Showing posts with label Jesus my hero. Show all posts
Showing posts with label Jesus my hero. Show all posts

Yesu devuni aradhikulam venuka chudani sainikulam యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం

Song no:

    యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం (2)
    మరణమైన, శ్రమ ఎదురైన, బెదిరిపోని విశ్వాసులం (2)

    మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం (2)
    ప్రాణమిచ్చి, మృతిని గెల్చిన, యేసురాజే మా అతిశయం (2)

  1. షద్రకు మేషాకు అబెద్నగోలను అగ్నిగుండంలోత్రోయబోగా(2)
    నెబుకద్నెజరుమాకు చింతియే లేదులే మా దేవుడు మమ్మును రక్షించులే (2)
    అని తెగించి, విశ్వసించి, ముగ్గురు నలుగురై జయించిరే (2)   {మా యేసుడే}

  2. శత్రుసైన్యము దండెత్తి వచ్చెగా యెహొషాపాతు ప్రార్ధిన చేసెగా (2)
    యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా భయమె లేక వారు జయగీతం పాడగా(2)
    ఆత్మతోడ, స్తుతియిస్తుండ, దేవుడె యుద్ధం జరిగించెగా (గెలిపించెగా) (2)  {మా యేసుడే}

  3. శత్రు గొల్యతు సవాలు విసిరెగా దేవుని ప్రజలంతా మౌనమాయెగా (2)
    ఒక్క దావీదు రోషముతో లేచెగా జీవము గల దేవుని నమాన్ని చాటెగా (2)
    చిన్న రాయి, వడిసె తోడ, ఆత్మశక్తితో జయించెగా (2)   {మా యేసుడే}