Showing posts with label Jashua. Show all posts
Showing posts with label Jashua. Show all posts

Ne padana nee prema geetham ne padana నే పాడనా నీ ప్రేమ గీతం నే పాడనా నీ ప్రేమ


Song no:

నే పాడనా ... నీ ప్రేమ గీతం నే పాడనా ... నీ ప్రేమ గీతం నన్నెంతగానో ప్రేమించిన నీ దివ్య చరితం నీ పాద ధూళినై .... సంకీర్తనా స్వరమునై నే పాడనా ... నీ ప్రేమ గీతం యేసయా - నా యేసయా - సర్వము నీవేనయ ఈ దాసురాలికి*

1. ఆపదల్లో ఉన్ననన్ను ఆప్తుడై ఆదుకుంటివి - నీ ప్రేమను నే రుచి చూసితినీ నశించవలసిన నన్ను వెదకి రక్షించితివీ - నీ క్రుపను నే పొందుకుంటినీ నా కన్నీటి బొట్టు నేల జారక మునుపే - చిరునవ్వై నాట్యమాడుచున్నదీ మహిమ ఘనత నీకే - నా యేసు దేవా

2. ఘోర సిలువను నాకై ధరియించితివి - నిత్య ప్రేమతో నన్ను జయించితివీ నీ అరచేతిలో నన్ను దాచుకుంటివి - నిత్య రక్షణలో నను నడిపించితివీ నేను సైతము నీ ఆత్మ జ్వాలలో - నీ సేవకై నే తపియించితినీ మహిమ నీకే ఘనత నీకే - నా యేసు దేవా