- ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైఁబడి యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాఁడను నన్ను దయఁగను ||ఉన్న||
- కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరిఁ జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా యెడ || ఉన్న||
- మసి బొగ్గువలె నా మా నస మెల్లఁ గప్పె దో ష సమూహములు మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను గసుటుఁ గడిగి పవిత్ర్ర పరపను నసువు లిడు నీ రక్తమే యని మసల కిప్పుడు సిలువ నిదె గని || ఉన్న||
- వెలపట బహు యుద్ధ ములు లోపటను భయము కలిగె నెమ్మది దొల గెను పలు విధములగు సందియంబుల వలనఁ బోరాటములచే నే నలసి యిటునటుఁ గొట్టఁబడి దు ర్భలుఁడనై గాయములతో నిదె || ఉన్న||
- కడు బీదవాఁడ నం ధుఁడను దౌర్భాగ్యుఁడను జెడిపోయి పడి యున్నాను సుడివడిన నా మదికి స్వస్థతఁ జెడిన కనులకు దృష్టి భాగ్యముఁ బడయవలసిన వన్ని నీ చేఁ బడయుటకు నా యెడ యఁడా యిదె || ఉన్న||
- నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవ మార్గముఁ గంటిని కేవలంబగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నొనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె || ఉన్న||
- దరిలేని యానంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు కడ్డం బైన యన్నిటి విఱుగఁగొట్టెను గాన నే నిపు డరుదుగా నీ వాఁడ నవుటకు మఱి నీవాఁడ నవుటకే || ఉన్న||
Showing posts with label Puroshottham Chwodari. Show all posts

Unna patuna vacchu chunnanu nee padha sannidhi ko ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో
lyOctober 23, 2018Andhra Kraisthava Keerthanalu, Hema John, Kalvari Kiranaalu - కల్వరి కిరణాలు, Nithya Santhoshini, Puroshottham Chwodari
No comments
Song no:315
Poyega poyega kalamu velli poyega పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి పోయెఁగ
Song no:303
పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి పోయెఁగ పోయెఁగ మాయ సంసార సం పదఁ గూర్ప మరిగి యాయు వంతయు వ్యర్థ మైపోయెఁ దరిగి ||పోయెఁగ||

ఇలలో నెందరు నీతో నీడైనవారు కలఁ గాంచి మేల్కొన్న గతి మడసినారు ||పోయెఁగ||
జల బుద్భుదము కంటె చులకని బ్రదుకు దలపోసి దీని యా శలు గొయ్యి వెదకు ||పోయెఁగ||
ఎన్నాళ్ళు సుఖ పెట్టె నెరవౌ నీ మేను కన్ను మూసిననాఁడె కాటి పాలౌను ||పోయెఁగ||
మద మత్సరముల వెం బడి గూడి నీవు హృదయాభిమానము వదలు కొన్నావు ||పోయెఁగ||
చెడు దుర్గుణముల పో షించుట విడువ గడబాట్లు నీ కనులు గానంగలేవ ||పోయెఁగ||
జవ్వన బలముచే క్రొవ్వుచు నీవు నవ్వులాటల ప్రొద్దు నడిపి యున్నావు ||పోయెఁగ||
Raro janulara vegamugudi రారో జనులారా వేగముఁ గూడి
Song no:301
రారో జనులారా వేగముఁ గూడి రారో ప్రియులారా శాశ్వతమైన ఘన రక్షణఁ జేర సారాసారముల్ సమ్మతిగాఁ జూచి ధీరత్వమునఁ క్రీస్తు జేరు దారిఁ గోరి ||రారో||

అనుమానము లన్ని మీరలు మాని ఆద్యంతము లేని కనికరము చేత మనల రక్షింపను దన జీవము నిచ్చు ఘనునిఁ క్రీస్తుని గొల్వ ||రారో||
మన పాపము లన్ని మోయను దే వుని చేఁ బనిఁ బూని మనుజావ తారుఁడై వినుట కద్భుతమైన పను లెన్నో చేసి సి ల్వను బడిన ఘనుఁ జేర ||రారో||
పాపాత్ము లగు వారి భారముఁ ద్రుంచు బలుడైన యుపకారి ఓపికతో ఁ దన దాపుఁ జేరిన వారి శాపము తా మోసి కాపాడు ఘనువే(డ ||రారో||
తన యాత్మకుఁ గీడు గల్గించెడు ఘనత లెల్లను పాడు తనువు నిత్యము గా దని యభిమాన మును వీడి మన క్రీ స్తుని జడ గతిఁజూడ ||రారో||
సకలాంతర్యామి నిరాకారు డొకడే యంతట సామి ప్రకట ముగా మర్త్యు లకునెల్ల మధ్యస్థు డొకడే క్రీస్తుడు సం రక్షకుడై యిలుకు వచ్చె ||రారో||
Na yanna ragadhe o yesu thandri na yanna ragadhe నా యన్న రాఁగదే ఓ యేసు తండ్రి నా యన్న రాఁగదే
lyJune 12, 2018Andhra Kraisthava Keerthanalu, Deva kumari, Good Friday, Puroshottham Chwodari
No comments
Song no: 179
నా యన్న రాఁగదే ఓ యేసు తండ్రి నా యన్న రాఁగదే నా ప్రాణ ధనమా నా పట్టుకొమ్మా నా ముద్దు మూట నా ముక్తిబాట నా యన్న రాఁగదే నా యన్న సిలువలో నీ వాయాసపడిన నాఁటి నీ యంఘ్రియుగమునిపుడు నా యాసఁదీరఁజూతు ||నా యన్న||
ఒక తోఁట లోపట నాఁడు పడిన సకల శ్రమ లిచ్చోట నికటమై యున్నట్లుగా నిట్టూర్పులతోఁ దలంతు నకట నా రాతి గుండె శకలంబై పోవునట్లుగా ||నా యన్న||
పరమాశ్చర్యము గాదా యీలాటి ప్రేమ ధరణిలో నున్నదా చురుకౌ ముల్లుల పోట్లకు నీ శిరము నా వంటి నీచపు పురుగు కొరకం దిచ్చెడు నీ కరుణన్ దర్శింతు నేఁడు ||నా యన్న||
ఇచ్చక మిది గాదు మిగులఁ దలపోయ ముచ్చట దీరదు అచ్చి వచ్చిన నా యవతారుఁడ నీ ప్రక్క గ్రుచ్చు గాయము లోపల నేఁ జొచ్చి నీ ప్రేమఁ జూతు ||నా యన్న||
తల వంచి సిగ్గున నేఁ జేయు నేర ముల నెంతు నాలోనఁ బలు మారు నీ గాయములఁ గెలికి నిన్ శ్రమపరచు నా ఖల దోషములకై యిపుడు పిలిపించి వేఁడుకొందు ||నా యన్న||

Yevaru bhagyavamthu laudhu ravani lopala ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష
Song no: 154
ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులొగ్గి వినువారికన్న ||నెవరు||
కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులు దవులఁ బోవఁ దరిమి యేసు తత్వముఁగొనువారికన్న ||నెవరు||
దీనమానసుల కట్టి యుప దేశ మిచ్చెను దివ్య మైన మోక్ష రాజ్యము వారి దౌనటంచు ప్రభువు తెల్పె ||నెవరు||
వృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారు నిజముగ నోదార్పుఁ బొంది నిత్య సంతోషింతు లని తెల్పె ||నెవరు||
శాంతి నీతికరుణల యందా సక్తిగల వారు భూస్వతంత్రులై పరి తృప్తినొంది దయఁ బడసెద రని ప్రభువు తెల్పె ||నెవరు||
పరిశుద్ధ హృదయులు పరా త్పరునఁ జూతురు సర్వ నరుల సమాధానపరచు నరులె పరమ జనకుని సుతులు ||నెవరు||
నీతికొర కాపద నొందెడి నిశ్చ లాత్ములు వారు ఖ్యాతిగఁ బర లోక రాజ్య ఘన సౌఖ్యము లెల్లను బడయుదురు ||ఎవరు||

