-->

Akasana sukkavelise ardharathri అకసాన సుక్కఎలిసె అర్ధరాత్రి పొద్దుపొడిసె

అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె
సీకటంత పారిపాయెరా  //2//
మా సిక్కులన్ని తీరిపాయెరా
మా దిక్కుమొక్కు యేసుడాయెరా  //2//
సంబరాలు ఈయాల సంబరాలు
క్రీస్తు జన్మ పండగంట సంబరాలు //3//
గొల్లలంతరాతిరేల కంటిమీద కునుకు లేక
మందలను కాయుచుండగా – చలి మంటలను కాయుచుండగా //2//
ఆ మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే –
ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే //2//
ఎమ౦టడేమోనని గుండె ధడ పుట్టే…..
ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర //2//అకసాన//
సల్లగాలివీసీంది సుక్కా దారి సూపింది
జ్ఞానులంతా పాక చేరిరి – రారాజు దైవ సుతుని గాంచిరి //2//
బంగారు బోల కానుకలు తెచ్చారు
వారు మోకరించి ఏసు ప్రభుని మొక్కారూ //2//
ఆ దూతలంతా గానాలు చేశారు…..
లోకమంతా ఎలుగు నిండేరా -ఈ మానవాళి బ్రతుకు పండేరా //2//అకసాన/
Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts