Showing posts with label Easter. Show all posts
Showing posts with label Easter. Show all posts

Jayam jayam mana yesuke జయం జయం మన యేసుకే

Song no:
    జయం జయం మన యేసుకే
    మరణం గెలిచిన క్రీస్తుకే } 2
    స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము } 2
    పునరుత్ధానుడైన క్రీస్తుని
    మహిమపరచెదము } 2 || జయం జయం ||

  1. పాపములేని యేసుడు
    సిలువలో పాపికై మరణించి } 2
    మూడవదినమున – తిరిగి లేచెను } 2
    మరణపు ముల్లును విరిచెను } 2 || జయం జయం ||

  2. పాపము చేసి మానవుడు
    కోల్పోయిన అధికారమును } 2
    సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను } 2
    సాతాను బలమును గెలిచెను } 2 || జయం జయం ||

  3. పాపము విడిచి సోదరా
    ప్రభు సన్నిధికి రారమ్ము } 2
    పునరుత్ధాన శక్తితో నింపి } 2
    పరలోకమునకు చేర్చును } 2 || జయం జయం ||




Song no:
    Jayam Jayam Mana Yesuke
    Maranam Gelichina Kreesthuke } 2
    Sthuthularpinchedamu – Sthothramu Chesedamu } 2
    Punarutthaanudaina Kreesthuni Mahimaparachedamu } 2 || Jayam Jayam ||

  1. Paapamu Leni Yesudu
    Siluvalo Paapikai Maraninchi } 2
    Moodava Dinamuna – Thirigi Lechenu } 2
    Maranapu Mullunu Virichenu } 2 || Jayam Jayam ||

  2. Paapamu Chesi Maanavudu
    Kolpoyina Adhikaaramunu } 2
    Siluvanu Gelichi – Thirigi Thechchenu } 2
    Saathaanu Balamunu Gelichenu } 2 || Jayam Jayam ||

  3. Paapamu Vidichi Sodaraa
    Prabhu Sannidhiki Raraammu } 2
    Punarutthaana Shakthitho Nimpi } 2
    Paralokamunaku Cherchunu } 2 || Jayam Jayam ||




Mahima swarupuda mruthyumjayuda maranapu mullunu మహిమ స్వరూపుడా మృత్యుంజయుడామరణపుముల్లును

Song no: 34

    మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా
    మరణపుముల్లును విరిచినవాడా
    నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములునీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు

  1. నీ రక్తమును నా రక్షణకై
    బలియాగముగా అర్పించినావు
    నీ గాయములద్వారా స్వస్థతనొంది
    అనందించెద నీలో నేను!!మహిమ స్వరూపుడా!!

  2. విరిగిన మనస్సు నలిగినా హృదయం
    నీ కిష్టమైన బలియాగముగా
    నీ చేతితోనే విరిచిన రోట్టెనై
    ఆహారమౌదును అనేకులకు!!మహిమ స్వరూపుడా!!

  3. పరిశుద్ధత్మ ఫలముపొంది
    పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై
    సీయోను రాజా నీ ముఖము చూడ
    ఆశతో నేను వేచియున్నాను !!మహిమ స్వరూపుడా!!

Halleloya yani padudi samadhipai హలెలూయ యని పాడుఁడీ సమాధిపై

Song no: 217


హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెలుఁ గేమొ పరికించుఁడీ కలఁడు యేసు సజీవుఁడయి, లే ఖనముల లవి నెరవేరెను కలిమి మోదము గులగ, దివి నుతి సలువ మహిమను వచ్చును ||హలెలూయ||