O ho ho ma yannalara yudhyogimpamdi yipude ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే
Song no: 231
ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి యనుచుఁ క్రీస్తుని దయను గోరండి ||ఓహో||
అంత్యదినము నాటి బాధ లాలకించండి నరక ప్రాంతమునకుఁ బోకమునుపే ప్రభువును వేడండి ||ఓహో||
మింట ప్రభువు తేజోమయమౌ మేఘారూఢుండై యగ్ని మంట వీను సింహాసనము నంటి కూర్చుండు ||ఓహో||
అంధకారమగును సూర్యుఁడా దినమందు కుముద బాంధవుడు మిగుల రక్త వర్ణము నొందును ||ఓహో||
కడు భీతిగ సర్వసృష్టి కంపించుచు నుండున్ భూమి కడలి యభ్రము తాపమున కరిగి పోవుచుండున్ ||ఓహో||
నరక ప్రచండాగ్ని గుండ మరదై గన్పడును దానిఁ జొరక మరి యే తెరువు పాపా త్ములకు గలుగును ||ఓహో||
ప్రేమతో నడిగెదను నా ప్రియబంధువులార మీర లామహా దినమందున దిరమై యట నిలువంగలర ||ఓహో||
కామక్రోధ లోభమోహ గర్వగుణములను మీరు ప్రేమించి చేసితిరి గద పెక్కు విధములను ||ఓహో||
కల్లలాడుచుడి ప్రొద్దుఁ గడుపుచుంటిరే యింక చిల్లర వేల్పుల పూజ చేయుచుంటిరే ||ఓహో||
ప్రకటంబుగ నైన మరి గు ప్తస్థల మందైన చేయు సకల క్రియలు ప్రభువున కెఱుక సంపూర్ణముగాను ||ఓహో||
జాతి గోత్రమడుగఁ బోడు సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు మాత్రమె విచా రించు ప్రభువతఁడు ||ఓహో||

Yema ccshryamu priyulala kreesthu maranamu ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము
lyJune 05, 2018Andhra Kraisthava Keerthanalu, Good Friday, J. Wilson Herald, Puroshottham Chwodari
No comments
Song no: 184
ఏమాశ్చర్యము ప్రియులారా క్రీస్తు మరణము ప్రేమజూడరెమనసార ఆ మహాత్ముఁడు మరణ మగు రీతిఁ గనుకొన్న సామాన్యమగు నొక్క జనుని చందము గాదు ఈ మహిని గల పాప జీవుల పై మహాకృపఁ జూపి నిత్య క్షేమ మొసఁగెడు కొరకు బలు శ్రమ చే మృతుండైనాఁడు స్వేచ్ఛను ||ఏమాశ్చర్యము||
కొండవలె భారమై లోక పాపములు దండింపఁబడె ఘోరమై నిండు భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులునఁ దనువు నిండె రక్తపుఁ జెమట మెండుకొని దుఃఖములతో నా తండ్రి యీ పాత్రమును నా కడ నుండి తొలగించుటకు మనపై యుండినను జేయమని వేఁడెను ||ఏమాశ్చర్యము||
కడు దుర్మార్గులచేతను క్రీస్తుఁడు పట్టు వడె దానంతట తాను చెడుగు లెందరు నింద జేసి మోముపై నుమిసి వడిముళ్లతో నల్లఁ బడిన కిరీటము తడయ కౌదల బెట్టి కరముల నడుగులను సిలువ నిడి మేకులు దొడిపి ప్రక్కను రక్తజలములు దొరగ గుంతము గ్రుచ్చి రహహా ||ఏమాశ్చర్యము||
ఇరు పార్శ్యముల నిద్దరి దొంగల నునిచి మరణావస్థలఁ బెట్టిరి నిరపరాధి ప్రభువు దురితాత్ము లొనరించు తరుచు బాధల కోర్చి మరి వారిఁ గరుణించి యెరుఁగ రేమి యొనర్తురో యీ దురిత జీవులు వీరి నోహో పరమ జనక క్షమించు మని తన యరుల కొరకై వేఁడు కొనియెను ||ఏమాశ్చర్యము||

