50
Showing posts with label
Dinesh🎤
.
Show all posts
Showing posts with label
Dinesh🎤
.
Show all posts
Sageti e jeeva yathralo regeti సాగేటి ఈ జీవయాత్రలో రేగేటి
Song no: 111
సాగేటి ఈ జీవయాత్రలో
రేగేటి పెనుతుఫానులెన్నో
ఆదరించవా నీ జీవవాక్కుతో - సేదదీర్చవా నీ చేతి స్పర్శతో
సుడిగుండాలెన్నో లోకసాగరాన
వడిగా నను లాగి పడద్రోసే సమయాన } 2
నడిపించగలిగిన నా చుక్కాని నీవే } 2
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే } 2
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా } 2
|| సాగేటి ||
వడగాడ్పులెన్నో నా పయనంలోన
నడవనీక సొమ్మసిల్లజేసే సమయాన } 2
తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే } 2
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే } 2
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా } 2
|| సాగేటి ||
అలలా శ్రమలెన్నో బ్రతుకు నావ పైన
చెలరేగి విలవిలలాడించే సమయాన } 2
నిలబెట్టి బలపరచే బలవంతుడ నీవే } 2
కలవరమును తొలగించే కన్నతండ్రి నీవే } 2
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా } 2
|| సాగేటి ||
|| Yese Nija Devudu ||
Thallikunnadha thandrikunnadha nee prema jali yesayya తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమజాలి యేసయ్యా
తల్లికున్నదా తండ్రికున్నదా
నీ ప్రేమజాలి యేసయ్యా
అన్నదమ్ములకైనా కన్నబిడ్డలకైనా నీ ప్రేమలేదు యేసయ్యా } 2
యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా } 2
|| తల్లికున్నదా ||
ఏ యేగ్యత లేదనుచూ నా అనువారే
ఇంటినుండి వెలివేసితిరొకనాడయ్యా } 2
రోగముతో రోధిస్తూ వేధనపడుచుండగా
అవహేళన చేసితిరీ బంధువులయ్యా } 2
నేను ప్రేమించకయే నన్నుప్రేమించితివీ
నా పరమవైధ్యుడ నీవయ్యా } 2
|| యేసయ్యా ||
ఏమంచిలేని నన్ను మంచిగ ప్రేమించి
నీ ఇంటికి చేర్చితివీ ఈనాడయ్యా } 2
జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా
మనిషిగా నిలిపితివీ మనుగడనిచ్చీ } 2
నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివీ
నా మంచి కాపరినీవయ్యా
|| యేసయ్యా ||
|| Yese Nija Devudu ||
Ye patidho naa jeevitham ye lantidho aa naa gatham ఏ పాటిదో నా జీవితం ఏ లాంటిదో ఆ నా గతం
ఏ పాటిదో నా జీవితం
ఏ లాంటిదో ఆ నా గతం
ప్రభు యేసులో నాజీవితం
మారి పోయేగా ఆ నా గతం
నన్ను ప్రేమించిన నాకై మరణించిన నన్ను వినిపించినయేసుకే(2)
ప్రభు యేసు నీకే స్వాగతం మారి పోయేగా ఆ నా గతం- (2)
ఏ పాటిదో నా జీవితం
ఏ లాంటిదో ఆ నా గతం
ఎందుకో పుట్టానని
నా బ్రతుకే దండగని... (2)
పనికిరాని వాడనని
పైకి అసలే రాలేనని
పది మంది నన్ను చూచి గేళి చేయువేళా....
పనికొచ్చే పాత్రగా నన్ను చేసిన
పరిశుద్ధునిగా నన్ను మార్చిన
యేసయ్య నీకే స్తోత్రమూ
మెస్సయ్య నీకే స్తోత్రమూ(2)
ఏ పాటిదో నా జీవితం ఏ లాంటిదో ఆ నా గతం
అంద చెందాలు లేవని
చదువు సంధ్యలే అబ్బని-(2)
తెలివి తక్కువ వాడనని
లోక జ్ఞానమే లేదనీ...
పది మంది నన్ను చూచి
గేళి చేయు వేళ.. ఆ ఆ..
పరిశుద్ధాత్మతో నన్ను నింపిన
సిలువ సాక్షిగా నన్ను మార్చిన
యేసయ్య నీకే స్తోత్రమూ
మెస్సయ్య నీకే స్తోత్రమూ(2)
ఏ పాటిదో నా జీవితం
ఏ లాంటిదో ఆ నా గతం
ప్రభు యేసులో నాజీవితం మారి పోయేగా ఆ నా గతం
నన్ను ప్రేమించిన
నాకై మరణించిన
నన్ను విడిపించిన
యేసు కే... - (2)
ప్రభు యేసు నీకే స్వాగతం
మారి పోయేగా ఆ నా గతం- (4)
|| Yese Nija Devudu ||
Samipinchuma samipinchuma o priya janama సమీపించుమా సమీపించుమా ఓ ప్రియ జనమా
సమీపించుమా...సమీపించుమా..
. ఓ ప్రియ జనమా...
వెల లేని కృపను వెల కట్టక ఇచ్చిన యేసుని పాదాలకై (2)
సమీపించుమా...సమీపించుమా...నిన్నే సమర్పించుమా...
మెట్టు మెట్టు ఎదుగుతున్నావు... నా అన్నవాల్లనే తొక్కుతున్నావు.
ఎందుకు నీకీ వంచన స్వభావము… లోకాశ పాశాన చిక్కుచున్నావా? (2)
మెట్టు దిగి వచ్చిన యేసు నీకండగా…పరలోక అందలాన్నే ఎక్కించునుగా..... (2)
తెలుసుకో.....తెలుసుకో..... నీ జీవితాన్ని మలుచుకో....
ప్రేమించిన వారినీ … కంటతడి పెట్టిస్తున్నావు ...
ఎందుకు నీకీ పాషాణ హృదయము ... సాతాను వలలో నీవు పడుచున్నావా? (2)
కన్నీరు తుడువ వచ్చిన యేసు నీతో నడవగా...నీ ప్రేమనే తన ప్రేమగా మార్చునుగా... (2)
తెలుసుకో.....తెలుసుకో..... నీ జీవితాన్ని మలుచుకో....
కనులుండి అంధుడిగా …. నేత్రాశతోనే చూచుచున్నావు.
ఎందుకు నీకీ వ్యామోహ తత్వము ... దురాశ మాయలో మునుగుతున్నావా? (2)
దివి నుండి భువికొచ్చిన యేసుని చేరుకో...దేహాన్నే ఆలయముగా చేసుకో… (2)
తెలుసుకో.....తెలుసుకో..... నీ జీవితాన్ని మలుచుకో…
|| Yese Nija Devudu ||
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)