హలెలూయ యని పాఁడుడీ యీ జగతికిఁ కలిగె రక్షణ చూడుఁడీ శిలఁ దొలంగెను, ముద్ర విడె, కా వలి సమాజము దేవుని బలిమి కాగక పారిపోయెను గలిబి లాయెను నరకము ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ చీఁకటిపైని వెలుఁగే జయ మొందుసుండీ యిలను మృత్యువు గూలె, బ్రతికెఁగా యల విశ్వాసము మరలను బలనిరీక్షణ మనకుఁ గలిగెను బ్రతిహృదయము బలపడెన్ ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ దుఃఖించు నో చెలియలారా వినుఁడీ సొలయకుండఁగ మీర లటునిటు చూచుచుండుట యెవరిని ఫలము లేదిఁక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ యేసు ప్రభుని వలననే గలిగెఁగనుఁడీ యిలయుఁ బరమును సఖ్యపడియెను గలిగె హర్షము చావుచే సిలువ చింతలు మాని, పొందుఁడి కలకలంబగు మోదము ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ మీ భూరి చిం తలుతీరె మది నమ్ముఁడీ బలహీనపు చిన్న మందా! ప్రభుని చెంతకు మరలుము కలుగు జీవము మిమ్ము నాయన కరుణతో నడుపును సదా ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ సంఘము సదా నిలిచి యుండును సుమండీ పలు తెరంగుల రిపుల వలనను బాధ లెన్నియుఁ గలిగినన్ దొలఁగ కేమియు నన్ని యడ్డుల గెలిచి వర్ధిల్లుచుండును ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ దేవుని బోధ కులు సర్వరాష్ట్రంబుల నెలమి మహిమకుఁ బ్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను వెలుఁ గువలెఁ బ్రసరింపఁ జేయుదు రిలను ధృతితో నేర్పుతో ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ భక్తులారా విలపింపవలదు సుండీ కలుగకుండుఁడి సందియంబులు గడుచు కాలము శీఘ్రమే కలుగు మీకు సమాధి మిమ్మును గౌఁగిలింప నెమ్మది ||హలెలూయ||

హలెలూయ యని పాడుఁడీ గోధుమ గింజ వలె బ్రతుకుదురు మీరల ఇల ప్రభువు తన పంటఁ గూర్పను నేగుదెంచును జివరను తొలఁగఁ జేయును గురుగులను గో ధుమలనుండి నిజంబుగా ||హలెలూయ||

Vijayambu vijayambu vijayambu ma yesu విజయంబు విజయంబు విజయంబు మా యేసు

Song no: 216


విజయంబు విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువు గెల్చి నేఁడు వేంచేసె యజమానుఁ డెల్ల ప్ర యాసము లెడఁబాప స్వజనుల రక్షింప సమసె సిలువమీఁద ||విజయంబు||

విజయంబు విజయంబు విజయంబు మానవుల వృజిన నివృత్తిని విభుఁ డొనరింపన్ గుజనులచే నతఁడు క్రూర మరణము నొంది విజిత మృత్యువు నుండి విజయుండై వేంచేసె ||విజయంబు||

విజయంబు విజయంబు విజయంబు మా యేసు భుజము మీఁదను మోయుఁ బరిపాలనంబు కుజము మీఁదను బ్రాణ త్యజనము జేసెను ధ్వజము మోయుచు సిల్వ పాప మోడింతము ||విజయంబు||

విజయంబు విజయంబు విజయం బిఁకను మా క పజయము కాకుండఁ బ్రభు యేసు క్రీస్తు సుజనత్వమున వైరి వ్రజము గెల్వఁగఁజేసి నిజముగఁ బరలోక నిలయంబులో నిల్పు ||విజయంబు||

విజయంబు విజయంబు విజయం బనెడి పాట నిజభక్తితో మనము నేర్చిన వాని భజియించుదము భూన భములు తాఁ బాలించు అజిత జీవ ప్రదుఁ డమరత్వ మిడు మనకు ||విజయంబు||

Sudhathulara mi ricchata nevvari vedhakuchunnaru సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు

Song no: 215


సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు మృదువుగాను జీ వించు వాని పెద్ద నిదుర బోయినటు లెదలందు భావించి ||సుదతులార||

ఇచట లేఁడు లేచి యున్నాఁడు ప్రభు క్రీస్తు యేసు స్వతంత్రుఁడై ప్రచురంబుగఁ దన పాట్లు లేచుటయును వచియించె గలిలయ్య వర దేశమున మీతో ||సుదతులార||

