చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య
పుట్టాడురో మనకోసం
పశులపాకలో పరమాత్ముడు - సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైన నెట్టివేయడు } 2
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో } 2 || చలి రాతిరి ||
చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు } 2
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలు } 2 || చలి రాతిరి ||
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము
ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా దాగుచోటు నీవే యేసయ్య
ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా
నీలో నిరీక్షణే - బలమైనదీ
ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం
నీ జీవవాక్యమే - వెలుగైనదీ
నీ సన్నిధానమే - సంతోష గానమై
నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై
భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా
గానమై - రాగమై
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును || నా యేసునాధ నీవే ||
కొనియాడి పాడనా - మనసార వేడనా
నీ ప్రేమ మాటలే - విలువైనవీ
ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా
నా యందు నీ కృప - ఘనమైనదీ
నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం
నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం
నీ పాద సేవయే - నాలోని ఆశగా
ప్రాణమా - జీవమా
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును
|| నా యేసునాధ నీవే ||
Naa yesu naadha neeve - naa praana dhatha neeve
Nee prema chalu naaku
Naa dhagu chotu neeve yesayya
Naa jeevinthaanthamu ninne sthuthinthunu
Ne bratuku dinamulu ninne smarinthunu
Ye reethi paadanu nee prema geethamu
Yenaadu veedani nee sneha bandhamu
Naa yesu naadha neeve - naa praana dhatha neeve
Nee prema chalu naaku
Naa daagu chotu neeve yesayya
Prabhu yesu daivamaa - chirakaala snehamaa
Neelo nireekshane - balamainadi
Priyamaara nee swaram - vinipinchu ee kshanam
Nee jeeva vaakyame - velugainadi
Nee sannidhaaname - santhosha gaanamai
Nee naama dhyaaname - siyonu maargamai
Bhayapadanu nenika - nee prema saakshiga
Gaanamai - raagamai
Anudinamu ninne aaraadhinthunu
Kalakaalam neelo aanandinthunu || Naa yesu naadha neeve ||
Koniyaadi paadanaa - manasaara vedanaa
Nee prema maatale - viuvainavi
Enaleni baatalo - venuventa thodugaa
Naayandhu nee krupa - ghanamainadi
Naa neethi sooryuda - nee prema sasvatham
Naa jeeva yaatralo - neevega aashrayam
Nee paada sevaye - naaloni aasaga
Praanamaa - jeevamaa
Anudinamu ninne aaraadhinthunu
Kalakaalam neelo aanandinthunu || Naa yesu naadha neeve ||
నన్నెంతగా ప్రేమించితివో... నిన్నంతగా దూషించితినో...
నన్నెంతగా నీవెరిగితివో...నిన్నంతగా నే మరచితినో...
గలనా... నే చెప్పగలనా...
దాయనా ... నే దాయగలనా... (2)
అయ్యా... నా యేసయ్యా...
నాదం... తాళం... రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... (2)
ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో...
ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో ... (2)
ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో...
ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ... (2)
|| గలనా ||
ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో...
ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో... (2)
ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో...
ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో... (2)
|| గలనా ||
సమీపించుమా...సమీపించుమా.. . ఓ ప్రియ జనమా...
వెల లేని కృపను వెల కట్టక ఇచ్చిన యేసుని పాదాలకై (2)
సమీపించుమా...సమీపించుమా...నిన్నే సమర్పించుమా...
మెట్టు మెట్టు ఎదుగుతున్నావు... నా అన్నవాల్లనే తొక్కుతున్నావు.
ఎందుకు నీకీ వంచన స్వభావము… లోకాశ పాశాన చిక్కుచున్నావా? (2)
మెట్టు దిగి వచ్చిన యేసు నీకండగా…పరలోక అందలాన్నే ఎక్కించునుగా..... (2)
తెలుసుకో.....తెలుసుకో..... నీ జీవితాన్ని మలుచుకో....
ప్రేమించిన వారినీ … కంటతడి పెట్టిస్తున్నావు ...
ఎందుకు నీకీ పాషాణ హృదయము ... సాతాను వలలో నీవు పడుచున్నావా? (2)
కన్నీరు తుడువ వచ్చిన యేసు నీతో నడవగా...నీ ప్రేమనే తన ప్రేమగా మార్చునుగా... (2)
తెలుసుకో.....తెలుసుకో..... నీ జీవితాన్ని మలుచుకో....
కనులుండి అంధుడిగా …. నేత్రాశతోనే చూచుచున్నావు.
ఎందుకు నీకీ వ్యామోహ తత్వము ... దురాశ మాయలో మునుగుతున్నావా? (2)
దివి నుండి భువికొచ్చిన యేసుని చేరుకో...దేహాన్నే ఆలయముగా చేసుకో… (2)
తెలుసుకో.....తెలుసుకో..... నీ జీవితాన్ని మలుచుకో…