Yesu vanti priya bandhudu nakika niha paramulalo యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న
Song no: 174
యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న భాసురముగ నిజ భక్తుల కది యను భవ గోచర మెపు డగు నన్న ||యేసు||
ఊరు పేరు పరువులు మురువులు మరి యూడఁగొట్టబడినను గాని కూరిమితో క్రీస్తుడు మాకుండినఁ కొదువరాదు గొప్పయు పోదు ||యేసు||
ఆడికలు తిరస్కారంబులు మా కవమానము లున్నన్ గాని తోడు క్రీస్తుఁడు మాకుండినను త్రోవఁ దప్పము ఓడిపోము ||యేసు||
తగ్గుపాటులును సిగ్గుపాటులును దలమీఁదను వ్రాలినగాని దగ్గర మా పాలిటఁ ప్రభువుండగ సిగ్గును బొందుము తగ్గునఁ గుందము ||యేసు||
ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలఁ జుట్టిన యపుడు కన్న తండ్రివలె నోదార్చుచుఁ దన ఘన వాగ్బలమున దునుమును వానిని ||యేసు||
మనసు క్రుంగి పలు చింతలచేత మట్టఁబడిన వేళను మాకుఁ తన వాగ్దత్తములను జేతుల లే వనెత్తి యెంతో సంతస మొసఁగును ||యేసు||
తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలఁ డెప్పుడు మమ్ము ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహో యనుచు దరికి వచ్చు ||యేసు||
అతఁ డుండని పరమండలము ఇక వెదకినగాని యగపడదు క్షతినాతఁ డు మా మతిని వసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము ||యేసు||

Mangalambani padare kresthuku jaya మంగళంబని పాడరే క్రీస్తుకు జయ
Song no: #75
- మంగళంబని పాడరే క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకు జయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుఁడై కృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ ||మంగళ||
- ఘన యూద దేశంబులో బెత్లెహే మున యూదా గోత్రంబులో వినుఁ డు యేసేపునకు సతియై తనరుచుండెడి మరియ కడుపున జననమై యీ మర్త్య వరులకు సద్గతిని గల్గించు వానికి||మంగళ||
- సోదరాళి భంగిని భక్తుల నల్లఁ జూచి ప్రోచెడు వానిని యూద దేసపు వారలధిక బాధఁబెట్టుచు హింసఁజేసిన సాదరంబున త్రిదినములకు ముదముతో గనుపడిన ప్రభునకు||మంగళ||
- ధరణి న్గొల్చెడి దాసజ నములనుఁబ్రోచు దైవ తనయుఁడని నిజ మరయ నిలను స్మరించువారికి గురుతరంబగు కలుష జలనిధి దరికి( జేర్చు పరమ పదమే యిరు వొనర్చెద ననిన ప్రభునకు||మంగళ||
Lelemmu kraisthavuda neelo melkoni లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని
Song no: 365
లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని ||లేలెమ్ము||
విడువకు యుద్ధము నుడువకబద్ధము యొడయుఁడు నీకడ నుండును బాయఁడు ||లేలెమ్ము||
విడువకు ధైర్యము వదలకు కవచము సదయుఁడు క్రీస్తుఁడు సత్ఫల మిచ్చును ||లేలెమ్ము||
బెదరకు మేరికి వదలకు దారిని నది యిది కానిది యాత్మను బెట్టక ||లేలెమ్ము||
ప్రార్థన సారము వర్ధిలఁ గోరుము సార్థక కాలము వ్యర్థము చేయక ||లేలెమ్ము||
భావములోనన్ దేవుని ప్రేమన్ నీవది వేఁడుచు నెమ్మదిఁ గూడుచు ||లేలెమ్ము||
యేసుని సిలువ నెదుట బెట్టుకో మోసము నొందవు యేసుని కాపున ||లేలెమ్ము||

Yesu nama mentho madhuram yesu nama యేసు నామ మెంతో మధురం యేసు నామ
Song no: 137
యేసు నామ మెంతో మధురం యేసు నామ మెంతో మధురం దోసములు మోసములు నాధ మొనరించు ప్రభు ||యేసు||
స్వాంతమునకు శాంతి నిడును చింతలను భ్రాంతులను వింతలుగఁ ద్రుంచు ప్రభు ||యేసు||
నెమ్మి జేయు కమ్మివేయు నమ్మికలు సొమ్ములుగ ముమ్మరము జేయు ప్రభు ||యేసు||
ప్రేమ లెదుగ క్షేమ మొదపు కామ గుణ పామరతి లేమి చొరనీదు ప్రభు ||యేసు||
మోక్ష దశకు సాక్ష్య మొసఁగు నక్షయ సురక్షణకు దక్షత వహించ ప్రభు ||యేసు||
శీల మతుల పాలి వెతలఁ తూలఁ జనఁదోలి తన జాలి కనపరచు ప్రభు ||యేసు||

