నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
స్వర్గమునందున్న- దేవుని యొద్దనుండి
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
శోభ కలిగిన - ఆ దివ్య నగరము
వర్ణింప శక్యము - కానిదియే -2
బహు సహస్రముల - సూర్యుని కంటె -2
ప్రజ్వలించుచున్నది - మహిమవలెను
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
పరిపూర్ణమైన -సౌందర్యమును .
పృథ్వికి - ఆనందముగాను -2
భూరాజులందరు - మహిమ తెచ్చెడి -2
మహిమగల నగరము – ఇదియే
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
ధగధగ మెరయు - సూర్యకాంతం వలె
జ్వలించుచున్న- దైవనగరమందు -2
నీతిమంతులే - సూర్యునివలెను -2
నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
నను విడువక యెడబాయక
దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో
నను విడువక యెడబాయక
దాచితివా నీ చేతి నీడలో... నీ చేతి నీడలో
సిలువలో చాపిన రెక్కల నీడలో -2
సురక్షితముగ నన్ను దాచితివా -2
కన్నీటి బ్రతుకును నాత్యముగా మార్చి
ఆదరించిన యేసయ్యా -2
నను విడువక యెడబాయక
దాచితివా నీ చేతి నీడలో... నీ చేతి నీడలో .... ..
ఉన్నత పిలుపుతో నన్ను పిలచి -2
నీఉన్న చోటున నేనుండుటకై -2
పిలుపుకు తగిన మార్గము చూపి
నను స్థిరపరచిన యేసయ్యా -2
నను విడువక యెడబాయక
దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో
నను విడువక యెడబాయక
దాచితివా నీ చేతి నీడలో... నీ చేతి నీడలో .... ..