఃఖము లేదిక నిట్టూర్పు లేదిక
నిత్యము ఆనందము
No comments:
Post a Comment