Sndhiyamu veedave naa manasa ya nandhamuna gudave సందియము వీడవే నా మనసా యా నందమున గూడవే
Song no: 390
సందియము వీడవే నా మనసా యా నందమున గూడవే సందియము లింకేల నిను సుఖ మొందఁ జేసెడు క్రీస్తు రక్తపు బిందువులు శుభవార్తవాక్యము లందుఁ గని తెలి వొంది బ్రతుకుచు ||సందియము||
చింత లిఁక మానుము లోకులు దెల్పు భ్రాంతుల్ బడఁ బోకుము ఎంత వింత దురంత పాపము లంతటను దన రక్తమున గో రంత లేకయె దుడుచు నని సి ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని ||సందియము||
పాపములు వీడుము నీ విఁకఁ బశ్చా త్తాపమున గూడుము ఏపు మీరిన యోర్పుతో నొక పాపి కైన లయంబుఁ గోరక పాపులందఱు దిరిగి వచ్చెడు కోపుఁ గోరెడు కర్త దరిఁ జని ||సందియము||
నేరముల నెంచుకో యేసుని కరుణా సారముఁ దలంచుకో భార ముల్ మోయుచు శ్రమన్ బడు వార లందఱు నమ్మి నా దరిఁ జేర విశ్రమ మిత్తునను ప్రభు సార వాక్కెలు చక్కఁగా విని ||సందియము||
నిమ్మళము నొందుము రక్షకుని పలుకు నమ్ముకొని యుండుము ఇమ్మహిని బాపులకు నై ప క్షమ్ము జేసి పరాత్పరుని సము ఖమ్మునందుఁ చిత్తమ్ముగాఁ కాయమ్ము బలియుడు నీప్రభునిఁ గని ||సందియము||
ప్రేమ దయా శాంతముల్ కర్తకు భూషా స్తోమము లవంతముల్ నీ మొఱ ల్విని యేసునాధ స్వామి తన రక్తమున బాపముఁ దోమి ని న్నకళంకుఁ జేయును నీ మదిన్ దగ నమ్ముకొన యిఁక ||సందియము||

Painamai yunnanaya nee padhambujamula పైనమై యున్నా నయ్యా నీ పాదాంబుజముల
Song no: 486
పైనమై యున్నా నయ్యా నీ పాదాంబుజముల సన్నిధికిఁ ప్రభు యేసు నాతో నుండవే నీవు దీనుఁడు భవ దా ధీనుఁడ ననుఁ గృప తో నడిపించు మె దుట నదె సింహ ధ్వానముతో మృతి వచ్చు చున్నది దాని భయోత్పా తము దొలఁగింపవె ||పైనమై||
సరణిలో నేఁబోవునపుడు శ్రమ లెన్నెన్నో చనుదెంచి నా పరుగు కడ్డముగా నిలిచునేమో మరణపు ముళ్లను విరుచుటకును ద ద్దురవస్థలు వెసఁ దొలఁగించుటకును గరుణానిధి నా సరస నుండుమీ శరణాగతునకు మరి దిక్కెవ్వరు ||పైనమై||
దేవా నీ దక్షిణ హస్తముతో దీనులను బట్టెద వెరవకుఁ డను నీ వాగ్దాత్తమున కిది సమయంబు ఆ వచనము నా జీవాధారము దైవము తల్లియుఁ దండ్రియు దాతవు నీవే సర్వము నిను నమ్మితి నా త్రోవ ప్రయాణము తుదముట్టించుము ||పైనమై||
పొదుగా నీ భక్తియందు డెంద మానందించు నపుడు సందియము లెన్నెన్నో చనుదెంచి తొందర నిడు నా త్రోవను తద్గా ఢాంధత మిశ్రమ లణఁగించుటలై సుందరమగు రవి చందంబున నా ముందట నడువవె ముదమునఁ బ్రభువా ||పైనమై||
కాలం బయ్యెను రారమ్మనుచు నీల మేఘాకృతితో వచ్చి కాలదండము జిరజిర ద్రిప్పుచు చాల భయానక లీలన్ మృత్యువు మ్రోల న్నిలిచిన వేళను దాలిమి దూలి చనుం గా బోలు భవత్కరు ణాలింగన సుఖ మత్తఱి నొసఁగవె ||పైనమై||
నీ దివ్య రూపధ్యానంబు నిర్మలాత్మాంతర సౌఖ్యంబు నా దేవుని ప్రేమామృత సారంబు నీ దాసుని కవి నిరత మొసంగుచు నా దారిని గల సేదలు దీర్పును నాదియు మధ్యము నంతము లేని పు నాదులుగల నీ సౌధము జేర్పవె ||పైనమై||
ఎండమావుల కీడైనట్టి యిహ సౌఖ్యములు త్వరగాఁబోవు నీ నిండు దరుగని నిత్యానందంబు దండిగ నీయం దుండిన వారి క ఖండామృత సౌ ఖ్యము లిచ్చెదవట తండ్రీ భవ దు త్తమ దాసుల నీ వుండిన చోటనె యుంచుము చాలును ||పైనమై||

