Showing posts with label Kamalakar. Show all posts
Showing posts with label Kamalakar. Show all posts
Vinaya vidheyatha bakthi sthri ki alakaram వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం
యోగ్యత కలిగిన భార్య భర్తకే
కిరీటం
ఆ. ప. సంఘానికి
ప్రతిరూపం – సంతోషానికి మూలం /2/
పురుషుని పక్కనుండి తీయబడిన నారి
సరియగు సహాయమై వుండాలని కోరి
/2/
స్త్రీనిగ
నిర్మించి పురుషునితో కలిపెను /2/
మేలు కలుగునట్లు జంటగా నిలిపెను/2/వినయ/
సృష్టిని కలిగించి మనుష్యుని నిర్మించి
సంతోషించుమని
సర్వమనుగ్రహించి /2/
వివాహబంధముతో
కుటుంబమును కట్టెను/2/
ఇంటికి దీపముగా ఇల్లాలిని నిలబెట్టెను /2/వినయ/
Putte yesudu nedu manaku punya margamu పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్యమార్గము
Andhra Kraisthava Keerthanalu, Christmas lyrics, Felix Andrew, Kamalakar, Kreesthu Raaga Ratnaalu Vol. 1
No comments
Song no: 110
- పుట్టె యేసుఁడు నేఁడు మనకు పుణ్యమార్గము జూపను పట్టి యయ్యెఁ బరమ గురుఁడు ప్రాయశ్చిత్తుఁడు యేసుడు ||పుట్టె||
- ధరఁ బిశాచిని వేఁడిన దు ర్నరులఁ బ్రొచుటకై యా పరమవాసి పాపహరుఁడు వరభక్త జన పోషుఁడు ||పుట్టె||
- యూద దేశములోను బేత్లె హేమను గ్రామమున నాదరింప నుద్భవించె నధములమైన మనలఁ ||బుట్టె||
- తూర్పు జ్ఞానులు కొందఱు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియు కొమరుని కర్పణము లిచ్చిరి ||పుట్టె||
Papini nenani prabhupadhamulakada పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము
Andhra Kraisthava Keerthanalu, Kamalakar, Kreesthu Raaga Ratnaalu Vol. 1, Pushpa Leela, S. J. Moses
No comments
Song no: 306
- పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము ఓ మనసా
- నరుని స్వనీతిచే దొరుకదు మోక్షము నరులను జూడకు యో మనసా
ధరనొక పుణ్యుడు దరచినలేడని పరమవేదములో గలదో మనసా ||పాపిని||
- జపతపములు మరి యుపవాసములును ఉపయోగింపవు ఓ మనసా
నెపములు జెప్పెడు అపవాదిని విడి కృపావాదినిగాని బ్రతుకో ఓ మనసా ||పాపిని||
- మానని ప్రేమచే మనుజుల బ్రోవగ మానవుడయ్యెను ఓ మనసా
మానుగ గల్వరి మ్రానిపై యేసుడు ప్రాణము నొసగెను ఓ మనసా ||పాపిని||
- మరణము నొందియు మరల సజీవుడై మనుజుల కగుపడెనో మనసా
మరణ బంధముల బరిమర్పిన ప్రభు సరిరక్షకు లిక లేరిల మనసా ||పాపిని||
- మార్పును బొందక మలిన తరుణము మరల లభింపదు మనసా
తీర్పుకాలమున తీర్పరి క్రీస్తని తిరముగ నమ్ముము యేసుని మనసా ||పాపిని||
పాపుల మిత్రుడు ప్రభు యేసునికడ పాపక్షమాపణ కలదో మనసా ||పాపిని||
Thrahimam kreesthu nadha త్రాహీ మాం క్రీస్తు నాధ దయ చూడ రావే
Andhra Kraisthava Keerthanalu, Bilmoria, Kamalakar, M. D. Shikha Mani, Madhura Seva, Nee charanamule, Nithya Santhoshini, Pilli, Puroshottham Chwodari
No comments
Pilli
Kamalakar
M. D. Shikha Mani
Nithya Santhoshini
Bilmoria
Song no: 313
త్రాహి మాం క్రీస్తు నాధ దయఁ జూడ రావే నేను దేహి యనుచు నీ పాదములే దిక్కుగాఁ జేరితి నిపుడు ||త్రాహి||
గవ్వ చేయురాని చెడ్డ కర్మేంద్రియాధీనుఁడనై రవ్వ పాలై నే నెంతో నెవ్వఁ బొందితిఁ త్రవ్వుచున్న కొలఁదిఁ పెరుఁగుఁ దరగదు నా పాప రాశి యివ్విధమునఁ జెడిపోతినినే నేమి సేతు నోహోహోహో ||త్రాహి||
నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తముఁ బూని చేయరాని దుష్కర్మములు చేసినాఁడను దయ్యాలరాజు చేతిలోఁ జేయి వేసి వాని పనులఁ జేయ సాగి నే నిబ్భంగిఁ జెడిపోయితి నే నయ్యయ్యయ్యొ ||త్రాహి||
నిబ్బర మొక్కించుకై నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుటకు ము త్తా నైతిని అబ్బురమైన ఘోర పా పాంధకార కూపమందు దబ్బున బడిపోతి నయ్యో దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహి||
నిన్నుఁ జేరి సాటిలేని నిత్యానంద మందఁబోవు చున్నప్పుడు నిందలు నా కెన్ని చేరినా విన్నదనము లేకుండ నీ వే నా మదికి ధైర్యమిచ్చి యన్నిట రక్షించి తివి నా యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహి||