Showing posts with label Yesu naa priya kaapari. Show all posts
Showing posts with label Yesu naa priya kaapari. Show all posts

Yesu na priyakapari rakshanaku nijamaina యేసు నా ప్రియ కాపరి రక్షణకు నిజమైన దారి

Song no: 114

    యేసు నా ప్రియ కాపరి
    రక్షణకు నిజమైన దారి } 2
    నడిచెదను ఆయన వెంటే } 2
    నిలిపి ఆయనపై నా గురి } 2

  1. తండ్రి తనయుని ఎరిగినట్లుగా
    మంచి కాపరి నన్ను ఎరుగును } 2
    పేరు పెట్టి నన్ను పిలుచును } 2
    నాకు ముందు తాను నడచును } 2 "యేసు నా ప్రియ"

  2. తండ్రి చేతిలో నేను ఉండగా
    నన్నెవరు అపహరింపలేరుగా } 2
    నిదురపోక నన్ను కాయును } 2
    దినములన్ని క్షేమమీయును } 2 "యేసు నా ప్రియ"

  3. గోర్రే నైన నాకు జీవమీయగా
    తన ప్రాణమునే బలిగా చేసెను } 2
    శాంతి జలము చెంత చేర్చును } 2
    కృపను చూపి సేద తీర్చును } 2 "యేసు నా ప్రియ"