మనుజ కుమారుఁ డె క్కుడు పాపిష్ఠులచేత మరణ మొందుట సిల్వ పైఁ దనకుఁ దానె మూఁడవ దినమందు లేచుట యును దెల్పెఁ గద మీరు వినుచుండఁగఁ దొల్లి ||సుదతులార||

ఎదలలోన జ్ఞాప కము చేసికొనుఁడింక యేసు తెల్పిన మాటలు ముదముతో జీవముఁ గని లేచె నను వార్త సుదతు లాలకించి రది నిక్కముగఁ దోఁచఁ ||సుదతులార||

Randu viswasulara randu vijayamu suchinchu రండు విశ్వాసులారా రండు విజయము సూచించు

Song no: 214


రండు విశ్వాసులారా రండు విజయము సూచించు చుండెడు సంతోషంబును గల్గి మెండుగ నెత్తుడి రాగముల్ నిండౌ హర్షము మనకు నియమించె దేవుఁడు విజయం, విజయం, విజయం, విజయం ||విజయం||

నేటి సమయ మన్ని యాత్మలకును నీ టగు వసంత ఋతువగును వాటముగఁ జెరసాలను గెలిచె వరుసగ మూన్నాళ్ నిద్రించి సూటిగ లేచెన్ యేసు సూర్యుని వలెన్ ||విజయం||

కన్ను కన్నుకానని చీఁకటి కాలము క్రీస్తుని కాంతిచే నిన్నాళ్లకు శీఘ్రముగఁ బోవు చున్నది శ్రీ యేసుని కెన్నాళ్ల కాగని మన సన్నుతుల్ భువిన్ ||విజయం||

బలమగు మరణ ద్వారబంధ ములు నిన్ బట్టకపోయెను వెలుతురు లేని సమాధి గుమ్మ ములు నిన్నాపక పోయెను గెలువ వాయెను కా వలియు ముద్రయు ||విజయం||

పన్నిద్దరిలోపల నీ వేళ సన్నుతముగ నీవు నిలిచి యున్నావు మానవుల తెలివి కెన్నఁడైన నందని యౌన్నత్య శాంతిని న నుగ్రహింతువు ||విజయం||

Jaya jaya yesu jaya yesu jaya jaya kreesthu jaya kreesthu జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు

Song no: 651
    జయ జయ యేసు – జయ యేసు
    జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు } 2
    జయ జయ రాజా – జయ రాజా } 2
    జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ ||

  1. మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు } 2
    పరమ బలమొసగు జయ యేసు } 2
    శరణము నీవే జయ యేసు || జయ జయ ||

  2. సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు } 2
    సమరము గెల్చిన జయ యేసు } 2
    అమరముర్తివి జయ యేసు || జయ జయ ||

  3. సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు } 2
    పాతవి గతియించె జయ యేసు } 2
    దాతవు నీవే జయ యేసు || జయ జయ ||

  4. బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు } 2
    బండలు తీయుము జయ యేసు } 2
    అండకు చేర్చుము జయ యేసు || జయ జయ ||

  5. ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు } 2
    ముద్రలు తీయుము జయ యేసు } 2
    ముద్రించుము నను జయ యేసు || జయ జయ ||

  6. కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు } 2
    సేవలో బలము జయ యేసు } 2
    జీవము నీవే జయ యేసు || జయ జయ ||

  7. దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు } 2
    కయ్యము గెల్చిన జయ యేసు } 2
    అయ్యా నీవే జయ యేసు || జయ జయ ||




Song no: 651
    Jaya Jaya Yesu – Jaya Yesu
    Jaya Jaya Kreesthu – Jaya Kreesthu } 2
    Jaya Jaya Raajaa – Jaya Raajaa } 2
    Jaya Jaya Sthothram – Jaya Sthothram || Jaya ||

  1. Maranamu Gelchina Jaya Yesu – Maranamu Odenu Jaya Kreesthu } 2
    Parama Balamosagu Jaya Yesu } 2
    Saranamu Neeve Jaya Yesu || Jaya ||

