Korithini prabhu vedithini prabhu cherithini prabhu కోరితినీ ప్రభూ వేడితినీ ప్రభూ చేరితినీ ప్రభు నీ సన్నిది


Song no:

కోరితినీ ప్రభూ వేడితినీ ప్రభూ
చేరితినీ ప్రభు నీ సన్నిది
నా దాగు చోటువు నీవేనని
ఆశ్రయ పురము నీవేనని
యేసురాజా నా యేసురాజా
యేసురాజా నా ప్రాణనాధా

1. ఆపధకాలమున ఆదుకొంటివి
    అన్ని అక్కరలు తీర్చుచుంటివి
    కొదువే లేదు నీదు ఒడిలో
    కురిపించితివీ నీ కృపను

2. శ్రమ కాలమున చెంత చేరితివి
    శ్రమలో విడిపించి గొప్ప చేసితివి
    నీ రక్షణను చూపించితివి
    దీర్ఝాయువును నాకు ఇచ్చితివి

No comments:

Post a Comment