Showing posts with label Sarvonnathudu. Show all posts
Showing posts with label Sarvonnathudu. Show all posts

Thejo vasula swasthyamandhu nanu cherchute తేజోవాసుల స్వాస్థ్యమందు నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా

Song no: 25

    తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే
    నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2
    తేజోవాసుల స్వాస్థ్యమందు ......

  1. అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము -2
    శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా -2 ॥ తేజో ॥

  2. రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం -2
    కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా -2 ॥ తేజో ॥

  3. శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము -2
    శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా -2 ॥తేజో ॥

  4. నటనలు నరహత్యలు లేని - నూతన యెరూషలేం -2
    అర్హతలేని నన్నును - చెర్చుటయే నీ చిత్తమా -2 ॥తేజో॥

Yemani varnnithu neekrupanu yerulai parene ఏమని వర్ణింతు నీ కృపను ఏరులై పారెనె నా గుండెలోన

Song no: 22

    ఏమని వర్ణింతు - నీ కృపను - ఏరులై పారెనె - నా గుండెలోన -2
    ఏమని వర్ణింతు - నీ కృపను......

  1. సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన వారెవ్వరైనా – 2
    అలసిపోలేదెన్నడును.... 2 ॥ ఏమని॥

  2. పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2
    నీ కృప నాపై చూపుటకా ..... 2 ॥ ఏమని॥

  3. మరణము నశింపచేయుటకేనా - కృపాసత్య సంపూర్ణుడావై -2
    మా మధ్యన నివసించితివా ..... 2 ॥ ఏమని॥

Madhuryame na prabhutho jeevitham మాధుర్యమే నా ప్రభుతో జీవితం

Song no: 21

    మాధుర్యమే నా ప్రభుతో జీవితం
    మహిమానందమే - మహా ఆశ్చర్యమే -2
    మాధుర్యమే నా ప్రభుతో జీవితం

  1. సర్వ శరీరులు గడ్డిని పోలిన - వారై యున్నారు -2
    వారి అందమంతయు -పువ్వువలె వాడిపోవును - వాడిపోవును ॥ మాధుర్యమే ॥

  2. నెమ్మది లేకుండ విస్తారమైన - ధనముండుట కంటె -2
    దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు - ఉండుటే మేలు ॥ మాధుర్యమే ॥

  3. వాడబారని కిరీటమునకై - నన్ను పిలిచెను -2
    తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనో ॥ మాధుర్యమే

Sarvonnathuda neeve naku asraya dhurgamu సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము

Song no: 18
    సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
    ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
    ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2

  1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
    వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥

  2. నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
    సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥

  3. నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
    విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