  2. Samaadhi Gelchina Jaya Yesu – Samaadhi Odenu Jaya Kreesthu } 2
    Samaramu Gelchina Jaya Yesu } 2
    Amaramurthivi Jaya Yesu || Jaya ||

  3. Saathaannu Gelchina Jaya Yesu Saathaanu Odenu Jaya Kreesthu } 2
    Paathavi Gathiyinche Jaya Yesu } 2
    Daathavu Neeve Jaya Yesu || Jaya ||

  4. Bandanu Gelchina Jaya Yesu – Bandayu Odenu Jaya Kreesthu } 2
    Bandalu Theeyumu Jaya Yesu } 2
    Andaku Cherchumu Jaya Yesu || Jaya ||

  5. Mudranu Gelchina Jaya Yesu – Mudrayu Odenu Jaya Kreesthu } 2
    Mudralu Theeyumu Jaya Yesu } 2
    Mudrinchumu Nanu Jaya Yesu || Jaya ||

  6. Kaavali Gelchina Jaya Yesu – Kaavali Odenu jaya Kreesthu } 2
    Sevalo Balamu Jaya Yesu } 2
    Jeevamu Neeve Jaya Yesu || Jaya ||

  7. Dayyaalu Gelchina Jaya Yesu – Dayyaalu Odenu jaya Kreesthu } 2
    Kayyamu Gelchina Jaya Yesu } 2
    Ayyaa Neeve Jaya Yesu || Jaya ||




Kreesthu lechenu halleluya kreesthu nannu lepunu క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస్తు నన్ను లేపును

Song no: 219


క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస్తు నన్ను లేపును

ఇద్దియె సునాద సత్యము ఇలను చాటుడి నిత్యము


1. మృతుల పునరుత్థాన పంటకు ప్రధమ ఫలమగు క్రీస్తులో

మృతులు లేతురు నేను లేతును నాదువరుసలో నిజమిది


2. పాపమరణ నరకబలములు ప్రభుని శక్తికి ఓడెను

పాపినగు నను బ్రోవ క్రీస్తుని ప్రాణదాన ప్రభావము


3.  మరణమా నీ ముల్లు ఎక్కడ? మరణమా జయమెక్కడ?

మరణమా నీ ముల్లు విరిగెను మహిమ క్రీస్తులో నిప్పుడు


4.  శిలయు ముద్రయు బలిమికావలి గలిబిలియాను రాత్రిలో

ఇలయు పరమును కలుసుకొనియెను గెలుపునొందిన క్రీస్తులో


5. మృతులు నీదగువారలందరు బ్రతికి లేతురు సత్యము

ప్రేతలను జీవింపజేయును పృధివి క్రీస్తుని విజయము


6. స్తుతియు మహిమయు ఘనత నీకె స్తుతికి పాత్రుడ రక్షకా

స్వంత రక్తము చిందితివి నా స్వామి యిదెనా యంజలి

Yesu lechenu adhivaramuna yesu lechenu vekuvajamuna యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు

Song no: 218


యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు లేచెను||

వేకువజామున చీఁక టుండఁగానే యాకాశదూతలు వీకతో రాఁ గానే ||యేసు||

సమాధిపై రాతిన్ స్వామి దూత లిద్దరు సమముగఁ దీయను స్వామి లేచె నహహ ||యేసు||

మృతులలో సజీవున్ వెతకు టేల నని దూతలు వారితో దాత లేఁడని తెల్పి ||యేసు||

స్త్రీలు వేగ వెళ్లి శిష్యులకుఁ దెల్ప జింత మారిపోయి సందేహము తొల్గ ||యేసు||

పేతురు యోహానుల్ పరుగెత్తుకొని వచ్చి ప్రవేశించి గుహలో పరమానంద మొంద ||యేసు||

యేసు చచ్చి లేచె యేసు శిష్యులట్లే దోసంబులకుఁ జచ్చి వాసిగ లేతురండి ||యేసు||

Halleluya yani padudi samaadhipai vellugemu parikinchudi హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెలుఁ గేమొ పరికించుఁడీ


