Showing posts with label Hema chandra. Show all posts
Showing posts with label Hema chandra. Show all posts

Sambaralu santhoshalu yesu vunte chalu సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు

Song no:
HD
    సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2

    ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార
    తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ } 2

    సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
    యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||

  1. గొల్లలందరు పూజింప  వచ్చిన  మంచి కాపరి
    దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు } 2
    నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు
    తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు } 2
    సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
    యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||

  2. నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు
    ప్రాణమెట్ట నీకై మట్టిలో   అడుగెట్టిన మంచి మంచి దేవుడు } 2
    నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు - ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు } 2
    సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
    యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||

  3. మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు
    పేద వాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు } 2
    నేనే మార్గము, సత్యము, జీవమన్నాడు
    ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు } 2
    సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2
    యేసు ఉంటె చాలు సందడులు || ఆకాశపు అందిట్లో ||


Naa kanuchupu mera yesu nee prema నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ పొంగి పారెనే

Song no:
HD
    నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ
    పొంగి పారెనే... పొంగి పారెనే (2)
    నే ప్రేమింతును నా యేసుని మనసారా (2)
    ఆరిపోవు లోక ప్రేమల కన్నా
    ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) || నా కనుచూపు ||

  1. నా కన్నీటిని తుడిచిన ప్రేమ 
  2. నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ
    ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
    నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ || నా కనుచూపు ||

  3. నా దీన స్థితినీ చూచిన ప్రేమ 
  4. తన శాశ్వత ప్రేమతో నను పిలిచిన ప్రేమ
    ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
    నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ || నా కనుచూపు ||

  5. నా భారంబును మోసిన ప్రేమ 
  6. సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ
    ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ
    నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ || నా కనుచూపు ||


    NAA KANUCHOOPU MERA YESU NEE PREMA PONGI PAARENE .. PONGI PAARENE (2)
    NE PREMINTHUNU NAA YESUNI MANASAARA (2)
    AARIPOVU PREMALA KANNA ADARINCHU KREESTHU PREME MINNA (2)

    1. NAA KANEETINI TUDICHINA PREMA - NALIGINA NAA HRUDAYANNI KORINA PREMA (2)
    YENNADU YEDABAYANIDHI AA PREMA - NANNU PARAMUKU CHERCHA DIGI VACHHINA PREMA (2)

    2. NAA DHEENA STHITHINEE CHOOCHINA PREMA - THANA SAASWATHA PREMATHO NANNU PILICHINA PREMA (2)
    YENNADU YEDABAYANIDHI AA PREMA - NANNU PARAMUKU CHERCHA DIGI VACHHINA PREMA (2)

    3. NAA BHARAMBUNU MOSINA PREMA - SILUVALO NAAKAI CHETHULU CHAACHINA PREMA (2)
    YENNADU YEDABAYANIDHI AA PREMA - NANNU PARAMUKU CHERCHA DIGI VACHHINA PREMA (2)

    || నా కనుచూపు ||

Thurupu dhikkuna chukka butte dhutalu pataalu pada vacche తూరుపు దిక్కున చుక్క బుట్టేదూతలు పాటలు

Song no:
HD
    తూరుపు దిక్కున చుక్క బుట్టే
    దూతలు పాటలు పాడ వచ్చే } 2
    చలిమంట లేకుండా వెలుగే బుట్టే } 2
    చల్లని రాతిరి కబురే దెచ్చే } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు } 2

  1. గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
    కొలిచినారు తనకు కానుకలిచ్చి
    పశువుల పాక మనము చేరుదాము
    కాపరిని కలిసి వేడుదాము } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు/2/

  2. చిన్నా పెద్దా తనకు తేడా లేదు
    పేదా ధనికా ఎపుడు చూడబోడు
    తానొక్కడే అందరికి రక్షకుడు
    మొదలు నుండి ఎపుడు వున్నవాడు } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు } 2

  3. మంచి చెడ్డ ఎన్నడూ ఎంచబోడు-
    చెడ్డవాళ్లకు కూడా బహు మంచోడు
    నమ్మి నీవు యేసును ఆడిగిచూడు-
    తన ప్రేమను నీకు అందిస్తాడు } 2
    పుట్టినాడంట యేసు నాధుడు
    మన పాపములు దీసే పరమాత్ముడు } 2 || తూరుపు దిక్కున ||

Pardhana korakai prakshalana Lyrics

Hema chandra
Song no: 7
ప్రార్ధన కొరకై ప్రక్షాళన
ప్రార్థన అవసరాలకేనా 2
నీ విజ్ఞాపనా వినుటకై ఆయనా
చెవి యొగ్గెను ప్రతిసమయానా
దేవుని ఆ తపనా యోచించు నాయనా
మీ తండ్రి కోరినా ఎడతెగని ప్రార్థన
అవసరాలకేనా ||ప్రార్ధనా||

భూమి మీద తలిదండ్రులు
చెడ్డవారైనా కాని
తాము కన్న తమ పిల్లలకు
మంచి ఈవులియ్యాలని 2
చేపనడితే పామునివ్వరు
రొట్టెనడిగితే రాతినివ్వరు
అడగకుండానే అన్నిఇస్తారు
అవసరాలన్ని తీరుస్తారు
ఆ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా
ఈలోకపు తండ్రితో
ఆయన కూడా సమానుడేనా 2
అడగమన్నాడు కదా అని
అన్ని అడగడమేనా
ఆత్మసంబంధమైనవడగాలని
అర్ధంకదా నాయనా ||ప్రార్ధనా||

రేపేవిధంగ బ్రతకాలని లోకమనుకున్నగాని పైనున్నవాటినే వెదకాలని
క్రైస్తవుడనుకోవాలని 2
దేవుడిచ్చిన పనిని చేయాలి
పనులకోసమే ప్రార్థించాలి
పని ఫలితాన్ని సమర్పించాలి
పరలోకానికి తిరిగి చేరాలి
యేసులాగె ప్రతిరోజు పనిచేయాలీ
ఆ యేసులాగె పని చేస్తూ ప్రార్థించాలి 2
జ్ఞానము కంటే గొప్పదైనా
దేవుని సమాధాన్నానే
నీ హృదయానికి రక్షణ కోటగా

ఉంచుతుంది ఆ ప్రార్థనా ||ప్రార్ధనా||