Showing posts with label Aathmaanubandham - ఆత్మానుబంధం. Show all posts
Showing posts with label Aathmaanubandham - ఆత్మానుబంధం. Show all posts

Seeyonulo sthiramaina punadhi neevu nee meedhe సీయోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము

Song no: 109

    నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
    సౌందర్య సీయోనులో
    నీ మనోహరమైన ముఖము దర్శింతును
    నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే

    సీయోనులో స్థిరమైన పునాది నీవు
    నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2)

  1. సూర్యుడు లేని చంద్రుడు లేని
    చీకటి రాత్రులు లేనే లేని (2)
    ఆ దివ్య నగరిలో కాంతులను
    విరజిమ్మెదవా నా యేసయ్యా (2) || సీయోనులో ||

  2. కడలి లేని కడగండ్లు లేని
    కల్లోల స్థితి గతులు దరికే రాని (2)
    సువర్ణ వీధులలో
    నడిపించెదవా నా యేసయ్యా (2) || సీయోనులో ||

  3. సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2)
    సౌందర్య సీయోనులో
    నీ మనోహరమైన ముఖము దర్శింతును (2)
    నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3)
    ఆనందమే పరమానందమే (10)

Raja jagamerigina na yesu raja రాజ జగమెరిగిన నా యేసు రాజా

Song no: 112

    రాజ జగమెరిగిన నా యేసు రాజా
    రాగాలలో అనురాగాలు కురిపించిన
    మనబంధము అనుబంధము } 2
    విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? || రాజ || } 2

  1. దీన స్థితియందున సంపన్న స్థితియందున
    నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే } 2
    నిత్యము ఆరాధనకు నా ఆధారమా
    స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2 || రాజ ||

  2. బలహీనతలయందున అవమానములయందున
    పడినను కృంగినను నీకృప కలిగియుందునే } 2
    నిత్యము ఆరాధనకు నా ఆధారమా
    స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2 || రాజ ||

  3. సీయోను షాలేము మన నిత్య నివాసము
    చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే } 2
    నిత్యము ఆరాధనకు నా ఆధారమా
    స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2 || రాజ ||


Vardhiledhamu mana devuni mandhiramandhu వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు

Song no: 113

    వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై
    నీతిమంతులమై మొవ్వు వేయుదము
    యేసురక్తములోనే జయము మనకు జయమే
    స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే

  1. యెహోవా మందిర ఆవరణములో ఎన్నోన్నె మేళ్ళు గలవు
    ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతిమేలును || వర్ధిల్లెదము ||

  2. యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు
    ఆయన సముఖములోనే నిలిచి - పొందెదము శాశ్వత కృపను || వర్ధిల్లెదము ||

  3. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు
    ఆయన మహిమైశ్వర్యము మన - దుఃఖము సంతోషముగ మార్చును || వర్ధిల్లెదము ||

Nierantharam neethone jeevinchalane aasha నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల

Song no: 115

    నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది
    నాప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా. . .యేసయ్యా

  1. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను
    నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని (2)
    పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావునీ రాకడకై || నిరంతరం ||

  2. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి
    నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని (2)
    పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీరాకడకై || నిరంతరం ||

  3. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి
    నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని (2)
    పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ద పరచుచున్నావు నీరాకడకై || నిరంతరం ||
Niramtaram nitone jivimchalane asa nannila bratikimchuchunnadi
Napranesvara yesayya na sarvasvama. . .yesayya

1. Chikatilo nenunnappudu ni velugu napai udayimchenu
Nilone nenu velagalani ni mahima nalo nilavalani (2)
Parisuddhatma abishekamuto nannu nimpuchunnavuni rakadakai

2. Ni rupamu nenu kolpoyina ni raktamuto kadigitivi
Nitone nenu nadavalani ni valene nenu maralani (2)
Parisuddhatma varamulato alamkarimchuchunnavu nirakadakai

3. Tolakari varshapu jallulalo ni polamulone natitivi
Nilone chigurimchalani nilone pushpimchalani (2)
Parisuddhatma varshamuto sidda parachuchunnavu nirakadakai

Naa hrudhayana koluvaina yesayya నా హృదయాన కొలువైన యేసయ్యా

Song no: 116

    నా హృదయాన కొలువైన - యేసయ్యా
    నా అణువణువు  నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా
    నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే
    నీ  సన్నిధిలో పూజార్హుడా } 2
    నా హృదయాన కొలువైన - యేసయ్యా.....

  1. అగ్ని ఏడంతలై - మండుచుండినను
    అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను } 2
    అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడే నే } 2
    నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే
    నా స్తోత్రబలులన్నీ నీకేనయ్యా } 2
    నా హృదయాన కొలువైన - యేసయ్యా.....

  2. అంతా వ్యర్థమని - వ్యర్థులైరెదరో
    నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే } 2
    నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెను } 2
    నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే
    నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును } 2
    నా హృదయాన కొలువైన - యేసయ్యా.....

  3. విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు
    ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృదిచేసింది నీవే కదా } 2
    సంఘక్షేమాభివృదికే - పరిచర్య ధర్మము నియమించినావే } 2
    నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే
    నా స్వరము నీకే అర్పింతును } 2

    నా హృదయాన కొలువైన - యేసయ్యా
    నా అణువణువు  నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా
    నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే } 2
    నీ  సన్నిధిలో పూజార్హుడా
    నా హృదయాన కొలువైన - యేసయ్యా  ......

Yesayya naa hrudhaya spandhana neeve kadha యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా

Song no: 84

    యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)
    విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) || యేసయ్యా ||

  1. నీవు కనిపించని రోజున
    ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
    నీవు నడిపించిన రోజున
    యుగయుగాల తలపు మది నిండెనే (2)
    యుగయుగాల తలపు మది నిండెనే || యేసయ్యా ||

  2. నీవు మాట్లాడని రోజున
    నా కనులకు నిద్దుర కరువాయెనే (2)
    నీవు పెదవిప్పిన రోజున
    నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
    నీ సన్నిధి పచ్చిక బయలాయెనే || యేసయ్యా ||

  3. నీవు వరునిగా విచ్చేయి వేళ
    నా తలపుల పంట పండునే (2)
    వధువునై నేను నిను చేరగా
    యుగయుగాలు నన్నేలు కొందువనే (2)
    యుగయుగాలు నన్నేలు కొందువనే || యేసయ్యా ||


    Yesayyaa Naa Hrudaya Spandana Neeve Kadaa (2)
    Vishwamanthaa Nee Naamamu Ghananeeyamu (2)        ||Yesayyaa||
    Neevu Kanipinchani Rojuna
    Oka Kshanamoka Yugamugaa Maarene (2)
    Neevu Nadipinchina Rojuna
    Yugayugaala Thalapu Madi Nindene (2)
    Yugayugaala Thalapu Madi Nindene        ||Yesayyaa||

    Neevu Maatlaadani Rojuna
    Naa Kanulaku Niddura Karuvaayene (2)
    Neevu Pedavippina Rojuna
    Nee Sannidhi Pachchika Bayalaayene (2)
    Nee Sannidhi Pachchika Bayalaayene         ||Yesayyaa||

    Neevu Varunigaa Vichcheyu Vela
    Naa Thalapula Panta Pandune (2)
    Vadhuvunai Nenu Ninu Cheragaa
    Yugayugaalu Nannelu Konduvane (2)
    Yugayugaalu Nannelu Konduvane          ||Yesayyaa||