Song no: 217
రాగం- బిలహరి 
ఛాయ: గీతములు 
పాడుడి 
తాళం- త్రిపుట 







హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెలుఁ గేమొ పరికించుఁడీ కలఁడు యేసు సజీవుఁడయి, లే ఖనముల లవి నెరవేరెను కలిమి మోదము గులగ, దివి నుతి సలువ మహిమను వచ్చును ||హలెలూయ||

1. హలెలూయ యని పాఁడుడీ యీ జగతికిఁ కలిగె రక్షణ చూడుఁడీ శిలఁ దొలంగెను, ముద్ర విడె, కా వలి సమాజము దేవుని బలిమి కాగక పారిపోయెను గలిబి లాయెను నరకము ||హలెలూయ|| 

2. హలెలూయ యని పాడుఁడీ చీఁకటిపైని వెలుఁగే జయ మొందుసుండీ యిలను మృత్యువు గూలె, బ్రతికెఁగా యల విశ్వాసము మరలను బలనిరీక్షణ మనకుఁ గలిగెను బ్రతిహృదయము బలపడెన్ ||హలెలూయ|| 

3. హలెలూయ యని పాడుఁడీ దుఃఖించు నో చెలియలారా వినుఁడీ సొలయకుండఁగ మీర లటునిటు చూచుచుండుట యెవరిని ఫలము లేదిఁక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో ||హలెలూయ|| 

4. హలెలూయ యని పాడుఁడీ యేసు ప్రభుని వలననే గలిగెఁగనుఁడీ యిలయుఁ బరమును సఖ్యపడియెను గలిగె హర్షము చావుచే సిలువ చింతలు మాని, పొందుఁడి కలకలంబగు మోదము ||హలెలూయ|| 

5. హలెలూయ యని పాడుఁడీ మీ భూరి చిం తలుతీరె మది నమ్ముఁడీ బలహీనపు చిన్న మందా! ప్రభుని చెంతకు మరలుము కలుగు జీవము మిమ్ము నాయన కరుణతో నడుపును సదా ||హలెలూయ|| 

6. హలెలూయ యని పాడుఁడీ సంఘము సదా నిలిచి యుండును సుమండీ పలు తెరంగుల రిపుల వలనను బాధ లెన్నియుఁ గలిగినన్ దొలఁగ కేమియు నన్ని యడ్డుల గెలిచి వర్ధిల్లుచుండును ||హలెలూయ|| 

7. హలెలూయ యని పాడుఁడీ దేవుని బోధ కులు సర్వరాష్ట్రంబుల నెలమి మహిమకుఁ బ్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను వెలుఁ గువలెఁ బ్రసరింపఁ జేయుదు రిలను ధృతితో నేర్పుతో ||హలెలూయ|| 

8. హలెలూయ యని పాడుఁడీ భక్తులారా విలపింపవలదు సుండీ కలుగకుండుఁడి సందియంబులు గడుచు కాలము శీఘ్రమే కలుగు మీకు సమాధి మిమ్మును గౌఁగిలింప నెమ్మది ||హలెలూయ|| 

9. హలెలూయ యని పాడుఁడీ గోధుమ గింజ వలె బ్రతుకుదురు మీరల ఇల ప్రభువు తన పంటఁ గూర్పను నేగుదెంచును జివరను తొలఁగఁ జేయును గురుగులను గో ధుమలనుండి నిజంబుగా ||హలెలూయ|| 

Maranamun jayinchi lechenu mana prabhuvu nendu మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు

Song no: 213

మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు మహిమ దేహ మొనరఁ దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొఱత లన్ని తీర్చి జీవ వరము లియ్య వసుధపైని ||మరణమున్||

1. మరియయును సలోమి మొదలగు మగువలు సబాతు మరు దినోదయమునఁ బ్రియ మగు గురుని దేహమునకుఁ బూయఁ బరిమళంపుఁ దైలములను సరగఁ దీసికొని సమాధి కరుగుదెంచి కనులఁజూడ ||మరణమున్||