Yesu namame pavanamu maku యేసు నామమే పావనము మాకు
Song no: 138
యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము దాస జన హృద్వికాసమైయెల్ల దోసములకు వి నాశకరమైన ||యేసు||
సాధు మానసోల్లాసములు యేసు నాధు గుణ చిద్విలాసములు బోధఁ గొను వారి బాధ వెడలించి మాధుర్యమగు ముక్తి సాధనములిచ్చు. ||యేసు||
భక్త జన లోక పూజ్యములు రక్త సిక్త పాదపయోజములు ముక్త రాజ్యాభి షిక్తుఁడౌ సర్వ శక్తి యుతుఁడైన సామియగు క్రీస్తు ||యేసు||
దీన జన నిత్య తోషణము సిల్వ మ్రాని ప్రభు మృత్యు ఘోషణము పానకము జుంటి తేనియల స్వాదు వీనులను గ్రోలు మానవుల కెల్ల ||యేసు||
పాపులకు మంచి పక్షములు ముక్తిఁ జూపు క్రీస్తు కటాక్షములు పాప సందోహ కూపమునఁ గూలు కాపురుషు నన్నుఁగాచుకొనిప్రోచు ||యేసు||

Popove yo lokama chalinka jalu nee pondhu పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ పొందు
Song no: 484
పోపోవే యో లోకమా చాలిఁకఁజాలు నీ పొందు మే మొల్లము పాపేచ్ఛలున్నంత సేపు నొపఁగ రాని వేపాట్లు బెట్టితి వీపట్ల నను వీడి ||పోపోవే||
సకలేంద్రియ వ్యాప్తులు నీ సేవ బా యక చేయు దివసంబులు ఇఁ క దీరి పోయె భ్రా మికము జూపకు మిపుడు ప్రకటమ్ముగఁ గ్రీస్తు పద భక్తి మా కెబ్బఁ ||బోపోవే||
నీ రాజు బహుమానము గంటిమి ఘోర నరకాంబుధి తీరము దారి దొలఁగి నిన్నుఁ జేరి దుఁఖముల వే సారి తిప్పుడు క్రీస్తు సదయుఁడై ననుఁబిల్చెఁ ||బోపోవే||
ఎఱ జూపి బలు మీనము బట్టెడు వాని కరణి వస్తుల రూపము బొరి జూపి లోభము బుట్టించి ననుఁబట్టి పరిమార్చితివి యింక మరి యేమున్నది చాలుఁ ||బోపోవే||
ఎండమావుల తేటలు నీ విచ్చెడు దండైన యిహ సుఖములు కండ గర్వముచే నీ యండఁ జేరితిఁగాని నిండు నెమ్మది దయా నిధి క్రీస్తు డిపు డిచ్చుఁ ||బోపోవే||

Dhasula prarthana dhappika yosagedu దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు
Song no: 373
దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు యేసు నాయకుఁడై మా వేల్పు దోసములు సేయు దుర్జనుఁడైనను దోసి లొగ్గఁ బర వాసి జేయునఁట ||దాసుల||
జన రహిత స్థల మున జని వేఁడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్ తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతస మిడునఁట ||దాసుల||
మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకుఁ జెవు లొగ్గున్ హృదయము కనుఁగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల కోర్కె లిచ్చునట ||దాసుల||
ముదమున నిద్దరు ముగ్గురు నొకచోఁ బదిలముగాఁ దనుఁ బ్రార్ధింపన్ వదలక దానట వచ్చి యుందు నని మృదువుగఁ బలికిన కృత రక్షణు(డట ||దాసుల||

