Showing posts with label Sadhayuda 2019. Show all posts
Showing posts with label Sadhayuda 2019. Show all posts

Parvathamulu tholagina mettalu dhaddharillina పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన

పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన
నా కృప నిన్ను విడిచిపోదంటివే
నా యేసయ్యా విడిచి పొందంటివే (2)

యేసయ్యా నా యెస్సయ్యా
నీవే నా మంచి కాపరివయ్యా " (2)

సుడిగాలి వీచినా సంద్రమే  పొంగిన
అలలే అలజడిరేపిన నను కదలనియ్యక (2)
సత్యమునందు నన్ను ప్రతిష్టించి (2)
సీయోను కొండ వలే నన్నుమార్చితివి (2)
        || యేసయ్యా ||

ధరణి దద్దరిల్లిన గగనం గతి తప్పిన
తారాలన్ని రాలిపోయినా నేను చలించనులే (2)
స్థిరమైన పునాది నీవై నిలకడగా నిలిపితివి (2)
కుడిపక్కన నీవుండగ  నేనెన్నడు కదలనులే (2) ||యేసయ్యా ||

మరణమైన జీవమైన ఉన్నవైన రాబోవునవైన
సృష్టింపబడినదేదైనను నీ ప్రేమను ఆర్పలేవు (2)
నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను బలపరచితివి (2)
నిరంతరం నీతో కలసి సీయోనులో నిలచెదను (2)  ||యేసయ్యా ||

Na neethi suryuda bhuvinelu yesayya నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా

నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని  (2)
రాజులకే......... మహారాజవు
కృపచూపే........ దేవుడవు
నడిపించే......... నజరేయుడా
కాపాడే........... కాపరివి (2)  ||నా నీతి||

శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2)
నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను
నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే......... మహారాజవు
కృపచూపే........ దేవుడవు
నడిపించే......... నజరేయుడా
కాపాడే........... కాపరివి   ||నా నీతి||

మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు
ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా
సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా
ఘనపరుతును నిన్నే
ప్రేమించే ..................యేసయ్యా
నీవుంటే ...................చాలునయా
నడిపించే ................. నజరేయుడా
కాపాడే .....................కాపరివి ||నా నీతి||

సంఘమై - నీ స్వాస్థ్యమై -‌ నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని
తుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా
కారుణించే.........యేసయ్యా
నీ కోసమే........ నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే.......... ఆక్షణం. రావాలయ్యా       ||నా నీతి||

Chirakala sneham neeprema charitham చిరకాల స్నేహం నీప్రేమ చరితం చిగురించే నాకొసమ

చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే  (2)

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే
చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే (2)

1. కలలుకన్న ప్రేమలన్ని నిలిచిపోయే మౌనమై  (2)
    నేను నీకు భారమైన దూరమైన వేళలో
    నీవే నాకు చేరువై చేరదీసినావయా
    ఎంత ప్రేమ యేసయ్యా             ||చిరకాల||

2. గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది  (2)
    సంధ్యవేల వెలుగు మారుగై ఒంటరైన వేళలో
    దరికిచేరి దారి చూపి ధైర్యపరచినావయా
    తోడు నీవే యేసయ్యా              || చిరకాలం||

3. మధురమైన ప్రేమలోన విలువకలిగె‌ సిలువకు  (2)
    శిలగనేను నిన్ను చేర నీదురూపుకలిగెను
    శ్రేష్ఠమైన స్వాస్థ్యమoదు నన్ను నిలిపినావయా
    నిలిపినావు యేసయ్యా               ||చిరకాలం||

Mahamahimatho nindima krupa sathyasampurnuda మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా

మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా
నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా

మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి
సత్యమును బోధించి  చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి
సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు
              ||మహామహిమతో||

కరములుచాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి
క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము  కాచితివి
అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
నిర్మాలుడా భాహువు చాపి దీవించువాడవు
                  ||మహామహిమతో ||

పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు
అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు
ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను
రక్షకుడా - ప్రభాకరుడా నిను ఆరాధించెదను
                 ||మహామహిమతో ||

Sumadhura swaramula ganalatho సుమధుర స్వరముల గానాలతో

    సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
    కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
    మహదానందమే నాలో పరవశమే నిను స్తుతియించిన ప్రతీక్షణం (2)
                       || సుమధుర ||
  1. ఎడారి త్రోవలో  నేనడచిన - ఎరుగని మార్గములో నను నడిపిన
    నా ముందు నడిచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
    నీవే నీవే - నా ఆనందము
    నీవే నీవే - నా ఆధారము  (2)
                       || సుమధుర ||
  2. సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
    జరిగించుచున్నావు నను విడువక  - నా ధైర్యము నీవేగా  (2)
    నీవే నీవే - నా జయగీతము
    నీవే నీవే - నా స్తుతిగీతము  (2)
                  || సుమధుర ||
  3. వేలాది నదులన్ని నీమహిమను - తరంగపు పొంగులు  నీబలమును
    పర్వత శ్రేణులు నీకీర్తినే - ప్రకటించుచున్నావేగా  (2)
    నీవే నీవే - నా అతిశయము
    నీకే నీకే - నా ఆరాధన  (2)
                    || సుమధుర ||

Seeyonulo numdi neevu prakashinchuchunnavu napai సీయోనులో నుండి నీవుప్రకాశించూచున్నావు నాపై

సీయోనులో నుండి నీవు
ప్రకాశించూచున్నావు నాపై     " 2 "
సమాధానమై సదాకాలము
నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్య
                            "  సీయోనులో  "
నిర్దోషమైన మార్గములో నా
అంతరంగమున ధైర్యము నిచ్చి " 2 "
నీ సన్నిధిలో నను నిలిపి
ఉన్నత విజయము నిచ్చితివి   " 2 "
నీ ఆశలు నెరవేరుటకు
నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను ఎడబాయవు    " 2 "
                            "  సీయోనులో  "
నాయందు దృష్టి నిలిపి
నీ స్నేహబంధముతో ఆకర్షించి   " 2 "
కృపావరములతో నను నింపి
సత్యసాక్షిగా మర్చితివి              " 2 "
నీ మనసును పొందుకొని
నీ ప్రేమను నింపుకొని
కీర్తించెదను ప్రతి నిత్యం
నిను ఆరాదింతును అనుక్షణం
                              "  సీయోనులో  "
దేదివ్యమైన మహిమను
పరలోకమందు నే చూచెదను " 2 "
నీ కౌగిలిలో  చేర్చుకొని
ప్రతి భాష్ప బిందువును తుడిచెదవు " 2 "
నీ మాటల మకరందమును
మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను
                                "  సీయోనులో  "