Showing posts with label Krupa ministries Guntur. Show all posts
Showing posts with label Krupa ministries Guntur. Show all posts

sarva srustiki karthavu neeve yesayya సర్వసృష్టికి కర్తవు నీవే యేసయ్యా

Song no:
HD
    సర్వసృష్టికి కర్తవు నీవే యేసయ్యా
    సర్వ జనులకు దేవుడవు నీవే నయా  || 2 ||
    ఆదియు అంతము నీవే దేవా
    ఆసాద్యమైనది నీకేమి లేదు              || 2 ||

    అ.పల్లవి : యెహోవా నిస్సీ నాజయము నీవే
    యెహోవా షాలోం నా శాంతి నీవే         || 2 ||

  1. నీ రెక్కల క్రింద ఆశ్రయమిచ్చి
    అపాయ మేదియు రాదని చెప్పితివే      || 2 ||
    మహోన్నతుడా నీనీడలో నాకు
    సుఖసంతోషములు పంచిన యేసయ్యా   || 2 || యెహోవా ||

  2. విడువక నాయెడ కృప చూపించి
    నా మనవులన్నియు సఫలము చేసితివే    || 2 ||
    ఆశ్చర్యకరుడా! ఆత్మ సారధివై
    విజయపదములో నడుపుచున్న యేసయ్యా  || 2 || యెహోవా ||

  3. నీ మహిమ నాపై ఉదయింప జేసి
    రాజ మకుటముగా నను మలచితివే        || 2 ||
    నా ప్రాణ నాధుడా! నా చేయి విడువక
    మహిమైశ్వర్యముతో దీవించిన యేసయ్యా   || 2 || యెహోవా ||

Ie sthithilo unnanante inka brathikunnanante ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే

Song no: 29
HD
    ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే } 2
    నీ కృప... నీ కృప... నీ కృప ... ఇదీ నీ కృపా } 2

  1. కష్టకాలమందు నా చెంత చేరి
    కన్నీళ్లు తుడచి నన్నాదరించినది } 2
    నీ కృప... నీ కృప... నీ కృప... ఇది నీ కృపా } 2 || ఈ స్థితిలో ||

  2. మూర్కులగు ఈ తరముకు నన్ను వేరుచేసి
    పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది } 2
    నీ కృపా... నీ కృపా... నీ కృపా ... ఇది నీ కృపా } 2 || ఈ స్థితిలో ||

  3. దేవ దూతలే చేయని ఈ దివ్య సేవను
    అల్పుడనైనా నాకు అప్పగించినది
    నీ కృప... నీ కృపా... నీ కృప ... ఇది నీ కృపా } 2 || ఈ స్థితిలో ||




Image result for ఈ స్థితిలో

Krupanidhi neeve yesayya dheenula yedala కృపానిధి నీవే యేసయ్య దీనుల యెడల

Song no:
HD
    కృపానిధి నీవే యేసయ్య
    దీనుల యెడల కృపచూపు వాడవు } 2
    పరిశుద్ధతలో మహనీయుడా
    స్తుతికీర్తనలతో పూజింతును } 2

    నా మనసారా నిన్నే స్తుతియింతును
    నా ఆరాధనా నీకే నా యేసయ్య } 2 || కృపానిధి నీవే ||

  1. దివిలో నీకున్న మహిమను విడిచి
    దీనులపై దయచూప దిగివచ్చినావు } 2
    దయాళుడా నా యేసయ్య
    నీ దయనొంది నేను ధన్యుడనైతిని } 2 || నా మనసారా ||

  2. సత్యస్వరూపియగు ఆత్మను పంపి
    పరలోక ఆనందం భువిపై దించితివి } 2
    ప్రశాంతుడా నా యేసయ్య
    నీ ఆత్మను పొంది పరవశమొందితిని } 2 || నా మనసారా ||

  3. మహాదేవుడా నా ప్రియా యేసు
    నీ రాకకై నేను వేచియున్నాను } 2
    పరిశుద్ధుడా నా యేసయ్య
    నీతో జీవించుట నా ధన్యత ఆయను } 2 || నా మనసారా ||

Ninu thalachi nanu nenu marachi nee sakshigaa నిన్ను తలచి నను నేను మరచి నీ సాక్షిగా ఇల

