Showing posts with label Bethala John. Show all posts
Showing posts with label Bethala John. Show all posts

Anni kalambula nunna yehovani nenna dharambayo ఆన్ని కాలంబుల నున్న యోహోవాని న్నెన్నథరంబయో

1


రాగం - (చాయ: ) తాళం -
123

Anni kalambula nunna yehova అన్ని కాలంబుల నున్న యెహోవా ని

Song no: #1
    అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నఁదరంబయో కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు ||నన్ని||
  1. నిన్నుఁ బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగఁ జేసిన బలుఁడ వీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలు ప్రభుఁడ వీవె అన్ని జీవుల నెఱిఁగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం డవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు నేఁ జాలుదునా ||యన్ని||
  2. పుట్టింప నీవంచుఁ బోషింప నీవంచుఁ గిట్టింప నీవంచు గీర్తింతును నట్టి పనికి మాలి నట్టి మానవుల చే పట్టి రక్షింపం బాధ్యుండ వంచు దట్టమైన కృపను దరిఁజేర్చ నాకిచ్చి పట్టయి నిలచియుండు ప్రభుఁడ వంచుఁ గట్టడచేఁ గడ ముట్టుదనుక నా పట్టుకొలఁది నిన్నుఁ బ్రస్తు తింతు ||నన్ని||
  3. కారుణ్యనిధి వీవు కఠినాత్ముఁడను నేను భూరి శుద్ధుఁడ వీవు పాపి నేను సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న దారిద్రుఁడే లేఁడు తరచి చూడ సార సద్గుణముల సంపన్నుఁడవు నీవు ఘోర దుర్గుణ సంచారి, నేను ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు నేర మెన్నక ప్రోవ నెర నమ్మితి ||నన్ని||

Yesu nannu preminchinavu papinaina యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను

Song no: 171

    యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు||

  1. నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో ||యేసూ||

  2. తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండఁగ ||యేసూ||

  3. మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్ మించఁ బ్రేమించి నావు ఆహా యెంచ శక్యముగాని మంచి నాలోఁ బెంచ నెంచి ప్రేమించినావు ||యేసూ||

  4. నన్నుఁ బ్రేమింప నీ కున్న కష్టము లన్ని మున్నై తెలిసియుంటివి తెలిసి నన్నుఁ బ్రేమింప నీ కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము ||యేసూ||

  5. నా వంటి నరుఁ డొకఁడు నన్నుఁ ప్రేమించిన నావలన ఫలముఁ గోరు ఆహా నీవంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలంబేమి లేక ||యేసూ||

Yemi nerambuleka ya maranasthambhamu nela moya ఏమి నేరంబులేక యా మరణస్తంభము నేల మోయ

Song no: 205

ఏమి నేరంబులేక యా మరణస్తంభము నేల మోయ నాయెను నా యేసు ఎంత ఘోరము లాయెను ఈ మానవులు యెరుషలేము బైటకు దీయ నేమి నేరము దోచెను ||ఏమి||

మున్ను దీర్ఘదర్శు లెన్నిన రీతిని కన్నెకడుపున బుట్టిన నా యేసు వన్నె మీరంగ బెరిగిన చెన్నైన నీ మేను చెమట బుట్టంగ నీ కిన్ని కడగండ్లాయెను ||ఏమి||

కన్నతల్లి యిట్టి కడగండ్లు గాంచిన కడుపేరీతినోర్చును నా యేసు గాంచనేలను గూలును నిన్నెరిగి నట్టివారు నీ పాట్లు గని యేడ్చు చున్నారలీ వేళను ||ఏమి||

అయ్యయ్యో యూదు లింత నెయ్యంబు దప్పిదైన భయంబు విడిచి పూని నా యేసు మోయ శక్యంబు గాని కొయ్యమూపు నెత్తి రయ్య నీ కెంత భార మయ్య వెతజూడ జాలను ||ఏమి||

పిల్ల లాట్లాడినట్లు ముల్లులతో కిరీట మల్లి నెత్తిన గొట్టిరి నా యేసు పల్లరుపు లధికమాడిరి ఎల్లవారిలో నిన్ను ఎగతాళి గావించి మొగము మీ దెల్లనుమిసిరి ||ఏమి||

కొరడాలతో నిన్ను గొట్టి కండ్లకు గంత గట్టి చేజరిచి వేడ్కను నా యేసు అట్టి వారెవ్వరంచును విరగ భావంబునడిగి నెక్కిరించుచు నీ వెంబడి వత్తురేలను ||ఏమి||

