Showing posts with label Paraakrama Shaali - Sree Manthudaa. Show all posts
Showing posts with label Paraakrama Shaali - Sree Manthudaa. Show all posts

Saswatha mainadhi neevu na yeda chupina శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప

Song no: 07

    శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప -2
    అనుక్షణం నను కనుపాప వలె -2  కాచిన కృప                      || శాశ్వత ||

  1. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి -2
    నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో  -2                    || శాశ్వత ||

  2. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే -2
    నీదు ముఖకాంతియే నన్ను ఆదరించేనులే -2                   || శాశ్వత ||

  3. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన -2
    నా కృప నిను వీడదని అభయమిచ్చితివే -2                       || శాశ్వత ||

Abrahamu devudavu essaku devudavu yakobu devudavu అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు

Song no: 69

అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు నాకు చాలినదేవుడవు
యేసయ్య నా యేసయ్య  యేసయ్య నా యేసయ్య

1. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను   
పునాదుల గల పట్టణము కై వేచి జీవించెను   
అబ్రాహాముకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య  యేసయ్య నా యేసయ్య

2. ఇస్సాకు విధేయుడై బలీయగమాయెను   
వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను   
ఇస్సాకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య  యేసయ్య నా యేసయ్య

3.  యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను   
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను   
యాకోబుకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య  యేసయ్య నా యేసయ్య