2. నేఁడు ప్రభుసమాధి ముఖముపై నున్న రాయి నెవఁడు దీయు కరుణను మనకై చేడియ లిట్లనుచు వేగఁ జేరి యా సమాధి మూఁత వీడి యుంటఁ జూచి మిగుల విస్మయమ్ము నంది రపుడు ||మరణమున్||

3. వారు తెల్ల నిలువుటంగిఁతో గూర్చున్న పడుచు వానిఁ జూచి మిగుల భయముతోఁ జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ లార భయపడకు డటంచు నూరడించె నుచితముగను ||మరణమున్||

4. కొరత పైని మరణ మొందిన నజరేయుఁ డేసు కొరకు మిగుల వెదకు చుండిన తరుణులార మీ ప్రభుండు తిరిగి బ్రతికె నిక్క మిద్ది సరగపేతు రాది శిష్య సమితితోడఁ జెప్పుడనియె ||మరణమున్||

5. మానితముగ మీకిట ముందు ప్రభు వనిన యట్లు కానఁబడును గలిలైయ మందుఁ గాన వెళ్లుడంచు భాసి తానరుండు పల్క వినుచు దీన జనులు జడిసి మిగుల దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్||

6. మొదట మగ్దలేనే మరియకుఁ గనఁబడె నటంచు సుదతి దెల్పె శిష్య వరులకు కొదువలేని సంతసమునఁ గోర్కె దీరఁ బ్రభునిఁ జూడఁ బదిలమైన యత్నములకుఁ బరఁగఁ జేసి చూచి రపుడు ||మరణమున్||

7. అంతఃశత్రు వైన మరణమును ప్రభువు గెల్చె సంతసించి సన్నుతింతము వంత లేల భక్తులార వాస్తవముగ మనల నిటుల నంత్య దినము నందు లేపు నమల దేహముల నొసంగు ||మరణమున్||


maraNamun jayiMchi laechenu mana prabhuvu naeAOdu mahima dhaeha
monarAO dhaalchenu Dhara samaaDhi bMDhamulanu Dhanyamuganu threMchi laechi
koRatha lanni theerchi jeeva varamu liyya vasuDhapaini ||maraNamun||

1. mariyayunu saloami modhalagu maguvalu sabaathu maru
dhinoadhayamunAO briya magu guruni dhaehamunakuAO booyAO barimaLMpuAO
dhailamulanu saragAO dheesikoni samaaDhi karugudheMchi kanulAOjooda
||maraNamun||


2. naeAOdu prabhusamaaDhi mukhamupai nunna raayi nevAOdu dheeyu karuNanu
manakai chaediya litlanuchu vaegAO jaeri yaa samaaDhi mooAOtha veedi yuMtAO
joochi migula vismayammu nMdhi rapudu ||maraNamun||


3. vaaru thella niluvutMgiAOthoa goorchunna paduchu vaaniAO joochi migula
bhayamuthoaAO jaeraraaka nilichiyunna vaari nathadugaaMchi yamma laara
bhayapadaku datMchu nooradiMche nuchithamuganu ||maraNamun||


4. koratha paini maraNa moMdhina najaraeyuAO daesu koraku migula vedhaku
chuMdina tharuNulaara mee prabhuMdu thirigi brathike nikka midhdhi saragapaethu
raadhi shiShya samithithoadAO jeppudaniye ||maraNamun||


5. maanithamuga meekita muMdhu prabhu vanina yatlu kaanAObadunu
galilaiya mMdhuAO gaana veLludMchu bhaasi thaanaruMdu palka vinuchu
dheena janulu jadisi migula dhigulu noMdhi vaNaki rapudu ||maraNamun||


6. modhata magdhalaenae mariyakuAO ganAObade natMchu sudhathi dhelpe shiShya
varulaku kodhuvalaeni sMthasamunAO goarke dheerAO brabhuniAO joodAO
badhilamaina yathnamulakuAO barAOgAO jaesi choochi rapudu ||maraNamun||


7. aMthHshathru vaina maraNamunu prabhuvu gelche sMthasiMchi sannuthiMthamu
vMtha laela bhakthulaara vaasthavamuga manala nitula nMthya dhinamu nMdhu
laepu namala dhaehamula nosMgu ||maraNamun||