ఏలడివారు నడువ మ్రోలవస్త్రంబులను నేల బరిచిన రీతిగా నా యేసు మ్రోలబరిచిరియట్లుగ ఏల యీ కోడిగంబు లేల నీమీద కంటు ఏమి నేరంబు లేదుగ ||ఏమి||

చాల బాధించి క పాల స్థలమునకు వచ్చి నేల బాతిరి కొయ్యను నా యేసు జాలి రవ్వంత లేకను కాలు సేతులినుప చీలలతో బిగించ జిమ్మి రక్తంబు గారెను ||ఏమి||

నాదేవ నా దేవ నన్నెందుకై విడిచి నా వంచు మొరబెడితివి నా యేసు నమ్మితివి లోబడితివి వేదనధికంబాయె నే దిక్కులేనట్టు యూదాళి కగుపడితివి ||ఏమి||

అంధకారము దేశ మంతట గలిగెను ఆవరించెను సూర్యుని నా యేసు ఆలయపు తెరచినిగెను బంధ స్తంభమునుండి బహు గొప్ప శబ్దముతో బిలిచెద వేమిట్లను ||ఏమి||

ఓ తండ్రి నీ చేతి కొప్పగించుచున్నాను ఒనరంగ నా యాత్మను నా యేసు అని ప్రాణమును వీడెను ఏ తప్పిదంబు లేక నీ పాటునొందితివి ఎంతో వింతై నిలుచును ||ఏమి||

నీ చాత్ము డొకడు నిఱ్ఱ నీల్గి బల్లెంబుతోడ నీ ప్రక్క బొడిచె చావను నా యేసు నీరు నెత్తురు గారెను ఏచియున్నట్టి కస్తి కెట్లు నీ యొడలుసైచె నెంతో చోద్యంబు చూడను ||ఏమి||

పాపాత్ములకు పూట బడిన వల్లనే యింత పరితాపమరణమాయెను నా యేసు ఎరిగే యనుభవించెను నా పాప ఫలము నిన్ను వేపాట్లు బెట్టి చంప నోపితివయ్య ప్రేమను ||ఏమి||

ఎంత యమూల్యమైన దెంతయనంతమైన దెంతయగాధమైనది నా యేసు ఎంతో యుచితమైనది ఎంతో వింతైన ప్రేమ ఏహ్యులమైన మాకు ఏల కనుపర్చబడ్డది ||ఏమి||

ప్రేమాతిశయుడనేను ఏ మాత్రుడను నెన్న నా మానసమున కందను నా యేసు ప్రేమ సారంబు తెలియను పామరాళిని బ్రోచు క్షేమాధికారి నిన్ను యేమంచు వర్ణింతును ||ఏమి||


aidhu gayamu londhinava nakora kaidhu ఐదు గాయము లొందినావా నాకొర! కైదు

Song no: 192


ఐదు గాయము లొందినావా నాకొర! కైదు గాయము లొంది నావా ఐదు గాయముల నా యాత్మఁ దలంప నా కారాట మెచ్చినదే నీ మైదీగె నావంటి మర్త్యుల పాల్జేసి మరణ మొందితివి గదే ||ఐదు||

గార మైన నీ శ రీర రక్త మిలను ధారయై కారినదా నా నేరమా యయ్యది భారమై నీ పైని ఘోరమై యొరిగినదా ||ఐదు||

అందమౌ నీ తనువు కంది రక్త స్వేద బిందువులై రాలెనే యీ చంద మూహింప నా డెందమ్ము భీతిచేఁ గొందలమై తూలెనే ||ఐదు||

ఎల్ల పాపము మోయు అల్ల దేవుని గొఱ్ఱె పిల్లవు నీవేగదా నా వల్లనా నీ కింత యల్లాట పుట్టెనే చెల్ల తాళునె నా యెద ||ఐదు||

భంగమౌనట్టి దు ష్పాపులఁ గావ నీ ప్రాణ మర్పించితివా యీ సంగతిఁ జూడ నీ సాహస మింక నే భంగి నీ జగతి మరవ ||ఐదు||

ఆయాసమైన నీ యాపదలెల్ల నే నాలోచింపఁగ నాత్మలో నెడ బాయక తద్దివ్య పాదసరోజముల్ భాసిల్లు నా యాత్మలో ||ఐదు||

