Showing posts with label KY Rathnam. Show all posts
Showing posts with label KY Rathnam. Show all posts

Premalu pondhina nee yahvanamu nannu pilichinadhi ప్రేమలు పొందిన నీ యాహ్వానము నన్ను పిలిచినది

ప్రేమలు పొందిన నీ యాహ్వానము నన్ను పిలిచినది
కరుణ నిండిన నీ కనుజోయి నన్ను చూచినది//2//
యేసయ్య...యేసయ్య...యేసయ్య...యేసయ్య...||అ. ప||

హృదయ సీమాయే గాలి సంద్రమై సుడులు తిరిగినది
ఎగసిన కేరటాలెన్నో నన్ను తాకినవి ||2||
నావ మునిగి పోవుచున్నది జీవనాడి కృంగియున్నది
మాటలోనే సద్దు మణిపి నన్ను గాచితివే ||2||
నాతీరము చేర్చితివే...తీరము చేర్చితివే ||ఆ.ప||
        ||ప్రేమలు||

నిన్ను విడిచి దూరమయితిని పారిపోతిని
పొట్టకూటికి పాటుపడితిని పొట్టునే తింటిని  ||2||
కన్నతండ్రి నన్ను విడువడు ఎన్నడైనా మరచిపోడూ
బుద్ధిమారి నిన్నుజేరితి కౌగిలించితివే||2||
నాకే విందు జేసితివే..విందు జేసితివే ||ఆ.ప||
      ||ప్రేమలు||

సిరులు నావియని తనువు నాదియని పొంగిపోయితిని
సిరులు కరిగి తనువు అలసి చూపుపోయినది ||2||
సిలువ చెంత శాంతి యున్నది క్షేమమేనా చేరువైంది
అంతిమముగా ఆశ్రయించితి ఆదరించితివే ||2||
కడదాకా నన్ను బ్రోచితివే నన్ను బ్రోచితివే
యేసయ్య...యేసయ్య...యేసయ్య..యేసయ్య..
            ||ప్రేమలు||

Adharimchu devuda aradhan pathruda ఆదరించు దేవుడా ఆరాధన పాత్రుడా

ఆదరించు దేవుడా ఆరాధన పాత్రుడా
సేదదీర్చువాడ క్షేమమిచ్చు దేవుడా ||2||
నా గానమా నా బలమా
నా దుర్గామా నా యేసయ్యా   ||2||

పాడెదను గీతములు ప్రాతఃకాలమున
చేసెదను నాట్యములు నీమందసము ఎదుట  ||2||
ఎవరెన్ని తలచిన కింపరిచిన
నిన్నే నే కీర్తింతును నీతోనే పయనింతును || ఆదరించే ||

ముగ్గురిని బంధించి అగ్నిలో వేయగా
నాలుగవ వాడవై గుండములో నడచివావయా ||2||
రక్షించు వాడవై నీవు నాకుండగా
నిన్నే కీర్తింతును నీతోనే నే నడతును ||ఆదరించు||

మృతుడైన లాజరుకై కన్నీరు రాల్చితివి
శవమైన లాజరును లేపి జలము బయలు పరచితివి  ||2||
నీ ఆత్మ శక్తి నన్ను ఆవరించగా
నిన్నే కీర్తింతును నిత్యజీవ మొందెదము  ||ఆదరించు||