Showing posts with label Ramya Nalluri. Show all posts
Showing posts with label Ramya Nalluri. Show all posts

Thanuvu nadhidhigo gai konumi yo prabhuva తనువు నాదిదిగో గై కొనుమీ యో ప్రభువా

Song no: 440

తనువు నాదిదిగో గై - కొనుమీ యో
దినములు క్షణములు - దీసికొనియవి
శక్తి నీయుమీ ||తనువు||
1
ఘనమైన నీ ప్రేమ - కారణంబున
నీకై - పనిచేయ జేతులివిగో
యనయంబు నీ విషయ - మై
సొగసుగా జురుకు-దనముతో బరుగెత్త్త
వినయ పాదములివిగో ||తనువు||
2
స్వరమిదిగో కొనుమీ - వరరాజ నిను
గూర్చి - నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవులివిగో
మహనీయమైన నీ-పరిశుద్ధ వార్తతో
బరిపూర్ణముగ నింపు ||తనువు||
3
వెండి పసిడియివిగో - వీసమైనను
నాకై - యుండవలెనని కోరను
నిండైన నీ యిష్ట-నియమంబు చొప్పున
మెండుగ వాడ
బరి-మితియౌజ్ఞానంబిదిగో ||తనువు||
4
నా యిష్ట మిదిగో యిది - నీ
యిష్టముగ జేయ-నా యిష్టమిక గాదది
నా యిచ్ఛ యున్నట్టి నా
హృదయ మిదిగో నీ
కే యియ్యది
రాజ-కీయ సింహాసనమౌ ||తనువు||
5
ఉన్న నా ప్రేమ నీ - సన్నిధానముననే
నెన్నడు ధారవోయన్‌ నన్ను నీ వానిగ
నాథా గైకొను మిపుడు - చెన్నుగ నీ
వశమై స్థిరముగ నుండెద ||తనువు||