Showing posts with label Yesutho prayaanam. Show all posts
Showing posts with label Yesutho prayaanam. Show all posts

Yesayya vandhanalu neeku sathakoti stothralu యేసయ్య వందనాలు నీకు శతకోటి స్తోత్రాలు

యేసయ్య వందనాలు నీకు
శతకోటి స్తోత్రాలు      " 2 "
మంచి నాలో లేకున్నా
మాకు రక్షణ ఇచ్చావయ్య
నూతన వత్సరమిచ్చి
మమ్ము దీవించినావయ్య
ఆరాధన స్తుతి ఆరాధన
నీకేనయ్య యేసయ్య  " 2 "

నాకష్ట దినములలో నాతోడై
నిలచిన యేసయ్య నీకే స్తోత్రం
శోధన వేదనలో తోడుగా నిలిచావే " 2 "
నీవంటి దేవుడు ఇలలో లేనే లేడు
వేయి నోళ్ళతో స్తుతియించిన
తీర్చగలన నీ ఋణమును
ఆరాధన స్తుతి ఆరాధన
నీకేనయ్య యేసయ్య " 2 "

నే వెళ్లే ప్రతి మార్గమందు నీవు
నాముందుగా నిలచి నడిపించితివి
కంటికి రెప్పవలే నను కాపాడితివి " 2 "
గొప్ప భాగ్యము నాకొసగి
నీ పాత్రగ నను మలచితివే
నీదు సాక్షిగా నను నిలిపి
నీ సొత్తుగ నను చేసితివే
ఆరాధన స్తుతి ఆరాధన
నీకేనయ్య యేసయ్య" 2 " యేసయ్య