తల్లికైన మరి తండ్రి కైన నన్న దమ్ముల కైన లేదే కన్న పిల్లలకైన నీ ప్రేమఁ పోల్చుద మన్నఁ బృథివిలోఁ గానరాదే ||ఐదు||

ఈ ప్రీతి నీ యోర్మి నీ మహాత్మ్యం బిల నెవ్వ రూహింతు రొగి నో హో ప్రభువా తద్ద యోత్కట గాంభీర్య మూహింప నీకే తగు ||ఐదు||

Yesu karthanu seva jeyutaku melkonu యేసు కర్తను సేవఁ జేయుటకు మేల్కొను

Song no: #43
    శ్రీ యేసు కర్తను సేవఁ జేయుటకు మేల్కొను శ్రీయేసు కర్తను శ్రేయముల నెఱింగి నీకు రేయిపవ లొసంగి యెడఁ బాయని యంతరంగి యపాయంబుఁ ద్రోయ సహాయంబుఁజేయ ||శ్రీ యేసు||

  1. నిదురయందు నేఁడు క్షేమ మొదవఁ గాచినాఁడు సూర్యుఁడుదయ మాయెఁజూడు నీ హృదయమున సదమల పదవులుదయింప ||శ్రీ యేసు||
  2. అంధకార మణఁగెన్ హృదయాంధకార మణఁగెన్ ప్రభు నందుఁ దెలివి గలుగన్ నిబంధనలు డేందమున కందముగఁ గూర్చి ||శ్రీ యేసు||
  3. కంటిపాప వలెను నిను గాయువాని దయను గనుఁ గొంటివి స్తోత్రమును జేయు మింటి కినిమంటికన్నింటికిని కర్తయని ||శ్రీ యేసు||
  4. కలకల ధ్వనిఁజేయు పక్కిగములు లయను గూయు సర్వములు ప్రభు స్తుతిఁజేయు నీ వలయక సొలయక వెలయఁగఁ బాడు ||శ్రీ యేసు||
  5. సేవయందు నీకు మంచి యీవు లిడుపరాకు గల భావముఁబడఁ బోకు నేడుఁ కానవే కావవే కావవే యంచు ||శ్రీ యేసు||
  6. పగటివార మంచు నిష్ఫ్లపు గ్రియలు ద్రుంచు యుగ యుగములు జీవించు పురికెగయ నీ దిగులు విడు తగు నమ్మకమున ||శ్రీ యేసు||
  7. మింటి నంటఁ బాడు నీ యొంటి బలిమి నేఁడు ప్రభు నంటి యుండ వాఁడు నిన్నొంటి నెన్నంటి కెన్నింటికిన్వీడఁడు ||శ్రీ యేసు||

Mahima sarvonnathamaina dhaivamunaki మహిమ సర్వోన్నతమైన దైవమునకి

Song no: #28

    మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహి సమాధానానుగ్రహము గల్గున్ర్పభో ||మహిమ||

  1. నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచు నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ||

  2. ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ||

  3. వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి వినుతింతుము సత్ర్వభో ||మహిమ||

  4. జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల జనకుని కుమారుడ ప్రభో ||మహిమ||

  5. ధర పాపములమోయు వరపుణ్య శీలుండా కరుణించి మా బీద మొరలాలించుము ప్రభో ||మహిమ||

  6. తండ్రియైన దేవుని దక్షిణ్ భాగమున గూర్చుండి యున్నావు కృపజూపుమి సత్ర్పభో ||మహిమ||

  7. పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవే దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ||మహిమ||

  8. పరమ జనకుని మహిమన్ పరిశుద్దాత్మైక్యంబై సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ||మహిమ||

Rare yesuni juthamu korika dheera రారె యేసుని జూతము కోరిక దీర

Song no: 300

రారె యేసుని జూతము కోరిక దీర రారె యేసుని జూతము రారె యేసుని జూడ రారాజై మన జీవా ధార కరుణామృత సారమై యున్నాఁ డు ||రారె||

సారహీన మగు సం సారాబ్ధిలోఁ జిక్కి భారమనుచు నీత నేరని వారికి తారకమైన దేవకు మారుఁడు యేసుఁడూ రార్చు చుండు టకు భూరిసహాయ కారియై చేయూతకుఁ గోరి యిచ్చుచు క్షేమ తీరం బునకుఁ జేర్చ దారిఁ జూపుచు మీవి చారముల్ దొలఁగించు ||రారె||