Yehova maa thandri gada yesundu ma yanna gada యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ
Song no: 435
యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ మహిమ గల శుద్ధాత్మ యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ ||యెహోవా||
మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా||
అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా చుట్టా లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ ||యెహోవా||
పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా||
తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా||
పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా||
కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా||

Yerimgi yerigi chedi pothivi manasa ieka ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక
Song no: 319
ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక నీ దిక్కెవ్వరు చెపుమా దురితం బిది స చ్ఛరితం బిది యని యెరుక సరకు గొన కేమియు నీ ||యెఱిఁగి||
ఇది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ మిది విమలాత్ముని గుణ మనుచు ఎదలో ననుభవ మెఱింగి మరల దు ర్మదమున దుష్కృత పదమున బడితివి ||యెఱిఁగి||
సకలముఁ జూచెడు దేవుని కంటికిఁ జాటుగ జరిగెడి పని యేది ఇఁక జెవి గుసగుస లెల్లను దిక్కులఁ బ్రకటముఁ జేసెడు ప్రభు వున్నాఁడని ||యెఱిఁగి||
ఎన్నిమార్లు సిలువను వేయుచుఁ ప్రభు యేసుని వెతబడఁ జేసెదవు తిన్నని మార్గము తెలిసియుండి నీ కన్నుల గంతలు గట్టితి వయ్యో ||యెఱిఁగి||
గద్దించెడు మనస్సాక్షికి గడ లాడక పోతివి నీవు హద్దుమీరి దై వాజ్ఞలు ద్రోయుచు నెద్దు లాగు పరు గెత్తితి వయ్యో ||యెఱిఁగి||
పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడై నీ దిక్కునుకో తాళుచు బశ్చాత్తాపముపడి యిక జాలించుము కలు షపు యత్నంబు ||యెఱిఁగి||
అపరిమిత దయా శాంతులు గల ప్రభు వనిశము కోపింపఁడు నీపై కృపా వాగ్దద్తము లెపుడు దలఁచి నీ యపవిత్రతఁ గని హా యని యేడ్వుము ||యెఱిఁగి||

Devudicchina Divya vakya mi dhenu దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి దేను
Song no: 252
దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి దేను మన కో యన్నలారా భావ శుద్ధిని జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు ||దేవుఁ డిచ్చిన||
భయముతో భక్తితోఁ జదివినఁ ప్రాపు క్రీస్తుఁ డటంచుఁ దెల్పును దయా మయుఁడగు దేవుఁడే మన తండ్రి యని బోధించు నెల్లెడ ||దేవుఁ డిచ్చిన||
సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును బొడమును నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ నుండును ||దేవుఁ డిచ్చిన||
ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీ రనుసరించుఁడు దోసములు నెడబాసి మోక్షపుఁ ద్రోవఁ గోరిన వారలెల్లరు ||దేవుఁ డిచ్చిన||
పాపములలో నుండి విడుదలఁ పరమ సుఖ మని దలఁతు రేనియుఁ తాప మార్పును లేచి రండి త్వరగఁ క్రీస్తుని శరణు బొందను ||దేవుఁ డిచ్చిన||
దురిత ఋణములు దీర్చు మధ్య స్థుండు గావలె నన్న వారలు త్వరగ రండీ త్వరగ రండీ వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ||దేవుఁ డిచ్చిన||
మరణమునకై భయము నొందెడి మానసము గల వార లెల్లరు పరమ శాంతి యొసంగు క్రీస్తుని పజ్జ డాయఁగ రండి వేగము ||దేవుఁ డిచ్చిన||
నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా నిలవెదకువారు ధర్మచిత్తుండైన క్రీస్తుని దరికి రండి రండి వేగము ||దేవుఁ డిచ్చిన||
మోక్ష రాజ్యముఁ జేరఁ గోరెడు బుద్ధి గలిగిన వార లెల్లరు రక్ష కుండగు యేసు నొద్దకు రండి రండి విశ్వసించుచు ||దేవుఁ డిచ్చిన||