Song no:
HD
    నిన్ను తలచి నను నేను మరచి
    నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2)
    యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) || నిను తలచి ||

  1. జీవము లేని దైవారాధనలో
    నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2)
    జీవాధిపతివై నా జీవితానికి
    నిత్య జీవము నొసగిన యేసయ్యా (2) || నిను తలచి ||

  2. దారే తెలియని కారు చీకటిలో
    బ్రతుకే భారమై నలిగిపోతిని (2)
    నీతి సూర్యుడా ఎదలో ఉదయించి
    బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) || నిను తలచి ||

  3. సద్గుణ శీలుడా సుగుణాలు చూచి
    హృదిలో నేను మురిసిపోతిని (2)
    సుగుణాలు చూచుటకే నీవు
    సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2) || నిను తలచి ||



    Ninnu Thalachi Nanu Nenu Marachi
    Nee Saakshigaa Ila Ne Brathukuchuntini (2)
    Yesayyaa.. Nee Krupa Leka Ne Brathukalenu (2)    ||Ninu Thalachi||

    Jeevamu Leni Daivaaraadhanalo
    Nirjeeva Kriyalatho Mruthudanaithini (2)
    Jeevadhipathivai Naa Jeevithaaniki
    Nithya Jeevamu Nosagina Yesayyaa (2)       ||Ninu Thalachi||

    Daare Theliyani Kaaru Cheekatilo
    Brathuke Bhaaramai Naligipothini (2)
    Neethi Sooryudaa Edalo Udayinchi
    Brathuke Velugutho Nimpina Yesayyaa (2)      ||Ninu Thalachi||

    Sadguna Sheeluda Sugunaalu Choochi
    Hrudilo Nenu Murisipothini (2)
    Sugunaalu Choochutake Neevu
    Siluvalo Naakai Naligina Yesayyaa (2)       ||Ninu Thalachi||
    || నిను తలచి ||

Matlade yesayya natho matladuchunnadu మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు

Song no:

    మాట్లాడే యేసయ్యా
    నాతో మాట్లాడుచున్నాడు (2)
    (నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2)
    చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4) || మాట్లాడే ||

  1. వెన్నలాంటి కన్నులలో
    కురిసే తన ప్రేమను పంచాలని (3)
    వేకువనే తట్టుచున్నాడు
    కునుకని నిద్రపోని నా యేసయ్యా (2)
    తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు
    లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) || మాట్లాడే ||

  2. అరుణోదయమున నేను లేచి
    కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3)
    ఉత్సాహగానముతో యేసయ్యను
    సంగీత స్వరములతో ఘనపరచెదను (2)
    ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు
    ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2) || మాట్లాడే ||

  3. లోకము నుండి నన్ను ప్రత్యేకించి
    మైమరిపించాడు మహనీయుడు (3)
    ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు
    జీవముగల సంఘములో నిలిపియున్నాడు (2)
    తన మాటతో నన్ను బలపరచాడు
    కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు (2) || మాట్లాడే ||

Yedabayani nee krepa nanu viduvadhu yennatiki ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ

Song no:
HD
    ఎడబాయని నీ కృప
    నను విడువదు ఎన్నటికీ } 2
    యేసయ్య నీ ప్రేమానురాగం
    నను కాయును అనుక్షణం } 2 || ఎడబాయని ||

  1. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
    కడలేని కడలిలో నిరాశ నిసృహలో } 2
    అర్ధమేకాని ఈ జీవితం
    ఇక వ్యర్థమని నేననుకొనగ } 2
    కృపా కనికరం గల దేవా
    నా కష్టాల కడలిని దాటించితివి } 2 || ఎడబాయని ||

  2. విశ్వాస పోరాటంలో ఎదురాయె శోధనలు
    లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో } 2
    దుష్టుల క్షేమమునేచూచి
    ఇక నీతి వ్యర్థమని అనుకొనగ } 2
    దీర్ఘశాంతముగల దేవా
    నా చేయి విడువక నడిపించితివి } 2 || ఎడబాయని ||

  3. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో
    నా బలమును చూచుకొని నిరాశ చెందితిని } 2
    భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ } 2
    ప్రధాన యాజకుడా యేసు
    నీ అనుభవాలతో బలపరిచితివి } 2 || ఎడబాయని ||