ఘోరమైన పాప భారంబు మోయుచు దారిఁ గానక తారు మారు లైన నరులఁ గూరిమితో ఁ బిల్చును నారక బాధ లూరక దొలఁ గించుచు నీరసు లంచు భారంబు తా మోయుచు నోరి మధి కముఁ జూపి నేరంబు బాపి శృం గారమైన మోక్ష ద్వారమై యున్నాఁడు ||రారె||

కారుణ్యుఁడును నిర్వి కారుఁడు దురితోప కారుండు శుద్ధాలం కారుండౌ యేసుని నే రీతిగా వింటిమో యా రీతి మో క్షారామ మున జూతుము సార వాక్య ధోరణిన్ బడి పోదము దారుణం బగు శ్రమలు బారుబారుగా నున్న పోరి దాఁటి ప్రభునిఁ జేరి సుఖింతము ||రారె||

ఆ రమ్యపురిన బ్రే మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది సారెసారెకుఁ ప్రభుని నారావముగ స్తోత్రము చారుతర దే వా రాధనముఁ జేతము నోరార నా పేరు నే పూజింతుము దూరస్థులై యున్న వారలం దన రక్త ధారోదకముచేఁ జే కూరునట్లుగఁ జేయు





Gyanu laradhinchiri yesu prabhuni జ్ఞాను లారాధించిరి యేసు ప్రభుని

Song no: 114

జ్ఞాను లారాధించిరి యేసు ప్రభునిఁ బూని పాపులఁ బ్రోవ మెనిఁ దాల్చిన తరి ||జ్ఞాను||

చాల కాలము నుండి మేలు వార్త నాసక్తి నాలకించి నక్షత్ర కాల చిహ్నముఁ గూడి మేలు మేలని మ మ్మేలు వాఁడని మంచి బోళము సాంబ్రాణి వేసి ||జ్ఞాను||

దూర మనక యాత్ర భార మనక బయలు దేరి సంతోషముతోఁ జేరి మేలిమి బం గార మిచ్చిరి మన సార మెచ్చిరి జో హారు జోహారటంచు ||జ్ఞాను||

ఈ దివసంబున బేత్లెహేమను నూర యూదుల రాజుగాఁ బాదుకొన్నయేసు నాధ స్వామిని స మ్మోద మిమ్మని య య్యూదజనుల మధ్య ||జ్ఞాను||

ఈ సమయము మన మా సమయంబుగఁ జేసి స్తుతింపను జేరితి మిచ్చోట భాసురంబగు శ్రీ యేసు నాధుని హృద యాసనంబునఁ జేర్చి ||జ్ఞాను||

Santhoshinchandi yandharu natho సంతోషించుఁడి యందరు నాతో



Song no: 113
రా – శంకరాభరణము
తా – ఆది

సంతోషించుఁడి – యందరు నాతో – సంతోషించుఁడి – యొక = వింతయగు కీర్తనఁ బాడ వచ్చితిని – సంతోషించుఁడి – నాతో ॥సంతో॥
  1. అంధకార మయమైన భూమి నా – ద్యంతము వెలిఁగింప – దాని యూ – వేశముఁ దొలఁగింప = వందితుండు క్రీస్తేసు నాధుఁడు – వచ్చెఁ బ్రకాశుండై – భూమికి – నిచ్చె ప్రకాశంబు ॥సంతో॥
  2. కాన నంధకారంబు దొలఁగఁ ప్ర – కాశించెను లెండు – విూరు ప్ర – కాశింపను రండు = మానవులను సంతోషపర్చనై – మహిని నవతరించె – భక్తుల – మనము సంతసించె ॥సంతో॥
  3. మిన్ను నుండి సంతోషోదయము – మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగులఁ ప్రకాశించె = మున్ను జేయఁబడిన వాగ్ధత్తము – తిన్నగ నెరవేరె భక్తుల – కన్ను లాస దీరె ॥సంతో॥
  4. ప్రీతియైన నీ పండుగ గూర్చి – నూతన కీర్తనను – గలసికొని – నాతోఁ పాడుచును = నీ తరి దూరస్తుల కీ వార్తను – నే తీరును నైనఁ – దెలుపఁగ – నాతురపడవలెను ॥సంతో॥
  5. పాపులపై దేవునికిఁ గలిగిన – ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను = జూపకపోయిన లోపము మనపై – మోపఁబడును నిజము – వేగము – జూపద మా పథము ॥సంతో॥