Showing posts with label Philip. Show all posts
Showing posts with label Philip. Show all posts

Christmas vacchindhayya nedu rakshan క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు

Song no:

HD
    క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు-రక్షణ తెచ్చిందయ్యా చూడు "2"
    ఆనందం వెల్లి విరిసె జగతిలో జ్యోతిగా నేడూ......"2"

    క్రీస్తుకు ఆరాధన-ప్రభువుకు  స్తోత్రార్పణ-యేసుకు చెల్లించెదం
    హల్లెలూయ...హల్లెలూయ....   "క్రిస్మస్"

  1. లోక పాపం తొలగింప జీవితాలను వెలిగింప "2"
    ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు-విడుదల కలిగించె మనకు... "2"
    క్రీస్తుకు ఆరాధన-ప్రభువుకు  స్తోత్రార్పణ-యేసుకు చెల్లించెదం
    హల్లెలూయ...హల్లెలూయ....   "క్రిస్మస్"

  2. యేసుకు మనలొ చోటిస్తె - మనమొక తారగ కనిపిస్తాం! "2"
    పరలోక మార్గం క్రీస్తే.... సమస్తము ఆయనకు అర్పిద్దాం... "2"
    క్రీస్తుకు ఆరాధన-ప్రభువుకు  స్తోత్రార్పణ-యేసుకు చెల్లించెదం
    హల్లెలూయ...హల్లెలూయ....   "క్రిస్మస్"

Bahuga bahu bahu bahuga nanu dhininchinu బహుగా బహు బహు బహుగా నను దీవించెను


Song no: o

బహుగా బహు బహు బహుగా
నను దీవించెను-తన కృపలోన
నన్ను దాచియుంచెను     " 2 "
తన మహిమతో  నాతో  మాట్లాడును 
అరచేతిలో నన్ను చెక్కియుంచెను 
విడువని దేవుడు నన్నెన్నడు ఎడబాయడు 
                                          " బహుగా "

నా యెడల నీ తలంపులు విస్తరములు
అవి లెక్కించిన లెక్కకు మించియున్నవి 
నా పాప బ్రతుకంతా జ్ఞాపకము చేసికొనక 
నీ సాక్షిగా నన్ను నిలువబెట్టినవయ్యా  " 2 "
అబ్రాహాము దేవుడవు-అద్వితీయుడవు నీవు 
అందరికి ప్రభువైనఆదరణ కర్తవు 
ఏమని పాడెదను నీ శాశ్వత ప్రేమకై 
ఏమని చాటెదను నీ నిత్యమైన కృపకై
                                        " బహుగా "

నాతల్లి గర్భమందే నన్ను ప్రతిష్టించితివి 
నీకొసమే నన్ను ఏర్పరుచుకుంటివి 
నా మట్టుకు బ్రతుకు క్రీస్తు చావైతే లాభమే 
నీకోసమే నేను సైనికుడనైతిని   " 2 "
నా దేవ దేవుడవు-నా ప్రాణ ప్రియుడవు 
నరులందరి ప్రభువైనన్యాయాధిపతి నీవు
ఏమని పాడెదను నీ శాశ్వత ప్రేమకై
ఏమని చాటెదను నీ నిత్యమైన కృపకై

                                      "  బహుగా "